హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Lock Screen: ఆండ్రాయిడ్ ఫోన్ లాక్ స్క్రీన్‌.. ఎంత సింపుల్ గా తీశాడో చూడండి.. ఫోన్ కు సెక్యూరిటీ ఎలా మరి..?

Lock Screen: ఆండ్రాయిడ్ ఫోన్ లాక్ స్క్రీన్‌.. ఎంత సింపుల్ గా తీశాడో చూడండి.. ఫోన్ కు సెక్యూరిటీ ఎలా మరి..?

Lock Screen: ఆండ్రాయిడ్ ఫోన్ లాక్ స్క్రీన్‌.. ఎంత సింపుల్ గా తీశాడో చూడండి.. ఫోన్ కు సెక్యూరిటీ ఎలా మరి..?

Lock Screen: ఆండ్రాయిడ్ ఫోన్ లాక్ స్క్రీన్‌.. ఎంత సింపుల్ గా తీశాడో చూడండి.. ఫోన్ కు సెక్యూరిటీ ఎలా మరి..?

బిగ్‌బౌంటీ ప్రోగ్రామ్‌లో ఆండ్రాయిడ్‌ ఫోన్లకు పొంచి ఉన్న ముప్పును గుర్తించారు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆండ్రాయిడ్ ఫోన్లలోని లాక్ స్క్రీన్ ఫీచర్, సెక్యూరిటీ రిస్క్‌కు కారణమని తెలిపారు. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను గూగుల్‌కు సమర్పించారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

కొత్త ప్రొడక్టులను రిలీజ్‌(Release) చేసే సమయంలో కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. ఆ ప్రొడక్టులో లోపాలను కనిపెట్టేందుకు స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తాయి. కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్థులు సంబంధిత ప్రొడక్టులో ఎర్రర్స్‌ను గుర్తిస్తే కంపెనీలు బహుమతులను అందజేస్తాయి. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌కు(Development) ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి. ఇలాంటి బిగ్‌బౌంటీ ప్రోగ్రామ్‌లో ఆండ్రాయిడ్‌ ఫోన్లకు పొంచి ఉన్న ముప్పును గుర్తించారు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆండ్రాయిడ్ ఫోన్లలోని లాక్ స్క్రీన్ ఫీచర్(Screen Lock Feature), సెక్యూరిటీ రిస్క్‌కు కారణమని తెలిపారు. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను గూగుల్‌కు సమర్పించారు.

* లాక్‌ స్క్రీన్‌తో లభించని సెక్యూరిటీ

కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. కానీ యాపిల్‌ కంపెనీ మాత్రం బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఫేస్ ఐడీ టెక్నాలజీపైనే ఆధారపడుతోంది. అయితే ఇటీవల కనుగొన్న సెక్యూరిటీ ఇష్యూలు ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫోన్ లాక్ స్క్రీన్‌ని సులభంగా బైపాస్‌ చేసే అవకాశం ఉందని వివరించారు సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు డేవిడ్ షుట్జ్. లాక్ స్క్రీన్‌ని ఉపయోగించి ఫోన్‌ను ఎలా అన్‌లాక్ చేశారు, అది వినియోగదారులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేశారు.

ఈ వల్నరబిలిటీని ఉపయోగించుకోవడానికి, కాంప్రమైజ్డ్‌ ఫోన్‌, PINతో లాక్ చేసిన SIM కార్డ్ చాలని డేవిడ్ పేర్కొన్నారు. వినియోగదారుడు అదనపు సిమ్‌ను ఫోన్ స్లాట్‌లో ఇన్‌సర్ట్‌ చేసి.. రాంగ్‌ కోడ్‌ను మూడుసార్లు ఎంటర్‌ చేసి.. ఆ తర్వాత SIM కార్డ్‌లో అందుబాటులో ఉన్న PUK కోడ్‌ను ఎంటర్ చేస్తే లాక్‌ స్క్రీన్‌ ఆప్షన్‌ తొలగిపోతుందని చెప్పారు. ఈ ప్రాసెస్‌ను చూపించడానికి ఆయన ఒక వీడియో కూడా రికార్డ్‌ చేశారు.

ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ప్రమాదం

ఈ విధానాన్ని హ్యాకర్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమస్య పిక్సెల్ ఫోన్‌లకే పరిమితం అయినట్లు కనిపిస్తోందని, శామ్‌సంగ్‌ డివైజ్‌లపై ఈ వల్నరబిలిటీ ప్రభావం లేదని డేవిడ్ షుట్జ్ చెప్పారు. అయితే గూగుల్‌(Google) కంపెనీ సమస్యను అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. సమస్యలను అధిగమించడానికి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను రిలీజ్‌ చేసింది. కానీ ఆన్-స్క్రీన్ లాక్ స్క్రీన్‌తో ఉన్న ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకు ముప్పు ఉందని మాత్రం నిర్ధారణ అయింది. ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు కూడా తమ సాఫ్ట్‌వేర్ ప్రాసెస్‌లో ఈ సమస్య ప్రమాదకరమని భావిస్తే దానికి పరిష్కారాన్ని కూడా రిలీజ్‌ చేసే అవకాశం ఉంది.' isDesktop="true" id="1504294" youtubeid="dSgSnYPgzT0" category="technology">

70 వేల డాలర్ల రివార్డ్‌

బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో భాగంగా డేవిడ్ ఈ సమస్యను గూగుల్‌కి నివేదించారు. దాని కింద అతని ప్రయత్నాలకు 70,000 డాలర్లు(సుమారు రూ.5,60,000) రివార్డ్ అందజేశారు. గూగుల్‌ సమస్యను గుర్తించి, పరిష్కారాన్ని రిలీజ్‌ చేయడానికి ముందు ఘట్జ్‌ కొన్ని నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత నివేదికకు అతనికి రివార్డ్ లభించింది.

First published:

Tags: 5G Smartphone, Lock screern, Technology

ఉత్తమ కథలు