Alert: ఆ ల్యాప్‌టాప్ ఉంటే ఫ్లైట్ ఎక్కనివ్వరు జాగ్రత్త

మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ మోడల్స్‌తో రిస్క్ ఉన్నట్టు యాపిల్ కంపెనీ జూన్ 20న వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

news18-telugu
Updated: August 26, 2019, 5:59 PM IST
Alert: ఆ ల్యాప్‌టాప్ ఉంటే ఫ్లైట్ ఎక్కనివ్వరు జాగ్రత్త
Alert: ఆ ల్యాప్‌టాప్ ఉంటే ఫ్లైట్ ఎక్కనివ్వరు జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 26, 2019, 5:59 PM IST
మీరు తరచూ ఫ్లైట్ జర్నీ చేస్తుంటారా? ల్యాప్‌టాప్‌తో ప్రయాణిస్తుంటారా? ఒకవేళ మీ దగ్గర 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ ఉంటే ఫ్లైట్ ఎక్కనివ్వరు. ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఎవరూ 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ తీసుకురావొద్దని కోరింది. 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లోని బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుండటంతో సేఫ్టీ రిస్క్ ఉంటుందని ఇటీవల యాపిల్ గుర్తించింది. మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ మోడల్స్‌తో రిస్క్ ఉన్నట్టు యాపిల్ కంపెనీ జూన్ 20న వెబ్‌సైట్‌లో వెల్లడించింది. 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌కు చెందిన కొన్ని ల్యాప్‌టాప్స్‌లో బ్యాటరీ ఎక్కువగా వేడి అవుతోందని, ఫైర్ సేఫ్టీ రిస్క్ ఉండొచ్చని యాపిల్ గుర్తించింది. ఇలాంటి సమస్యలు ఉన్న ల్యాప్‌టాప్స్ 2015 సెప్టెంబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు అమ్ముడుపోయాయి.





2015 సెప్టెంబర్ నుంచి 2017 ఫిబ్రవరి నాటి పాత జెనరేషన్ 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌ ల్యాప్‌టాప్స్‌లో ఓవర్ హీట్ సమస్యల్ని యాపిల్ గుర్తించిన కారణంగా వాటిని ఎయిర్‌పోర్టుకు తీసుకురావొద్దని ప్రయాణికులను కోరుతున్నాం. సమస్యలు ఉన్నల్యాప్‌టాప్స్‌తో ప్రయాణించొద్దని హ్యాండ్-బ్యాగేజీ లేదా చెక్డ్‌ఇన్ బ్యాగేజీలో అలాంటి ల్యాట్‌టాప్స్ లేకుండా చూడాలి.
డీజీసీఏ ట్వీట్ సారాంశం
Loading...
బ్యాటరీ సమస్యలు కొన్ని ల్యాప్‌టాప్స్‌లో ఉందని గుర్తించిన యాపిల్... బ్యాటరీలను ఉచితంగా రీప్లేస్‌ చేస్తామని వెల్లడించింది. యాపిల్ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి సమస్యలు ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు.

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో 'మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్' ప్రారంభం... స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే

IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

New Smartphone: 4 రోజుల్లో 4 స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... వీటిలో ఏది బెటర్?
First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...