బిల్ గేట్స్... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని అపర కుబేరుడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరు. జీవితంలో ఎవరైనా ఏదో ఓ దశలో ఓ పెద్ద తప్పు చేస్తుంటారు. ఇలాంటి తప్పులకు ఎవరూ అతీతులు కాదు. తాను కూడా జీవితంలో అతిపెద్ద తప్పు చేశానని ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకొన్నారు బిల్ గేట్స్. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్‌తో కంప్యూటర్ సామ్రాజ్యాన్ని ఏలిన బిల్ గేట్స్... మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్, క్రేజ్ గుర్తించకపోవడమే తాను చేసిన తప్పు అని వెల్లడించారు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మైక్రోసాఫ్ట్‌కు ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై మైక్రోసాఫ్ట్ పెద్దగా దృష్టిపెట్టలేదు. 2000 సంవత్సరంలోనే మైక్రోసాఫ్ట్ మొబైల్ పేరుతో ఓఎస్ రూపొందించినా... క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. కానీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకుంది గూగుల్.
ఆండ్రాయిడ్‌ను 2005లో 50 మిలియన్ డాలర్లకు ఆండ్రాయిడ్‌ను కొన్న గూగుల్... అదే పేరుతో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసింది. 2008లో తొలి ఆండ్రాయిడ్ డివైజ్ లాంఛైంది. అంతే... ఆ తర్వాత ఆండ్రాయిడ్ ప్రస్థానానికి ఢోకా లేకుండా పోయింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలేస్తోంది ఆండ్రాయిడ్ ఓఎస్. వాస్తవానికి గూగుల్ కన్నా ముందే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తయారు చేసింది మైక్రోసాఫ్టే. కానీ... పట్టు సాధించలేకపోయింది. దీంతో ఆండ్రాయిడ్ హవా మొదలైంది. విండోస్ ఫోన్లు రిలీజైనా యూజర్లను ఆకట్టుకోలేకపోయాయి. స్మార్ట్‌ఫోన్ ఓఎస్‌కు ఉన్న డిమాండ్‌ను గుర్తించలేకపోయామని, ఆ స్థానాన్ని గూగుల్‌కు వదులుకోవడమే తాను చేసిన పెద్ద తప్పు అని బిల్ గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీనివల్ల తమ కంపెనీ 400 బిలియన్ డాలర్ల నష్టపోవాల్సి వచ్చిందన్నారు బిల్ గేట్స్.
2018 నాటి లెక్కలు చూసినా ఆండ్రాయిడ్ మార్కెట్ షేర్ 88 శాతం ఉండగా, యాపిల్ ఐఓఎస్ మార్కెట్ షేర్ 11 శాతం ఉంది. అంటే ఆండ్రాయిడ్‌కు పోటీ ఇవ్వడం కాదు కదా... కనీసం దరిదాపుల్లో కూడా ఏ ఓఎస్ లేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మార్కెట్ విలువ రూ.27,76,500 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
WhatsApp: పాత ఫోన్లల్లో వాట్సప్ బంద్... కొత్త ఫోన్ కొనాల్సిందే
Xiaomi Mi CC9: యూత్ కోసం షావోమీ నుంచి మరో ఫోన్
Video: టిక్ టాక్‌లో తుమ్మితే ఏం జరిగిందో చూడండిPublished by:Santhosh Kumar S
First published:June 26, 2019, 13:00 pm