ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,777 మాత్రమే... మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫీచర్స్ ఇవే

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.8,000 లోపేనా? రూ.7777 ధరతో మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ రిలీజైంది.

news18-telugu
Updated: August 6, 2020, 1:03 PM IST
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,777 మాత్రమే... మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫీచర్స్ ఇవే
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,777 మాత్రమే... మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫీచర్స్ ఇవే
  • Share this:
తక్కువ బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం లావా కంపెనీ లావా జెడ్66 మోడల్‌ను లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,777 మాత్రమే. డ్యూయెల్ 4జీ సపోర్ట్, 3,950ఎంఏహెచ్ బ్యాటరీ, 6.08 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 13+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరాలో బ్యూటీ మోడ్, నైట్ మోడ్, హెచ్‌డీఆర్ మోడ్, బర్స్ట్ మోడ్, పనోరమా, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలలో కూడా లావా జెడ్66 స్మార్ట్‌ఫోన్‌ను కొనొచ్చు. రూ.8,000 లోపు బడ్జెట్‌లో బేసిక్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం ఈ ఫోన్ తీసుకొచ్చింది లావా కంపెనీ. మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ ఇది.

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్

Realme C15: 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవేలావా జెడ్66 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.08 అంగుళాల హెచ్‌డీ+
ర్యామ్: 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్
రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,950ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ 4జీ సిమ్
కలర్స్: మెరైన్ బ్లూ, బెర్రీ రెడ్, మిడ్‌నైట్ బ్లూ
ధర: రూ.7,777
Published by: Santhosh Kumar S
First published: August 6, 2020, 1:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading