Home /News /technology /

దేశంలో చౌకైన SD888 ఫోన్ Realme GT 5G!

దేశంలో చౌకైన SD888 ఫోన్ Realme GT 5G!

రియ‌ల్‌మి జీటీ మాస్ట‌ర్ ఎడిష‌న్‌, రియ‌ల్‌మి జీటీ 5జీ

రియ‌ల్‌మి జీటీ మాస్ట‌ర్ ఎడిష‌న్‌, రియ‌ల్‌మి జీటీ 5జీ

ప్ర‌ముఖ మొబైల్ కంపెనీ రియ‌ల్‌మి భార‌తీయ మార్కెట్‌లోకి రియ‌ల్‌మి జీటీ-5జీ ఫొన్ విడుద‌ల చేసింది. అధునాత ఫీచ‌ర్‌ల‌తోపాటు 5జీ టెక్నాల‌జీ ఫొన్‌గా వినియోగ‌దారుల ముందుకు రియ‌ల్‌మి తీసుకొచ్చింది.

    ప్ర‌ముఖ మొబైల్ కంపెనీ రియ‌ల్‌మి భార‌తీయ మార్కెట్‌లోకి రియ‌ల్‌మి జీటీ-5జీ ఫొన్ విడుద‌ల చేసింది. అధునాత ఫీచ‌ర్‌ల‌తోపాటు 5జీ టెక్నాల‌జీ ఫొన్‌గా వినియోగ‌దారుల ముందుకు రియ‌ల్‌మి తీసుకొచ్చింది. ఈ ఏడాది స్నాప్‌డ్రాగన్ 888 (SD888) ఫోన్ విడుద‌ల అయ్యాయి. సామ్‌సంగ్ ఎస్‌21 5జీ సిరీస్‌, ఐక్యూఓఓ 7 లెజెండ్ 5జీ, ఆర్వోజీ ఫోన్ 5 సిరీస్‌, వ‌న్‌ప్లెస్ 9 సిరీస్‌, షియోమి ఎమ్ఐ 11ఎక్స్ 5జీ, షియోమి ఎమ్ఐ 11 అల్ట్రా వీటితో పాటు షియోమి ఎమ్ఐ 11ఎక్స్ SD888లో అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా రూ.29,000 ధ‌ర‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. తాజాగా రియ‌ల్‌మి సీఈఓ మాధవ్ శేత్ రియ‌ల్‌మి జీటీ 5జీ చౌక‌ధ‌ర‌కు ల‌భిస్తున్న మోడ‌ల్ SD888 టెక్నాల‌జీ మొబైల్ అని ట్వీట్ ద్వారా ప్ర‌క‌టించారు.
    రియ‌ల్‌మి జీటీ 5జీ ఇండిలో అత్యంత త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులో ఉండ‌బోతుంద‌ని మాధ‌వ్ శేత్ పేర్కొన్నారు. మొద‌ట దీని ధ‌ర సుమారు రూ.30,000 ఉంటుంద‌ని ప్ర‌చారం సాగింది. కానీ ఎమ్ఐ 11ఎక్స్ 5జీ కంటే త‌క్కువ‌కే ల‌భిస్తుంద‌ని మాధ‌వ్ శేత్ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు.
    టెక్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఒక మోడ‌ల్ రియ‌ల్‌మి జీటీ 5జి 8జీబీ రామ్‌తో 128 స్టోరేజ్ మెమోరీతో మ‌రో మోడ‌ల్ 12జీబీ రామ్ +256 స్టోరేజీతో ఇండియా మార్కెట్‌లోకి రానుంది. బ్లూ, సిల్వ‌ర్, రేసింగ్ ఎల్లో రంగుల్లో మొబైల్ అందుబాటులో ఉంది.
    రియ‌ల్‌మి మ‌రో నూత‌న ప్రాడ‌క్ట్‌లు అదే రియ‌ల్‌మి బుక్ (స్లిమ్‌) ల్యాప్‌టాప్ స్నాప్‌డ్రాగన్ 778జీతో రియ‌ల్‌మి జీటి మాస్టార్ ఎడిష‌న్‌తో పాటు రియ‌ల్‌మి జీటీని ప్ర‌క‌టించింది. మాస్ట‌ర్ ఎడిష‌న్ ఫోన్ ర‌కాల్లో 8జీబీ రామ్ +128 స్టోరేజీ, 8 జీబీ రామ్‌, +256 జీబీ స్టోరేజీ ఉన్నాయి. ఈ మోడ‌ల్‌లు సుమారు రూ.25,999, రూ.27,999 ఉండవ‌చ్చ‌ని అంచనా. ఇవి కాస్మోబ్లాక్‌, గ్రే, ల్యూమా వైట్ రంగుల్లో అందుబాటులో ఉండ‌నున్నాయి. రియ‌ల్‌మి బుక్ సొంత దేశీయ మార్కెట్‌ చైనాలో కూడా విడుద‌ల కానుంది. అక్క‌డి ధ‌ర‌ల ప్ర‌కారం 4,999 యువాన్‌లుగా నిర్ధారించారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: 5G Smartphone, India, Realme, Smartphones

    తదుపరి వార్తలు