LOK SABHA ELECTION 2019 DISTRIBUTING MONEY FOR VOTES KNOW HOW TO COMPLAINT IN CVIGIL APP AND WEBSITE SS
Election 2019: ఓటుకు డబ్బులు పంచుతున్నారా? సీవిజిల్ యాప్‌లో ఇలా కంప్లైంట్ చేయండి
Election 2019: ఓటుకు డబ్బులు పంచుతున్నారా? సీవిజిల్ యాప్‌లో ఇలా కంప్లైంట్ చేయండి
cVIGIL App | ఎన్నికల అక్రమాలపై మీరు నేరుగా ఎన్నికల కమిషన్‌కు కంప్లైంట్ చేయొచ్చు. ఇందుకోసం మీ దగ్గర ఓ స్మార్ట్‌ఫోన్ ఉంటేచాలు. వెంటనే సీవిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లైంట్ చేయొచ్చు.
లోక్‌సభ తొలివిడత ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. పోలింగ్ గడువు దగ్గరకు వచ్చేస్తోంది. ఇక ఈ సమయంలోనే ఎన్నికల్లో అక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ. మరి మీ ఊళ్లో ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయా? సీవిజిల్ యాప్‌లో కంప్లైంట్ చేయొచ్చు. పౌరుల కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీవిజిల్ యాప్‌ను రూపొందించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ యాప్‌ను అనేక మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడటంతో ఇప్పుడే ఎన్నికల్లో అక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ అక్రమాలపై మీరు నేరుగా ఎన్నికల కమిషన్‌కు కంప్లైంట్ చేయొచ్చు. ఇందుకోసం మీ దగ్గర ఓ స్మార్ట్‌ఫోన్ ఉంటేచాలు. వెంటనే సీవిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లైంట్ చేయొచ్చు.
ఓటర్లకు నోట్ల పంపిణీ దగ్గర్నుంచీ నేతల ర్యాలీల్లో సమస్యల వరకు నిబంధలను ఉల్లంఘిస్తున్నట్టు, అక్రమాలకు పాల్పడుతున్నట్టు మీకు అనుమానం వస్తే చాలు కంప్లైంట్ చేయొచ్చు. నోట్లు పంచడం, గిఫ్ట్ కూపన్స్ ఇవ్వడం, మద్యం పంపిణీ, అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం, నేతలు మారణాయుధాలతో తిరగడం, అనుమతి లేకుండా వాహనాలు, కాన్వాయ్‌లు తిప్పడం, పెయిడ్ న్యూస్, పోలింగ్ బూత్‌కు 200 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం, ప్రచారానికి గడువు ముగిసిన తర్వాత కూడా ప్రచార కార్యక్రమాలు కొనసాగించడం, మతపరమైన ప్రసంగాలు... ఇలా ఎన్నికల అక్రమాలకు సంబంధించి ఏ అంశమైనా సరే మీరు కంప్లైంట్ ఇవ్వొచ్చు.
సీవిజిల్ యాప్‌లో ఎలా కంప్లైంట్ చేయాలి?
ఎన్నికల అక్రమాలపై మీరు ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేయడానికి మీరు ఏ ఆఫీసుకీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్... అందులో సీవిజిల్ యాప్ ఉంటే చాలు. యాప్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఏ స్మార్ట్‌ఫోన్‌కైనా ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా డబ్బులు పంచుతున్నా, ప్రలోభాలకు గురిచేస్తున్నా మీరు రహస్యంగా రికార్డ్ చేయాలి. ఫోటోలు వీడియోలు తీయాలి. మీరు వీడియో రికార్డ్ చేసే సమయంలో జీపీఎస్ ఆన్‌లో ఉండాలి. మీరు వీడియో తీసి అప్లోడ్ చేస్తే చాలు. అవి నేరుగా ఎన్నికల కమిషన్‌కు వెళ్తాయి. జీపీఎస్ ట్రాక్ చేసి లొకేషన్‌ను గుర్తిస్తారు. ఆ ప్రాంతం పరిధిలో ఉండే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తుంది. వెంటనే స్పెషల్ పార్టీ రంగంలోకి దిగి అక్రమాలను అడ్డుకునే అవకాశముంటుంది. మీరు సీవిజిల్ యాప్‌లో కంప్లైంట్ చేసినప్పుడు యూనిక్ ఐడీ జెనరేట్ అవుతుంది. తర్వాత మీరు ఆ ఐడీ సాయంతో మీ ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవచ్చు. సీవిజిల్ యాప్‌తో పాటు వెబ్సైట్ కూడా ఉంది. మీరు వెబ్సైట్లో కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చు. కంప్లైంట్ చేసినంతమాత్రానా మీ వివరాలు ఎవరికీ తెలియవు. మీ వివరాలను గోప్యంగా ఉంచుతారు ఎన్నికల అధికారులు.
BJP vs Congress: బీజేపీ, కాంగ్రెస్ మధ్య 'చీరల యుద్ధం'
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.