స్మార్ట్‌ఫోన్ అంటే చైనా కంపెనీలే గుర్తొస్తాయి. కానీ ఇండియన్ కంపెనీలు కూడా ఉన్నాయి. భారతదేశానికి చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా ఇంటర్నేషనల్ కొత్త మొబైల్‌ను రిలీజ్ చేసింది. లావాకు చెందిన పాపులర్ జెడ్ సిరీస్‌లో లావా జెడ్61 ప్రో మోడల్‌ను పరిచయం చేసింది. రెండేళ్ల క్రితం లావా జెడ్61 స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు లావా జెడ్61 ప్రో మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్. ధర రూ.5,774 మాత్రమే. ఇటీవల చైనా ఉత్పత్తులు బ్యాన్ చేయాలన్న వాదనలు బాగా పెరిగాయి. చైనా స్మార్ట్‌ఫోన్ల గురించీ చర్చ వచ్చింది. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్లు తయారు చేస్తున్న కంపెనీల గురించి యూజర్లు సెర్చ్ చేశారు. లావా ఇంటర్నేషనల్ భారతదేశానికి చెందిన కంపెనీ. ఇప్పటికే పలు మోడల్స్‌ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇప్పుడు లావా జెడ్61 ప్రో మోడల్‌ను విడుదల చేసింది.
Redmi Note 9: రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉచితం... యాక్టివేట్ చేయండి ఇలా
లావా జెడ్61 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
ర్యామ్: 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3100 ఎంఏహెచ్
ధర: రూ.5,774
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Smartphone, Smartphones