ఈ కారు రేటు రూ.14 కోట్లు... దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?

Electric Cars : ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారిస్తోంది. దాదాపు అన్ని దేశాలూ... ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తున్నాయి. మరి ఈ కొత్త కారు ఎలాంటిదో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 7:49 AM IST
ఈ కారు రేటు రూ.14 కోట్లు... దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?
లోటస్ ఎవియా ఎలక్ట్రిక్ కార్ (Image : Twitter / Frank Dida)
Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 7:49 AM IST
Evija Electric Car : కారంటే... నాలుగు చక్రాలు... నలుగురు కూర్చునేందుకు సీట్లు... డీజీల్, పెట్రోల్ వెర్షన్లు... ఇవన్నీ రొటీన్. ప్రపంచంలో చాలా తక్కువ మంది దగ్గర ఉండే కారు కావాలనుకుంటే... తాము తయారుచేసిన 'ఎవియా' ఎలక్ట్రిక్ సూపర్ కార్‌ను ఎంపిక చేసుకోమంటోంది బ్రిటన్‌కి చెందిన ఆటో కంపెనీ లోటస్. సాధారణంగా చిన్న స్పోర్ట్స్ కార్లను తయారుచేసే లోటస్... ఈసారి 2 మిలియన్ డాలర్ల (రూ.13,78,10,000)... 1900 హార్స్ పవర్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఫలితంగా ఇది రోడ్ కార్లలో ప్రపంచంలోనే పవర్‌ఫుల్ సిరీస్ మోడళ్లలో ఒకటైంది. జస్ట్ 3 సెకండ్లలో... 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు... గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.


స్పార్ట్స్ కార్ ఫ్యాన్స్‌కి ఎవిజా బాగా నచ్చుతుందని లోట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిల్ పొఫామ్ తెలిపారు. దీని పేరు ఎవిజా అని ఉన్నా... ఎవియా అని పలకాలని తెలిపారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇవ్వవనీ, బ్యాటరీలు హీట్ ఎక్కిపోతాయనీ... అందువల్లే లంబోర్గినీ, ఫెర్రారీ లాంటి కంపెనీలు... ఎలక్ట్రిక్ కార్లు తయారుచేయట్లేదన్న ఆయన... తాము మాత్రం అన్ని సమస్యలకు చెక్ పెట్టి... సరైన కారును తయారుచేశామన్నారు.
పినిన్‌ఫారినా బటిస్టా, రిమాక్ సి టూ కార్లకు ఎవియా పోటీగా నిలుస్తోంది. దీని బరువు అంతా కలిపి... 1678 కేజీలు. దీని డోర్లకు అద్దాలు ఉండవు. వాటికి బదులుగా ఫ్రంట్ ఫెండర్స్‌కి కెమెరాలు అమర్చారు. దీని బ్యాటరీ... 18 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. 400 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుందని లోటస్ తెలిపింది. వచ్చే ఏడాది నుంచీ ఈ కారు అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ వివరించింది.
First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...