Firework App: టిక్‌టాక్‌కు పోటీగా ఫైర్‌వర్క్‌ యాప్... అద్భుతమైన ఫీచర్స్

Firework App | హారిజెంటల్, వర్టికల్‌లో ఒకేసారి వీడియో రికార్డ్ చేయడం ఈ యాప్ ప్రత్యేకత. ఈ టెక్నాలజీకి పేటెంట్ కోసం ప్రయత్నిస్తోంది లూప్ నౌ టెక్నాలజీస్.

news18-telugu
Updated: September 24, 2019, 6:21 PM IST
Firework App: టిక్‌టాక్‌కు పోటీగా ఫైర్‌వర్క్‌ యాప్... అద్భుతమైన ఫీచర్స్
Firework App: టిక్‌టాక్‌కు పోటీగా ఫైర్‌వర్క్‌ యాప్... అద్భుతమైన ఫీచర్స్ (image: Firework)
  • Share this:
టిక్‌టాక్... యూత్‌‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్న యాప్. టిక్‌టాక్ లాంటి యాప్స్ మరిన్ని ప్లేస్టోర్‌లో ఉన్నాయి. వాటిలో వీగో యాప్‌ కూడా పాపులరే. టిక్‌టాక్, వీగో యాప్స్‌కు పోటీగా 'ఫైర్‌వర్క్' యాప్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది లూప్ నౌ టెక్నాలజీస్. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ యూజర్లు ఈ యాప్‌ను యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హారిజెంటల్, వర్టికల్‌లో ఒకేసారి వీడియో రికార్డ్ చేయడం ఈ యాప్ ప్రత్యేకత. అంటే ఫోన్ నిలువుగా పట్టుకొని రికార్డ్ మొదలుపెట్టి అడ్డంగా ఫోన్‌ను తిప్పినా బ్రేక్ లేకుండా వీడియో రికార్డ్ అవుతుంది. రివీల్ పేరుతో రూపొందించిన ఈ టెక్నాలజీకి పేటెంట్ కోసం ప్రయత్నిస్తోంది లూప్ నౌ టెక్నాలజీస్. ఫైర్‌వర్క్ యూజర్లు 30 సెకండ్స్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు.


ఇక ఇండియాలో కంటెంట్ క్రియేటర్స్ అయిన ఆల్ట్ బాలాజీ, రిఫైనర్29 లాంటి సంస్థల నుంచి ఫైర్‌వర్క్ కంటెంట్ తీసుకోనుంది. ప్రముఖ డిజిటల్ క్రియేటర్లు ఇప్పటికే తమ యాప్‌ ఉపయోగిస్తున్నారని చెబుతోంది ఫైర్‌వర్క్. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు రోజుకు 170 నిమిషాల పాటు యాప్స్ ఉపయోగిస్తున్నారని, ఇప్పటికే 100 కోట్ల యాప్ డౌన్‌లోడ్స్ జరిగాయని, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో తమ యాప్‌ను 30 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని ఫైర్‌వర్క్ వెల్లడించింది. ఇక ఇటీవల 'ఫైర్‌వర్క్ ఒరిజినల్స్' పేరుతో ఒరిజినల్ స్ట్రీమింగ్ కంటెంట్ సర్వీస్‌ను ప్రారంభించింది ఫైర్‌వర్క్.

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Amazon Sale: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లివే...Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... కొత్త రేట్లు ఇవే

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...

 
First published: September 24, 2019, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading