హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphones Under Rs.20K: బెస్ట్ ఫీచర్స్ ఫోన్ కోసం చూస్తున్నారా ? రూ.20 వేలలోపు లభించే మోడళ్లు ఇవే.. చూస్తే వెంటనే ఆర్డర్ చేస్తారు!

Smartphones Under Rs.20K: బెస్ట్ ఫీచర్స్ ఫోన్ కోసం చూస్తున్నారా ? రూ.20 వేలలోపు లభించే మోడళ్లు ఇవే.. చూస్తే వెంటనే ఆర్డర్ చేస్తారు!

బెస్ట్ ఫీచర్స్ ఫోన్ కోసం చూస్తున్నారా ? రూ.20 వేలలోపు  లభించే మోడళ్ళు ఇవే

బెస్ట్ ఫీచర్స్ ఫోన్ కోసం చూస్తున్నారా ? రూ.20 వేలలోపు లభించే మోడళ్ళు ఇవే

మీరు రూ.20వేల వరకు ఖర్చు చేయగలిగితే.. మంచి ప్రాసెసర్‌ (Processor), డిస్‌ప్లే ప్యానెల్‌ల, కెమెరా, ఛార్జింగ్ స్పీడ్‌ వంటి ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్(Smartphones) పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...

కొత్త స్మార్ట్‌ఫోన్(Smartphones) కొనాలనుకునేవారు తమ బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్‌ను ఎంచుకోవడంపై దృష్టి పెడతారు. అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ప్రైజ్ రేంజ్ ఆధారంగా వివిధ రకాల ఫీచర్లను అందిస్తున్నాయి. అయితే మీరు రూ.20వేల వరకు ఖర్చు చేయగలిగితే.. మంచి ప్రాసెసర్‌(Processor), డిస్‌ప్లే ప్యానెల్‌ల, కెమెరా, ఛార్జింగ్ స్పీడ్‌ వంటి ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఏవో చూద్దాం.

Realme 9 5G SE

ఈ ఫోన్ ధర రూ.19,999. స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్‌తో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించే రియల్‌మీ 9 5G SE ఫోన్.. మొత్తం జాబితాలో టాప్ పర్ఫార్మెన్స్‌ డివైజ్. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల LCD FHD+ డిస్‌ప్లే, 48MP ట్రిపుల్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్లతో లభిస్తుంది.

OnePlus Nord CE 2 Lite

రూ.20వేల లోపు బెస్ట్ ఫీచర్-ప్యాక్డ్ ఫోన్‌లలో ఇది ఒకటి. దీని ధర రూ. 19,999. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. డివైజ్ స్నాప్‌డ్రాగన్ 695తో పనిచేస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 64MP ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు దీని సొంతం.

ఇదీ చదవండి: Punjab Schools: తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. తలలు పట్టుకుంటున్న టీచర్లు!


Motorola G71

మోటొరోలా G71పై కంపెనీ ఇటీవల డిస్కౌంట్ ప్రకటించింది. అప్పటి నుంచి ఇది రూ.15,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఈ ఫోన్ 6.4-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ప్యానెల్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌తో పనిచేస్తుంది. మోటొరోలా జీ71 ఫోన్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది.

Redmi Note 11 Pro+ 5G

ఈ ఫోన్ ధర రూ. 20,999. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్‌సెట్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 108MP ట్రిపుల్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 4,500mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్ రూ. 20,000 కంటే తక్కువ ధరకు లభిస్తుంది.

Poco X4 Pro

పోకో X4 ప్రో ఫోన్ ధర రూ. 16,999. ఇది స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ డివైజ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌తో లభిస్తుంది. 64MP ట్రిపుల్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది.

First published:

Tags: Moto, ONE PLUS, POCO, Xiaomi

ఉత్తమ కథలు