WhatsApp Image Search: వాట్సప్‌లో కొత్త ఫీచర్... ఇక ఫేక్‌న్యూస్‌కు చెక్

WhatsApp Reverse Image Search Feature | త్వరలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనుండటం, ఎన్నికల్లో ఫేక్‌న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ అయ్యే అవకాశం ఉండటంతో వాట్సప్ 'రివర్స్ ఇమేజ్ సెర్చ్' ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.

news18-telugu
Updated: March 15, 2019, 9:50 AM IST
WhatsApp Image Search: వాట్సప్‌లో కొత్త ఫీచర్... ఇక ఫేక్‌న్యూస్‌కు చెక్
WhatsApp Image Search: వాట్సప్‌లో కొత్త ఫీచర్... ఇక ఫేక్‌న్యూస్‌కు చెక్
news18-telugu
Updated: March 15, 2019, 9:50 AM IST
ఫేక్ న్యూస్... ఇండియాలో ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. సుమారు రెండేళ్లుగా భారతదేశంలో ఫేక్ న్యూస్ సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. తప్పుడు వార్తలు, కథనాలు, సమాచారంతో అనేక దారుణాలు జరిగాయి. మూకదాడులు, మూకహత్యలకు ఈ ఫేక్ న్యూస్ కారణమైంది. ఫేక్ న్యూస్ ఎక్కువగా వాట్సప్‌లోనే సర్క్యులేట్ కావడంతో వాట్సప్ ప్రతిష్ట మసకబారింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వివాదంలో చిక్కుకుంది. దీంతో ఫేక్‌న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ చర్యలు మొదలుపెట్టింది. ఫార్వర్డ్ మెసేజ్‌కు 'Forwarded' లేబుల్, ఐదుగురి కంటే ఎక్కువగా ఫార్వర్డ్ మెసేజ్‌లు పంపే అవకాశం లేకపోవడం లాంటి కొత్త ఫీచర్లన్నీ ఫేక్ న్యూస్ అడ్డుకోవడం కోసమే. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది వాట్సప్. అదే రివర్స్ ఇమేజ్ సెర్చ్. త్వరలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనుండటం, ఎన్నికల్లో ఫేక్‌న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ అయ్యే అవకాశం ఉండటంతో వాట్సప్ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.

Read this: IRCTC Tatkal Rules: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? రూల్స్, ఛార్జెస్ వివరాలు తెలుసుకోండి

Lok Sabha Elections 2019, WhatsApp Reverse Image Search feature, WhatsApp Image Search, WhatsApp Image Search feature, WhatsApp new updates, WhatsApp new features, WhatsApp Features, WhatsApp updates, Fake news, whatsapp new features 2019, వాట్సప్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, వాట్సప్ ఇమేజ్ సెర్చ్, వాట్సప్ కొత్త ఫీచర్స్, వాట్సప్ ఫీచర్స్, వాట్సప్ అప్‌డేట్స్, ఫేక్ న్యూస్, 2019 లోక్‌సభ ఎన్నికలు, 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు
image: wabetainfo


వాట్సప్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఎలా పనిచేస్తుంది?




WABetainfo సమాచారం ప్రకారం వాట్సప్ బీటా 2.19.73 అప్‌డేట్‌లో 'Search image' ఫీచర్ కనిపిస్తుంది. మీకు వాట్సప్‌లో ఏదైనా ఫోటో వస్తే అది నిజమో కాదో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఫీచర్ ఇది. మీకు వచ్చిన ఫోటోను క్లిక్ చేసి 'Search image' పైన క్లిక్ చేస్తే నేరుగా గూగుల్‌లో అలాంటి ఇమేజెస్ ఏవైనా ఉంటే చూపిస్తుంది. దాన్ని బట్టి ఆ ఫోటో ఎక్కడిది? ఎప్పుడు తీశారు? మీకు వచ్చిన ఫోటోలో ఉన్న సమాచారం నిజమేనా? ఇవన్నీ తెలుసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మీరు ఫేక్ న్యూస్‌ను సులభంగా గుర్తించొచ్చు. అది తప్పుడు సమాచారం అని, తప్పుడు వార్తలని తెలిస్తే మీరు ఫార్వర్డ్ చేయకుండా అడ్డుకోవచ్చు.

Photos: ఈ లేడీ బైకర్ ఆన్‌‌లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్
Loading...
ఇవి కూడా చదవండి:

JIO Prepaid Plans: రోజుకు 2GB హై స్పీడ్ డేటా... జియో ప్లాన్స్ ఇవే...

One Nation One Card: వన్ నేషన్ వన్ కార్డ్ వాడితే 10% క్యాష్‌బ్యాక్... కార్డు ఫీచర్లు ఇవే

SBI PPF Scheme: అధిక వడ్డీ కావాలా? ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్ ట్రై చేయండి
First published: March 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...