ఎక్కడైనా ఒకటే వైఫై పాస్‌వర్డ్... 2020 నుంచీ అమలు... కేంద్రం ప్లాన్ ఇదీ...

Wi-Fi : ప్రస్తుతం ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఇలా కొన్ని చోట్ల మాత్రమే వైఫై అందుబాటులో ఉంటోంది. వచ్చే ఏడాది నుంచీ దేశంలో ఎక్కడికెళ్లినా వైఫై అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 6:33 AM IST
ఎక్కడైనా ఒకటే వైఫై పాస్‌వర్డ్... 2020 నుంచీ అమలు... కేంద్రం ప్లాన్ ఇదీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రెండోసారి అధికారంలోకి వచ్చాక... బలమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో... వైఫై సదుపాయంపై కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ మనం రకరకాల వైఫై సదుపాయాలు పొందుతున్నాం. ఐతే... వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు... అక్కడి వైఫై కనెక్ట్ అయ్యేందుకు... అక్కడి పాస్‌వర్డ్ ఎంటర్ చెయ్యడం, లాగిన్ అవ్వడం ఇదంతా తలనొప్పి వ్యవహారం. ఇకపై ఒక్కసారి వైఫై‌కి లాగిన్ అయితే... ఇక దేశమంతా అదే లాగిన్ ఉండేలా చెయ్యబోతోంది కేంద్రం. అంటే దేశమంతా ఒకటే లాగిన్ పాస్‌వర్డ్ ఉంటుందన్నమాట. అందువల్ల ఎవరైనా సరే... వైఫై అందుబాటులో ఉన్న చోటికి వెళ్తే చాలు... వాళ్ల స్మార్ట్ మొబైల్‌లో ఆటోమేటిక్‌గా వైఫై కనెక్ట్ అయిపోతుంది. వాళ్లు వాడుతున్న సిమ్ BSNL, జియో, ఎయిర్‌టెల్ ఏదైనా కావచ్చు... ఆయా మొబైల్ సర్వీస్ సెంటర్లు... ఆ మొబైల్‌ని గుర్తించి... వైఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.

డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (DCC) ఈసారి కూర్చునే మీటింగ్‌లో ఈ ప్రతిపాదనపై చర్చించబోతోంది. మంగళవారం ఈ మీటింగ్ జరపాలని ముందుగా అనుకున్నా, కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ 2018 పాలసీ ప్రకారం... దేశంలో 50 లక్షల ప్రభుత్వ వైఫై హాట్‌స్పాట్ లను 2020 నాటికి ఏర్పాటు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్స్ వేసుకుంది. 2022 నాటికి కోటి వైఫై హాట్‌స్పాట్‌లు సిద్ధం చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం... పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్‌కి కనెక్ట్ అవ్వాలంటే... సదరు వ్యక్తి ఓ ఫారం నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను/ఆమెకు OTP వస్తుంది. దాన్ని మొబైల్‌లో ఎంటర్ చేస్తేనే, పబ్లిక్ వైఫై వాడుకునే వీలుంది. ఐతే.. చాలా సందర్భాల్లో యూజర్లకు OTP రావట్లేదు. అందువల్ల వాళ్లు పబ్లిక్ వైఫై వాడుకోలేకపోతున్నారు. డిజిటల్ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలనుకుంటున్న కేంద్రం... అందరికీ వైఫై ఒకటే పాస్‌వర్డ్‌తో కనెక్ట్ అయ్యేలా చెయ్యబోతోంది.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...