LOGOUT TO HIDE LAST SEEN WHATSAPP TO RELEASE THESE NEW FEATURES SOON SS
WhatsApp New features: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఈ కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి
WhatsApp New features: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఈ కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp Upcoming Features | వాట్సప్ యూజర్లకు ఈ ఏడాది మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ (WhatsApp New features) రాబోతున్నాయి. కమ్యూనిటీ, లాగౌట్, హైడ్ లాస్ట్ సీన్... ఇలా అనేక ఫీచర్స్‌ని టెస్ట్ చేస్తోంది వాట్సప్. ఆ ఫీచర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి.
వాట్సప్ యూజర్లకు అలర్ట్. మరిన్ని కొత్త ఫీచర్స్‌ను స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం రిలీజ్ చేయబోతోంది వాట్సప్. గతేడాది అనేక ఫీచర్స్‌ని (WhatsApp Features) వాట్సప్ పరిచయం చేసింది. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సప్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసే ఫీచర్ గతేడాది వచ్చింది. ఇక యూజర్లను ఊరిస్తున్న మల్టీ డివైజ్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. వాట్సప్‌లో వీడియోస్ షేర్ చేసేముందు మ్యూట్ చేసే ఫీచర్ కూడా రిలీజ్ చేసింది. ఇక ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు వాట్సప్ ఛాట్స్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ కూడా వచ్చేసింది. ఇలా గతేడాది యూజర్లకు ఉపయోగపడే అనేక ఫీచర్స్ రిలీజ్ చేసింది వాట్సప్. ఇప్పుడు 2022 లో కూడా కొత్త ఫీచర్స్ రిలీజ్ చేయబోతోంది.
WhatsApp community: వాట్సప్ గ్రూప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో వాట్సప్ కమ్యూనిటీ కూడా రాబోతోంది. 10 లేదా అంతకన్నా ఎక్కువ గ్రూప్స్ కలిపి వాట్సప్ కమ్యూనిటీ ఏర్పాటు కానుంది. వేర్వేరు గ్రూప్స్‌లో మెసేజెస్ పంపాలనుకునేవారు ఒకేసారి వాట్సప్ కమ్యూనిటీలో షేర్ చేస్తే చాలు. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్ల కోసం రానుంది.
Notification: వాట్సప్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రొఫైల్ ఫోటో కూడా కనిపించబోతోంది. అంటే ఏ యూజర్ నుంచి మీరు వాట్సప్ మెసేజ్ అందుకుంటారో వారి ప్రొఫైల ఫోటో మీకు నోటిఫికేషన్లో కనిపించబోతోంది. ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ రిలీజ్ చేయబోతోంది వాట్సప్. ఇప్పటికే బీటా టెస్టర్లు ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు.
Hide Last Seen: లాస్ట్ సీన్ హైడ్ చేసే ఫీచర్‌ను చాలామంది యూజర్లు వాడుకుంటూ ఉంటారు. తాము వాట్సప్ చూశామో లేదో అవతలివారికి తెలియాల్సిన అవసరం లేదని భావించేవారంతే ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తారు. అయితే సెలెక్టెడ్ కాంటాక్ట్స్‌కి కూడా లాస్ట్ సీన్ హైడ్ చేయొచ్చు. ప్రస్తుతం లాస్ట్ సీన్ హైడ్ చేస్తే అందరికీ సదరు యూజర్ లాస్ట్ సీన్ కనిపించదు. కానీ వాట్సప్ త్వరలో రిలీజ్ చేయబోయే ఫీచర్‌తో కొందరికి మాత్రమే లాస్ట్ సీన్ కనిపించేలా చేయొచ్చు.
WhatsApp edit: వాట్సప్‌లో మీడియా ఫైల్స్ చేసేముందు ఎడిట్ చేసే అవకాశం కల్పించబోతోంది వాట్సప్. స్టేటస్ అప్డేట్ చేసేవారి నుంచి మీడియా ఫైల్స్ షేర్ చేసేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
WhatsApp logout: వాట్సప్‌లో లాగౌట్ ఫీచర్ లేదు. ఈ ఫీచర్ కోసం యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లకు ఉన్నట్టు వాట్సప్‌లో కూడా లాగౌట్ ఫీచర్ రానుంది. యూజర్లు అవసరం అయినప్పుడు లాగిన్ కావొచ్చు. లాగౌట్ కావొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.