స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌గా పేరొందిన BharOSపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాల ఎకోసిస్టమ్‌ను పూర్తిగా ఆక్రమించిన గూగుల్, తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలతోనే భారోస్ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచీ ప్రత్యేక ఓఎస్ ఉండాల్సిన అవసరంపై జోరుగా చర్చలు సాగాయి. అయితే తాజాగా ఈ డొమెస్టిక్ ఓఎస్‌ను కేంద్ర మంత్రులు తాజాగా టెస్ట్ చేశారు. ఈ టెక్నాలజీని పరిశీలించారు. ఈ నేపథ్యంలో BharOS ప్రత్యేకతలు ఏంటి, దీనిపై ఎందుకు పెద్ద అంచనాలు ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందాం.
* సంచలన BharOS
భారత్ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్‌గా BharOS పేరు సంపాదించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్(IIT-M) ఇంక్యుబేట్ చేసిన సంస్థ JandK ఆపరేషన్స్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఏడాది సమయం పట్టింది.
అయితే భారోస్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైందా, నూటికి నూరు శాతం మేక్-ఇన్-ఇండియా ప్రొడక్ట్ యేనా అనే ప్రశ్నలకు కాదు అనే సమాధానమే వస్తోంది. BharOS అనేది Linux కెర్నల్‌పై ఆధారపడి పని చేస్తుంది. ఫిన్నిష్ జాతీయుడు డెవలప్ చేసిన Linux ఆపరేటింగ్ సిస్టమ్‌లో భారోస్ ఒక భాగం.
* BharOS ప్రత్యేకతలు
BharOS అనేది Linux కెర్నల్‌పై ఆధారపడిన ఆపరేటింగ్ సిస్టమ్ అని IIT మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి తెలిపారు. రూట్ ఆఫ్ ట్రస్ట్, చైన్ ఆఫ్ ట్రస్ట్ వంటి భద్రతా ప్రోటోకాల్‌లతో ఇది వస్తుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏవైనా మార్పులు చేస్తే పని చేయటం ఆగిపోయే విధంగా దీన్ని రూపొందించారు. దీనితోపాటు నిర్దిష్ట ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీసుల(PASS)యాప్‌లకు కూడా యాక్సెస్ అందిస్తుంది.
పూర్తిగా టెస్ట్ చేసిన, సెక్యూరిటీ-ప్రైవేట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న యాప్‌ల క్యూరేటెడ్ లిస్ట్‌కు PASSను యాక్సెస్‌ను అందిస్తుందని IIT-మద్రాస్ ఒక ప్రకటనలో తెలిపింది. లోకల్‌గా ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లకు కూడా మద్దతు ఇస్తుందని భారోస్‌ను డెవలప్ చేసిన సంస్థ డైరెక్టర్ కార్తీక్ అయ్యర్ చెప్పారు. సెక్యూరిటీ ప్యాచ్‌లు, బగ్ పరిష్కారాలతో సహా అప్‌డేట్ చేసిన OS వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది.
* ఆండ్రాయిడ్‌కి, దీనికీ తేడా ఏంటి?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒరిజినల్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్‌లో ఒక భాగమే. BharOS కూడా అదే సాఫ్ట్‌వేర్‌ను ఆపరేటింగ్ సిస్టమ్‌కు బేస్‌గా ఉపయోగిస్తుంది కాబట్టి.. దీనికి, ఆండ్రాయిడ్‌కి మధ్య సిమిలారిటీస్ ఉంటాయి. అయితే ప్రెజెంటేషన్‌లోనే అసలు తేడా ఉంటుంది. ఆండ్రాయిడ్ క్రోమ్, గూగుల్ మ్యాప్స్ వంటి అనేక డీఫాల్ట్ యాప్‌లతో వస్తుంది. భారోస్‌లో డీఫాల్ట్ యాప్స్ ఉండవు. యూజర్స్‌కి ఏం కావాలో అదే వినియోగించుకోవచ్చు.
* భారోస్ నిజంగా అవసరమా?
యాప్ మార్కెట్‌లో ఒక లెవెల్‌లో న్యాయమైన పోటీ అవసరం అని ఐఐటీ-మద్రాస్ డైరెక్టర్ కామకోటి అన్నారు. మొబైల్ అనేది డిజిటల్ హోమ్ లాంటిది. దానిలో డీఫాల్ట్‌గా వచ్చే యాప్స్ అన్నీ కూడా అపరిచితులు లాంటివి. వాటిని వాడాలనే ఉత్సాహం యూజర్‌కి రాదు అని కామకోటి చెప్పారు. యూజర్‌కి ఏది ఇష్టమో దానికి అనుమతి ఇవ్వాలి తప్ప నచ్చినా నచ్చకపోయినా పలానా యాప్స్ ఉపయోగించాలని బలవంతం చేయకూడదు అని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ సరైన పోటీ లేదు. ఇకపై ఇష్టమొచ్చినట్లుగా ఆడుకునే గ్రౌండ్‌ని ఇస్తున్నామని చెప్పారు.
* BharOSలో డేటా ఎలా షేర్/నిల్వ చేస్తారు?
"సమాచారం యూజర్, సంస్థలకు చెందినవి కాబట్టి, ఏ డేటాను సేకరించాలనే నిర్ణయం వారికే వదిలేస్తున్నాం. యూజర్ అనుమతి లేకుండా ఏ సమాచారాన్ని ఏ సంస్థ కూడా సేకరించలేదు" అని IIT-మద్రాస్ డైరెక్టర్ చెప్పారు.
హ్యాండ్‌సెట్‌లో భారోస్‌ను ఎలా లోడ్ చేస్తారు?
డెవలప్‌మెంట్ మాన్యువల్‌లు, ఇతర వివరాలు అందుబాటులో ఉన్న ఏ ఫోన్‌లో అయినా భారోస్‌ను లోడ్ చేయవచ్చు. కాకపోతే హార్డ్‌వేర్ విక్రేత తన డెవలప్‌మెంట్ మాన్యువల్స్‌ను షేర్ చేయాలి. జనవరి 24న BharOSను విజయవంతంగా టెస్ట్ చేసినప్పుడు ఈ OS ఇన్‌స్టాల్ చేసిన ఫోన్‌లలో Google Pixel కూడా ఉంది.
ప్రస్తుతం ఎక్కడ వాడుతున్నారు?
ప్రస్తుతానికి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను యూజర్స్ డీల్ చేయాల్సిన, స్ట్రిక్ట్ ప్రైవసీ, సెక్యూరిటీ అవసరాలు ఉన్న సంస్థలకు BharOSను అందిస్తున్నారు. ప్రజాదరణ, డిమాండ్ ఆధారంగా ఈ సిస్టమ్‌ను సులభంగా విస్తరించేందుకు వీలవుతుంది.
ఇది కూడా చదవండి : మోటొరోలా నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రానున్న డివైజ్‌లు
* BOSSకి ఏమైంది?
2007లోమైక్రోసాఫ్ట్ విండోస్‌కు ఆల్టర్నేటివ్‌గా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(CDAC) నమోదు చేసిన ఓఎస్ పేరు BOSS. దీన్ని కూడా Linux నుంచే తీసుకున్నారు. CDAC అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) క్రింద నడుస్తున్న ప్రభుత్వ సంస్థ. ఇది నాలుగు ఎడిషన్లలో విడుదలైంది. పర్సనల్ యూసేజ్ కోసం BOSS డెస్క్‌టాప్, స్కూల్స్ కోసం EduBOSS, BOSS అడ్వాన్స్‌డ్ సర్వర్, BOSS మూల్ అని వచ్చాయి. కాకపోతే వీటిని ప్రధానంగా రక్షణ రంగంలోని క్లయింట్‌ల కోసం డెవలప్ చేశారు. చొరబాటు, సైబర్ దాడులకు దూరంగా ఇది ఉంటుంది.
ఎకనామిక్ టైమ్స్ 2014లో ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రభుత్వ సహకారం లేక, పెట్టుబడుల కొరత కారణంగా క్రమంగా బలహీనపడింది. OSకి అప్‌డేట్‌లు చాలా అరుదుగా ఉంటాయని నివేదిక పేర్కొంది, కస్టమర్ సపోర్ట్ కూడా జీరో. దీంతో ఇది అందరికీ అందుబాటులోకి రాలేకపోయింది.
* భారోస్ మరో బాస్ అవుతుందా?
ప్రస్తుత ప్రభుత్వ వైఖరి చూస్తుంటే భారోస్ మరో బాస్ అయ్యే పరిస్థితి లేదు. దీన్ని జనవరి 24న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ టెస్ట్ చేశారు. అదే రోజున కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలు ఛాలెంజెస్‌ను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేశాయి. "టెస్ట్ చేసిన రోజు నుంచే ఛాలెంజ్ ప్రారంభమవుతుంది. నేను అలసిపోవాలనుకోవట్లేదు. చాలా ఇబ్బందులు ఉంటాయని కూడా తెలుసు. ఎందుకంటే, చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇలాంటి వ్యవస్థ విజయవంతం కాకూడదనుకునే ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి, చాలా జాగ్రత్తగా, పట్టుదలతో ఉండాలి. దీన్ని సక్సెస్ చేసే వరకూ పని చేస్తూ ఉండాలి" అని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.