స్మార్ట్‌ఫోన్ యూజర్లకు రిలయెన్స్ జియో నుంచి మరో శుభవార్త. మేడ్ ఇన్ ఇండియా జియో బ్రౌజర్ వచ్చేసింది. గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా లంటి బ్రౌజర్లకు పోటీగా జియో ప్రత్యేకమైన బ్రౌజర్ తీసుకొచ్చింది. బీటా వర్షన్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. యూజర్లు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని జియోబ్రౌజర్ వాడుకోవచ్చు. మల్టీప్రాసెస్ క్రోమియం బ్లింక్ ఇంజిన్ ద్వారా ఈ బ్రౌజర్ పనిచేస్తుంది. మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా యాప్స్‌కు డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఇప్పటికే చైనాకు చెందిన యూసీ బ్రౌజర్‌ను బ్యాన్ చేశారు. ఇప్పుడు వీటన్నింటికీ పోటీనిస్తూ జియో బ్రౌజర్ వచ్చేసింది.
జియో బ్రౌజర్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. సెక్యూర్ పిన్‌తో ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ ఉంటుంది. ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజ్ చేసిన కంటెంట్‌ను పిన్ సాయంతో బుక్‌మార్క్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ డౌన్లోడ్ మేనేజర్ ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా మీకు కావాల్సిన ఫైల్స్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇక మీరు ఎక్కువగా చూసే వెబ్‌సైట్స్‌ని వెంటనే యాక్సెస్ చేసేందుకు క్విక్ లింక్స్ ఉంటాయి. వాటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. జియోబ్రౌజర్ వెబ్ బ్రౌజర్ బేస్డ్ గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. హై రెజల్యూషన్ వీడియోలు స్ట్రీమింగ్ చేయొచ్చు. ఇది పూర్తిగా భారతీయ యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బ్రౌజర్.
Poco X3: ఇండియాలో రిలీజైన పోకో ఎక్స్3... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే
Realme Narzo 20 Series: రియల్మీ నార్జో 20 సిరీస్‌లో 3 స్మార్ట్‌ఫోన్స్... ఏది బెస్ట్ తెలుసుకోండి
We are ready with our new Avatar! India's most popular browser is soon going to be faster, more secure and with lots of additional exciting features. Stay tuned!!#jio #MadeInIndia #Vocal4Local #AatmaNirbhar #browser pic.twitter.com/B3e2hUyOoZ
— JioBrowser (@JioBrowser) September 3, 2020
జియో బ్రౌజర్ ద్వారా మీరు గతంలో కన్నా వేగంగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయొచ్చు. ఇది లైట్ వెయిట్ వెబ్ బ్రౌజర్. ఫైల్ సైజ్ 27ఎంబీ మాత్రమే. ఇప్పటికే కోటికి పైగా డౌన్లోడ్స్ ఉండటం విశేషం. స్థానిక భాషలో కూడా సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ న్యూస్, వీడియోస్ యాక్సెస్ చేయొచ్చు. లైవ్ క్రికెట్ స్కోర్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇందులో క్విక్ షేర్, క్యూఆర్ కోడ్ స్కానర్, ప్రింట్, సేవ్ యాజ్ పీడీఎఫ్, ఆఫ్‌లైన్ పేజెస్, డెస్క్ టాప్ మోడ్, మెమొరీ, బ్యాటరీ సేవర్, వాయిస్ సెర్చ్, ఫోర్స్ జూమ్, ఎగ్జిట్ పాప్ అప్, డార్క్ థీమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Atmanirbhar Bharat, Jio, Mobile App, Reliance Jio, Technology