Home /News /technology /

LOOKING FOR SMART TV BUT WAIT IF YOU SEE THESE BEST SMART TV FEATURES YOU WILL BUY IT UMG GH

Best Smart TVs: స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నారా ! అయితే ఆగండి.. ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ చూస్తే ఇట్టే కొనేస్తారు..!

 స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నారా ! అయితే ఆగండి.. ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ చూస్తే కొంటారు అంతే !

స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నారా ! అయితే ఆగండి.. ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ చూస్తే కొంటారు అంతే !

రూ.30,000 ప్రైస్ రేంజ్‌లో మంచి ఫీచర్లతో బెస్ట్ స్టార్ట్ టీవీ(TV)ని కొనుగోలు చేయవచ్చు. మీరు కొత్త టీవీ కోసం వెతుకుతుంటే.. ఈ బడ్జెట్‌లో మార్కెట్‌(Market)లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ మోడళ్లను పరిశీలించండి.

ఇండియాలో స్మార్ట్ టీవీల వినియోగం, కొనుగోళ్లు చాలా సాధారణంగా మారాయి. ఒకప్పుడు లగ్జరీ వస్తువుగా భావించిన స్మార్ట్ టీవీ(TV)లు ఇప్పుడు సాధారణ వినియోగ వస్తువుగా మారాయి. వివిధ కంపెనీలు తక్కువ ధరకే వీటిని అందుబాటులోకి తీసుకురావడంతో డిమాండ్ పెరుగుతోంది. అయితే రూ.30,000 ప్రైస్ రేంజ్‌లో మంచి ఫీచర్లతో బెస్ట్ స్టార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. మీరు కొత్త టీవీ కోసం వెతుకుతుంటే.. ఈ బడ్జెట్‌లో మార్కెట్‌లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ మోడళ్ల(Models)ను పరిశీలించండి.

Nokia 43-అంగుళాల అల్ట్రా HD 4K స్మార్ట్ టీవీ
నోకియా 43-అంగుళాల స్మార్ట్ TV భారతదేశంలో రూ. 28,999 ధర వద్ద లభిస్తోంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌తో రన్ అవుతుంది. HDR10 సపోర్ట్‌, మైక్రో-డిమ్మింగ్ టెక్నాలజీ, 350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, Onkyo బేస్డ్ 39W సౌండ్ సిస్టమ్‌తో పాటు ఆండ్రాయిడ్‌తో వచ్చే అనేక స్మార్ట్ టీవీ ఫీచర్లతో వస్తుంది.

శామ్‌సంగ్ వండర్‌టైన్‌మెంట్ ఫుల్ HD స్మార్ట్ టీవీ
శామ్‌సంగ్ వండర్‌టైన్‌మెంట్ సిరీస్ ఇండియాలో కంపెనీ నుంచి లభిస్తున్న సరసమైన స్మార్ట్ టీవీ సిరీస్. ఈ సిరీస్ నుంచి వచ్చిన 43-అంగుళాల ఫుల్-HD వేరియంట్ అమెజాన్ ఇండియాలో రూ. 28,999 వద్ద లభిస్తోంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1920 x 1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 2 HDMI పోర్ట్‌లు, 1 USB-A పోర్ట్‌, వాయిస్ అసిస్టెంట్, స్మార్ట్ థింగ్స్ యాప్, డెక్స్ సపోర్ట్, స్క్రీన్ షేర్, డాల్బీ డిజిటల్ ప్లస్‌, బ్లూ రే ప్లేయర్ సపోర్ట్, 20W సౌండ్ సిస్టమ్‌ వంటి అనేక ఫీచర్‌లతో లభిస్తుంది.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

వన్‌ప్లస్ TV Y1S
వన్‌ప్లస్ TV Y1S స్మార్ట్ టీవీ 43-అంగుళాల HDR10+ డీకోడింగ్‌తో 1920 x 1080 ఫుల్-HD రిజల్యూషన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11తో రన్ అవుతుంది. 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌, 64-బిట్ ప్రాసెసర్‌తో ఇది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 2 HDMI పోర్ట్‌లు, 2 USB-A పోర్ట్‌లు, Wi-Fi, బ్లూటూత్ 5.0, ప్లే స్టోర్, గూగుల్ అసిస్టెంట్, వన్‌ప్లస్ కనెక్ట్ 2.0, మరిన్ని స్మార్ట్ ఫీచర్‌లకు ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది.

Xiaomi Mi TV 4X
షియోమి ఎమ్‌ఐ TV 4X అనేది 43-అంగుళాల స్మార్ట్ టీవీ వేరియంట్. ఇండియాలో దీని ధర రూ.27,999. అల్ట్రా-HD 4K రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌, 3 HDMI పోర్ట్‌లు, 2 USB-A పోర్ట్‌లు, ఇయర్‌ఫోన్ అవుట్‌లెట్, 1 AV అవుట్‌లెట్, Wi-Fi వంటి ఫీచర్లు దీని సొంతం. షియోమి Mi TV 4X వేరియంట్ HDR 10కి సపోర్ట్ చేస్తుంది. భారీ 4K కంటెంట్ కేటలాగ్, గూగుల్ అసిస్టెంట్‌, ఆండ్రాయిడ్ TV సపోర్ట్, డేటా సేవర్, 20W సౌండ్ సిస్టమ్ వంటి స్మార్ట్ ఫీచర్‌లతో ఈ టీవీ బెస్ట్ అవుట్‌పుట్ అందిస్తుంది.



రియల్‌మీ స్మార్ట్ TV 4K
ఈ 43-అంగుళాల స్మార్ట్ టీవీ ధర ఇండియాలో రూ. 27,999గా ఉంది. Realme.com, ఫ్లిప్‌కార్ట్, ఇతర స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా-HD రిజల్యూషన్‌తో పాటు డాల్బీ విజన్, TUV రీన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, 3 HDMI పోర్ట్‌లు, 2 USB-A పోర్ట్‌లు, LAN పోర్ట్, ఆప్టికల్ ఆడియో అవుట్‌పుట్ పోర్ట్, AV పోర్ట్‌లు, ట్యూనర్, Wi-Fi, బ్లూటూత్, 24W స్పీకర్ సిస్టమ్, మరిన్ని కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Budget smart tv, Nokia, ONE PLUS, Xiaomi Mi TV

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు