Voter Helpline App: పోలింగ్‌కు ఇంకొన్ని రోజులే... ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ఇలా వాడండి

Voter Helpline App | ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందించడానికి ఈ యాప్ రూపొందించినట్టు భారత ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో ఉన్న డేటా అంతా మొబైల్ అప్లికేషన్‌లో కనిపిస్తుంది.

news18-telugu
Updated: April 7, 2019, 8:42 AM IST
Voter Helpline App: పోలింగ్‌కు ఇంకొన్ని రోజులే... ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ఇలా వాడండి
Voter Helpline App: పోలింగ్‌కు ఇంకొన్ని రోజులే... ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ఇలా వాడండి
news18-telugu
Updated: April 7, 2019, 8:42 AM IST
దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి కనిపిస్తోంది. మొదటి విడత పోలింగ్‌కు గడువు దగ్గరపడుతోంది. ఓటర్ల కోసం అనే యాప్స్‌ని రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్. అందులో ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌ ఒకటి. ఫిబ్రవరిలో లాంఛ్ చేసిన యాప్ ఇది. ఓటర్లకు కావాల్సిన సమాచారం, సేవలన్నీ ఈ యాప్‌లో లభిస్తాయి. దేశంలోని ప్రజలంతా ఎన్నికల్లో ఆసక్తిగా పాల్గొనే సంస్కృతిని పెంపొందించడంతో పాటు ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందించడానికి ఈ యాప్ రూపొందించినట్టు భారత ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో ఉన్న డేటా అంతా మొబైల్ అప్లికేషన్‌లో కనిపిస్తుంది. ఓటర్లలో చైతన్యం పెంచడమే ఈ యాప్ ప్రాథమిక లక్ష్యం.

Read this: IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ఎలా పనిచేస్తుంది?



ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో మీకు కావాల్సిన సేవలు, సమాచారం పొందడానికి మీ EPIC నెంబర్ కీలకం. 18 ఏళ్లు నిండిన భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించినప్పుడే EPIC నెంబర్ జారీ చేస్తుంది ఎన్నికల కమిషన్. EPIC నెంబర్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన మీ వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా పొందొచ్చు. ఓటరు జాబితా తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని సబ్మిట్ చేయొచ్చు. ఓటరు కార్డులో కరెక్షన్స్, అడ్రస్ మార్పు, నియోజకవర్గం మార్పు లాంటివన్నీ సాధ్యం. అంతేకాదు... మీ దరఖాస్తు స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అభ్యర్థుల సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఎన్నికలు, ఫలితాలకు సంబంధించి ఫిర్యాదులు కూడా చేయొచ్చు. అందులో Voter, Forms, Complaint, EVM, Elections, Results అనే ట్యాబ్స్ ఉంటాయి. బాటమ్‌లో Explore, Current, Gallery, Downloads, Voter Helpline buttons ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.



ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?


ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఆండ్రాయిడ్ డివైజ్‌లలో వాడుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి Voter Helpline అని సెర్చ్ చేయాలి. డెవలపర్ నేమ్ Election Commission of India అని ఉన్న యాప్‌నే డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ సైజ్ 12MB ఉంటుంది. ఇప్పటికే ఈ యాప్‌ను 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం. మీరు ఈ యాప్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
Loading...
Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:

SBI: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఇలా అప్‌డేట్ చేయండి

LIC Online Policy: ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే డిస్కౌంట్

Election 2019: ఎన్నికల్లో బ్లూ ఇంక్ ఎందుకు వాడతారో తెలుసా...
First published: April 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...