దేశమంతా ఇప్పుడు ఎన్నికలు, సీట్లు, ఓట్ల గురించే చర్చ. నాయకులు సీట్ల కోసం కుస్తీ పట్లు పడుతుంటే... సామాన్యులు తమ ఓట్లు ఎక్కడున్నాయో వెతుక్కునే పనిలో పడ్డారు. మరి మీరు మీ ఓటు ఎక్కడ ఉందో చూసుకున్నారా? ఓటరు జాబితాలో మీ పేరు, ఇతర వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయా? ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోండి. అసలు ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలి. ఇందుకోసం మీరు www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇది నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్. టాప్ లెఫ్ట్‌లో మీకు ‘Search Your Name in Electoral Roll’ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా సెర్చ్ డీటెయిల్స్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డుపైన EPIC నెంబర్ ఉంటుంది. EPIC ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. వెబ్ పేజీ చివర్లో మీ వివరాలన్నీ కనిపిస్తాయి. ప్రత్యామ్నాయంగా 'Search by Details' ద్వారా కూడా మీ ఓటు చెక్ చేసుకోవచ్చు. పేరు, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. మీరు 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి లేదా ఎస్ఎంఎస్ పంపించి కూడా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో కూడా మీ ఓటు చూసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు కనిపించకపోతే ఓటర్ జాబితాలో మీ ఓటు లేనట్టే.
Read this: RRB Level 1 Notification: రైల్వేలో 1,03,769 పోస్టులకు మొదలైన రిజిస్ట్రేషన్... ఇలా అప్లై చేయండి
ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఫామ్-6 పూర్తి చేసి అప్లై చేయాలి. ఓటు నమోదు కోసం చివరి తేదీ మార్చి 15. మీరు అంతలోపే ఓటుకు నమోదు చేసుకుంటే ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. లేదంటే ఈసారి ఇక మీకు ఓటు లేనట్టే. అందుకే మార్చి 15 లోగా ఫామ్-6తో దరఖాస్తు చేయాలి. ఇందుకోసం మీ ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటే చాలు. ఆన్‌లైన్‌లో లేదా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మీ దరఖాస్తును ఇవ్వొచ్చు. ఆన్‌లైన్‌లో అయితే www.nvsp.in వెబ్‌సైట్‌లో ఫామ్-6 కనిపిస్తుంది. అందులో అప్లై చేయొచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు. మీరు దరఖాస్తు చేసిన తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ పరిశీలించి ఓటరు జాబితాలో మీ పేరును చేర్చేందుకు సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత ఓటర్ జాబితాలో మీ పేరును చేరుస్తారు.
Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్
ఇవి కూడా చదవండి:
PAN Card: మీ దగ్గర రెండో పాన్ కార్డ్ ఉందా? ఇలా సరెండర్ చేయండి
GB WhatsApp: మీ జీబీ వాట్సప్ బ్లాక్ అయిందా? ఇలా చేయండి
SBI Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఎస్‌బీఐలో IMPS NEFT వివరాలు ఇవే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.