హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioPhone Next: భారతీయుల కోసం భారత్‌లో రూపొందించిన జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌... 7 బెస్ట్ ఫీచర్స్ ఇవే

JioPhone Next: భారతీయుల కోసం భారత్‌లో రూపొందించిన జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌... 7 బెస్ట్ ఫీచర్స్ ఇవే

JioPhone Next: భారతీయుల కోసం భారత్‌లో రూపొందించిన జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌... 7 బెస్ట్ ఫీచర్స్ ఇవే
(image: Jio)

JioPhone Next: భారతీయుల కోసం భారత్‌లో రూపొందించిన జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌... 7 బెస్ట్ ఫీచర్స్ ఇవే (image: Jio)

JioPhone Next | రిలయన్స్ జియో మరో సంచలనం జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది రిలయన్స్ జియో. మరి జియోఫోన్ నెక్స్‌ట్‌లో బెస్ట్ 7 ఫీచర్స్ గురించి తెలుసుకోండి.

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) నుంచి రిలీజ్ కానున్న జియో ఫోన్ నెక్స్ట్ (JioPhone Next) పై భారత దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉంటాయి? ధర ఎంత ఉండనుంది? అనే విషయాలు తెలుసుకోవాలని మొబైల్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్ సోమవారం జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది. 'మేకింగ్ ఆఫ్ జియోఫోన్ నెక్స్ట్' పేరుతో ఓ వీడియోని విడుదల చేసిన రిలయన్స్ జియో.. ఫోన్ గురించి ఆసక్తికర ఇన్ఫర్మేషన్ పంచుకుంది. జియోఫోన్ నెక్స్ట్ అనేది అడ్వాన్స్డ్ ఫీచర్లతో సరసమైన ధరతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. జియో తన ఇతర సేవల మాదిరిగానే జియోఫోన్ నెక్స్ట్‌ను కూడా భారత్‌లో, భారతీయులతో, భారతీయుల కోసం రూపొందించినట్టు వీడియోలో పేర్కొంది.

ఈ ఫోన్ ప్రతి భారతీయుడికి సమాన అవకాశం, డిజిటల్ టెక్నాలజీకి సమాన యాక్సెస్ అందించేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ని కూడా టీజ్ చేసింది. వెనుకవైపు ఉన్న 13 మెగాపిక్సెల్ కెమెరా స్పష్టంగా కనిపించింది. సెప్టెంబర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించినట్లుగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ సాయంతో నడుస్తుంది. అయితే తాజాగా రిలీజ్ అయిన వీడియో ద్వారా ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుస్తున్నాయి. ఆ వివరాలు ఓసారి చూద్దాం.

Samsung Galaxy M32 5G: రూ.20,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,199 ధరకే కొనండి ఇలా

మేకింగ్ ఆఫ్ జియోఫోన్ నెక్స్ట్ వీడియో.. జియోఫోన్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత ప్రగతి ఓఎస్ (Pragati OS) పై నడుస్తుందని తెలిపింది. ఈ ఫోన్ ను జియో, గూగుల్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. సరసమైన ధరతో స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ అందిస్తూ అందరినీ ప్రగతిపథంలో నడిపించేందుకే ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు జియో చెబుతోంది. రిలయన్స్ జియో ఈ ఫోన్ లో క్వాల్‌కామ్ మొబైల్ ప్రాసెసర్‌ అమర్చినట్లు ప్రకటించింది. కానీ ఆ చిప్‌సెట్ మోడల్ గురించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రాసెసర్ ఫోన్ పనితీరు, ఆడియో, బ్యాటరీని ఆప్టిమైజ్ చేస్తుందని జియో పేర్కొంది.

జియో కంపెనీ జియోఫోన్ నెక్స్ట్ కు సంబంధించిన ముఖ్యమైన ఫీచర్లను కూడా ఒక్కోటిగా ప్రకటించింది. ఆ ఫీచర్స్ ఏవో తెలుసుకుందాం..

Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చి చూడండి

1. వాయిస్ అసిస్టెంట్: ఫోన్ ఆపరేట్ చేయడంలో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ యూజర్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇతర విషయాలతోపాటు యాప్‌లను తెరవడానికి, సెట్టింగ్‌లను మేనేజ్ చేయడానికి.. ఇంటర్నెట్ నుంచి కంటెంట్‌ని ఈజీగా పొందడానికి ఉపయుక్తంగా ఉంటుంది.

2. లిజన్ ఫీచర్(Listen Feature): స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది. ఆ సమయంలో ఫోన్ లో ఇచ్చిన 'లిజన్' ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇది యూజర్లు స్క్రీన్‌లో ఏదైనా కంటెంట్‌ను ఎంచుకున్న భాషలో బిగ్గరగా చదవడానికి అనుమతిస్తుంది.

3. ట్రాన్స్‌లేట్: ఏదైనా స్క్రీన్‌ని యూజర్ తాను ఎంపిక చేసుకున్న భాషకు అనువదించడానికి ‘ట్రాన్స్‌లేట్’ ఫీచర్ సహాయం చేస్తుంది. యూజర్లు విదేశీ భాషలో ఉన్న కంటెంట్ ను సులభంగా చదవగల భాషలోకి అనువదించుకోవచ్చు. చదవగలరు.

Vivo Y3s: వివో నుంచి రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

4. స్మార్ట్ కెమెరా: జియోఫోన్ స్మార్ట్, శక్తివంతమైన కెమెరాతో వస్తుంది. ఇది పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్ వంటి మరిన్ని ఫొటోగ్రఫీ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది. యూజర్లు తమ ఫొటోలను ఎమోషన్స్, సంబరాల(emotions and festivities)తో మెరుగు పరిచేందుకు "కస్టమ్ ఇండియన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్స్(custom Indian augmented reality filters)" కూడా ఇందులో అందించారు. ప్రొఫెషనల్ కెమెరా మాదిరిగానే బ్లర్ డ్ బ్లాక్ గ్రౌండ్ తో ఫొటోలను క్యాప్చర్ చేయడానికి 'పోర్ట్రెయిట్' మోడ్ ఉపయోగపడుతుంది. నైట్ మోడ్ తక్కువ వెలుతురులో కూడా ఫొటోలు తీయడానికి సహాయపడుతుంది.

5. ప్రీలోడెడ్ జియో, గూగుల్ యాప్‌లు: ఈ ఫోన్ అన్ని ఆండ్రాయిడ్ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇది అనేక ప్రీలోడెడ్ జియో, ఫ్రీఇన్‌స్టాల్డ్ గూగుల్ యాప్‌లను కలిగి ఉంటుంది. యూజర్లు అవసరమైన ఇతర యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

6. ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు: ఈ ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఇది సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు మంచి ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.

7. సుదీర్ఘ బ్యాటరీ జీవితం: కొత్తగా రూపొందించిన ప్రగతి ఓఎస్ యూజర్లకు మెరుగైన పనితీరును అందిస్తూనే లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

జియో కంపెనీ ఫోన్ ధర, లభ్యత వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Google, Jio, JioPhone Next, Mobile News, Mobiles, Reliance Jio, Smartphone

ఉత్తమ కథలు