Home /News /technology /

LOK SABHA ELECTIONS 2019 KNOW ABOUT YOUR CANDIDATE IN VOTER HELPLINE APP BEFORE YOU VOTE SS

Election 2019: ఓటు వేసే ముందు మీ అభ్యర్థి కేసుల గురించి ఇలా తెలుసుకోండి

Election 2019: ఓటు వేసే ముందు మీ అభ్యర్థి కేసుల గురించి ఇలా తెలుసుకోండి

Election 2019: ఓటు వేసే ముందు మీ అభ్యర్థి కేసుల గురించి ఇలా తెలుసుకోండి

Election 2019 | మీ స్మార్ట్‌ఫోన్‌లో Voter Helpline App ఉంటే చాలు. దేశంలోని అభ్యర్థులందరి అఫిడవిట్లను మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విశ్లేషించొచ్చు.

    ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారా? మరి మీరు ఓటు వేయాలనుకుంటున్న అభ్యర్థి గురించి మీకు ఏం తెలుసు? రోజూ టీవీల్లో, న్యూస్ పేపర్‌లో అభ్యర్థి గురించి వచ్చే వార్తలు కాకుండా మీకు ఆ అభ్యర్థి గురించి ఇంకా లోతుగా ఏమైనా తెలుసా? తెలియకపోతే తెలుసుకొని ఓటు వేయండి. అభ్యర్థి పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకోండి. క్యాండిడేట్ ఎవరు? కుటుంబ సభ్యులెవరు? ఆస్తులెన్ని? కేసులెన్ని? ఆ కేసుల్లో పెండింగ్‌లో ఉన్నవెన్ని? ఆ కేసుల స్టేటస్ ఏంటీ? ఇలా ప్రతీ పాయింట్ మీరే తెలుసుకోవచ్చు. ఎన్నికల్లో ఓటు వేయడానికి ముందు అభ్యర్థుల గురించి పూర్తి సమాచారం తెలిస్తే ఎవరికి ఓటు వేయాలో మీకు ఓ స్పష్టత వస్తుంది. ఈ వివరాలన్నీ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో Voter Helpline App ఉంటే చాలు. దేశంలోని అభ్యర్థులందరి అఫిడవిట్లను మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విశ్లేషించొచ్చు.

    Read this: Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ లేదా? ఈ డాక్యుమెంట్లు చూపించి ఓటు వేయొచ్చు

    Voter Helpline App: మీ అభ్యర్థి గురించి ఇలా తెలుసుకోండి


    ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Voter Helpline App డౌన్‌లోడ్ చేసుకోండి.
    యాప్‌లో లెఫ్ట్ బాటమ్‌లో త్రీ లైన్స్‌ పైన క్లిక్ చేయండి.
    లిస్ట్‌లో క్యాండిడేట్, పొలిటికల్ పార్టీస్ ఆప్షన్‌పైన క్లిక్ చేయండి.
    తర్వాత క్యాండిడేట్ అఫిడవిట్ పైన క్లిక్ చేయండి.
    మొత్తం ఎంతమంది నామినేషన్లు వేశారో తెలుసుకోవచ్చు.
    చివర్లో ఫిల్టర్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం, నియోజకవర్గం ఎంచుకోవాలి.
    మీరు ఎంచుకున్న నియోజకవర్గంలో నామినేషన్లు వేసినవారి జాబితా కనిపిస్తుంది.
    అభ్యర్థి పేరు పైన క్లిక్ చేస్తే వారి వివరాలన్నీ కనిపిస్తాయి.
    చివర్లో అఫిడవిట్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో అఫిడవిట్ డౌన్‌లోడ్ అవుతుంది.
    ఆ అఫిడవిట్‌లో అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలుంటాయి.
    అభ్యర్థి ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు, కేసుల వివరాలన్నీ అఫిడవిట్‌లో తెలుసుకోవచ్చు.

    Read this: Election 2019: మీ ఓటు ఉందా... లేదా? ఇలా చెక్ చేసుకోండి

    ఇలా అఫిడవిట్ ద్వారా మీ అభ్యర్థిపై ఓ అవగాహన వస్తుంది. http://www.myneta.info/ వెబ్‌సైట్‌లో కూడా అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఓటు వేసే ముందు అభ్యర్థి గురించి తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో అనేక వివరాలుంటాయి. ఓటర్లలో చైతన్యం పెంచడం కోసం ఎన్నికల కమిషన్ ఈ యాప్ రూపొందించింది. EPIC నెంబర్ ఆధారంగా మరిన్ని సేవలు పొందొచ్చు. ఓటరు జాబితా, ఓటరు కార్డులో కరెక్షన్స్, అడ్రస్ మార్పు, నియోజకవర్గం మార్పు కోసం దరఖాస్తు ఈ యాప్ ద్వారా చేయొచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో Voter Helpline App డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

    ఇవి కూడా చదవండి:

    Video: ఆ కండోమ్ ప్యాకెట్ ఓపెన్ చేయాలంటే రెండు చేతులు చాలవు

    IRCTC E-Wallet: ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో ఇలా రిజిస్టర్ చేసుకోవాలి

    Realme Backpack: రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్ ఒక్క రూపాయికే... ఇలా కొనాలి
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Mobile App, Telangana Lok Sabha Elections 2019

    తదుపరి వార్తలు