Home /News /technology /

LOOKING FOR THE BEST CAMERA PHONE IF YOU TAKE A PHOTO IN THESE PHONES WITH THE HIGHEST PIXEL YOU WILL SAY WOW UMG GH

Camera Phones: బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా ? అత్యధిక పిక్సెల్ ఉన్న ఈ ఫోన్లతో ఫోటో తీసుకుంటే .. వావ్ అంటారు !

బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా ? అత్యధిక పిక్సెల్ ఉన్న ఈ ఫోన్లతో ఫోటో తీసుకుంటే .. వావ్ అంటారు !

బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా ? అత్యధిక పిక్సెల్ ఉన్న ఈ ఫోన్లతో ఫోటో తీసుకుంటే .. వావ్ అంటారు !

స్మార్ట్‌ఫోన్ కొనాలని చూసేవారు ముందు పరిశీలించే ఫీచర్లలో కెమెరా కెపాసిటీ ఒకటి. ఇప్పుడు అన్ని బ్రాండ్లు మిడ్ రేంజ్ ఫోన్లలో క్వాలిటీ లెన్స్ అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో 108MP కెమెరా ఫోన్‌లను కూడా అందిస్తున్నాయి. రూ.20 వేలలోనే ఈ హై-క్వాలిటీ కెమెరా

ఇంకా చదవండి ...
స్మార్ట్‌ఫోన్ కొనాలని చూసేవారు ముందు పరిశీలించే ఫీచర్లలో కెమెరా(Camera) కెపాసిటీ ఒకటి. ఇప్పుడు అన్ని బ్రాండ్లు మిడ్ రేంజ్ ఫోన్లలో క్వాలిటీ లెన్స్ అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో 108MP కెమెరా ఫోన్‌లను కూడా అందిస్తున్నాయి. రూ.20 వేలలోనే ఈ హై-క్వాలిటీ కెమెరా ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విభాగంలో మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫోన్లు ఇవే..

Xiaomi Redmi Note 11 Pro
ఈ ఫోన్ రూ.17,999కే లభిస్తుంది. 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే(Dispaly), ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G96 12nm ప్రాసెసర్, 6GB / 8GB RAM, 128 ఇంటర్నల్ స్టోరేజీ, 108MP + 8MP + 2MP + 2MP రియర్ కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 4G VoLTE, 5,000 mAh (సాధారణ) బ్యాటరీ వంటి పీచర్లతో రెడ్‌మీ నోట్ 11 ప్రో లభిస్తుంది.

Motorola Edge 20 Fusion
ఈ ఫోన్ ధర రూ. 18,999. 6.67-అంగుళాల FHD+ AMOLED 90Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800U (MT6873V) 7nm ప్రాసెసర్‌, 128GB UFS 2.2 స్టోరేజ్‌, 6GB / 8GB RAM, 108MP + 8MP + 2MP రియర్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా, 5G, డ్యుయల్ 4G VoLTE, 5,000 mAh బ్యాటరీ వంటివి ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు.

Xiaomi Redmi Note 11 Pro Plus
రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్ ధర రూ.19,999. దీని ఫీచర్లు రెడ్‌మీ నోట్ 11 ప్రో మాదిరిగానే ఉంటాయి. 6.67-అంగుళాల స్క్రీన్, 108MP + 8MP + 2MP రియర్ కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా, 5G, డ్యుయల్ 4G VoLTE. 5,000 mAh (సాధారణ) బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ డివైజ్ లాంచ్ అయింది.

ఇదీ చదవండి:  Punjab Schools: తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. తలలు పట్టుకుంటున్న టీచర్లు!



Realme 9
రియల్‌మీ 9 ధర రూ. 18,999. దీని ఫీచర్లలో 6.4-అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 6GB / 8GB RAM, 128GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 12 బేస్డ్ రియల్‌మీ UI 3.0 ఓఎస్, 108MP + 8MP + 2MP + 2MP వెనుక కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా వంటివి ప్రధానమైనవి.

Xiaomi Redmi Note 10 Pro Max
ఈ ఫోన్ గరిష్ట ధర రూ. 19,999. 6.67 అంగుళాల ఫుల్ HD+ 20:9 AMOLED స్క్రీన్, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 732G 8nm చిప్, 6GB లేదా 8GB RAM, 128GB స్టోరేజ్, 108MP + 8MP + 2MP + 5MP రియర్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా.. వంటివి ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు.



Moto G60
ఈ ఫోన్ రూ. 15,689 ధర వద్ద లభిస్తుంది. 6.8 అంగుళాల FHD+ 120Hz డిస్‌ప్లే, 2.3GHz స్నాప్‌డ్రాగన్ 732G ఆక్టా-కోర్ ప్రాసెసర్, 6GB ర్యామ్, 128GB ROM, 108MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరాలు, 32MP ఫ్రంట్ కెమెరీ వంటి ఫీచర్లతో ఫోన్ లాంచ్ అయింది.

 Xiaomi Redmi Note 11S
రెడ్‌మీ నోట్ 11ఎస్ ఫోన్ ధర రూ. 17,499. ఇది 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G96 12nm ప్రాసెసర్, 6GB RAM, 64GB / 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 108MP + 8MP + 2MP + 2MP రియర్ కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్లతో రిలీజ్ అయింది.
Published by:Mahesh
First published:

Tags: Real me, Tech news, Vivo, Xiaomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు