Home /News /technology /

MADE IN INDIA SMARTPHONE MICROMAX IN NOTE 2 LAUNCHED WITH MEDIATEK HELIO G95 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Micromax In Note 2: ఐఫోన్ 13 డిజైన్‌తో మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర రూ.12,490 మాత్రమే

Micromax In Note 2: ఐఫోన్ 13 డిజైన్‌తో మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర రూ.12,490 మాత్రమే
(image: Micromax)

Micromax In Note 2: ఐఫోన్ 13 డిజైన్‌తో మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర రూ.12,490 మాత్రమే (image: Micromax)

Micromax In Note 2 | మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. యాపిల్ ఐఫోన్ 13 (Apple iPhone 13), సాంసంగ్ గెలాక్సీ ఎస్21 డిజైన్లు కలిపి మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 రిలీజ్ చేసింది కంపెనీ.

    మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 (Micromax In Note 2) మోడల్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ యాపిల్ ఐఫోన్ 13 (iPhone 13) లాగా ఉండటం విశేషం. కెమెరా మాడ్యూల్ డిజైన్ సాంసంగ్ గెలాక్సీ ఎస్21 (Samsung Galaxy S21) మోడల్‌ను తలపిస్తుంది. ఈ రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల డిజైన్ మిక్స్ చేసి మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,490 మాత్రమే. ఇందులో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల రిలీజ్ అయిన రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌తో పాటు త్వరలో రిలీజ్ కానున్న రెడ్‌మీ నోట్ 11ఎస్ మోడల్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

    మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 సేల్ ఎప్పుడు


    మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 30 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఇంట్రడక్టరీ ధర రూ.12,490 మాత్రమే. ఈ ధర త్వరలో పెరగొచ్చు. బ్యాంకు కార్డుతో కొంటే అదనంగా డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. కేవలం 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మాత్రమే లభిస్తుంది.

    Vivo Y53s: ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది... బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు


    మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ఫీచర్స్


    మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్, జంక్ వేర్ ఉండదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ లభించనుంది.

    Samsung Galaxy A52s: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,000 తగ్గింది

    మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విషయానికి వస్తే ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ Samsung GM1 ISOCELL ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా వెనుకవైపు ఉన్నాయి. నైట్ మోడ్, ఏఐ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

    మైక్రో మ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెమొరీ పెంచుకోవడానికి మైక్రోఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉండటం విశేషం. 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఓక్, బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Micromax, Mobile News, Mobiles, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు