LISTEN SOUNDS FROM SOLAR SYSTEMS BIGGEST MOON GANYMEDE ARRIVE AT EARTH NS GH
Juno Mission: గురుడి ఉపగ్రహం గనిమీడ్ ఉపరితలంపై నుంచి శబ్ధాలు.. ఆ సౌండ్ మీరు కూడా వినండి
గురుడి ఉపగ్రహం గనిమీడ్ ఉపరితలంపై నుంచి శబ్ధాలు.. ఆ సౌండ్ మీరు కూడా వినండి
బృహస్పతి(గురుడు) గురించి పరిశోధనలు చేయడానికి నాసా గతంలోనే జూనో మిషన్‌ను (Juno Mission) చేపట్టింది. ఈ అంతరిక్ష నౌక గురుడి కక్ష్యలో తిరుగుతూ కీలకమైన సమాచారాన్ని భూమిపైకి పంపుతుంది. తాజాగా గురుడు ఉపగ్రహమైన గనిమీడ్ (Ganymede) ఉపరితలం నుంచి వచ్చే శబ్దాలను గుర్తించింది.
అంతరిక్ష రంగం అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుబాటులోకి వస్తున్న కొత్త తరం టెక్నాలజీతో సౌరవ్యవస్థలోని ఇతర గ్రహాలపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బృహస్పతి(గురుడు) గురించి పరిశోధనలు చేయడానికి నాసా గతంలోనే జూనో మిషన్‌ను (Juno Mission) చేపట్టింది. ఈ అంతరిక్ష నౌక గురుడి కక్ష్యలో తిరుగుతూ కీలకమైన సమాచారాన్ని భూమిపైకి పంపుతుంది. తాజాగా గురుడు ఉపగ్రహమైన గనిమీడ్ (Ganymede) ఉపరితలం నుంచి వచ్చే శబ్దాలను గుర్తించింది. 50 సెకన్ల పాటు రికార్డయిన ఆడియో ట్రాక్‌ను సేకరించింది. అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌లోని అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ఫాల్ మీటింగ్‌లో బ్రీఫింగ్లో ఈ శబ్దాలను సంగ్రహించింది. జూనో వేవ్స్ డివైజ్ నుంచి ఈ ధ్వనులను సేకరించారు. బృహస్పతి మాగ్నేటోస్పియార్లో ఉత్పత్తి చేసిన విద్యుదయాస్కాంత తరంగాలను ఈ వేవ్స్ డివైజ్ ట్యూన్ చేస్తుంది. ఆడియో ట్రాక్ చేయడానికి పరిశోధకులు ఈ ఫ్రీక్వెన్సీలను ఆడియో పరిధిలోకి మార్చారు.
"రెండు దశాబ్దాల్లో జూనో గనిమీడ్ను అధిగమించి ప్రయాణిస్తున్నప్పుడు మొదటిసారిగా ఈ శబ్దాలను సంగ్రహించింది. మీరు నిశితంగా వింటే మధ్య బిందువు చుట్టూ అధిక ఫ్రీక్వెన్సీలకు ఆకస్మిక మార్పును గుర్తించవచ్చు. ఈ శబ్దాలు గనిమీడ్ మాగ్నెటోస్పియర్లో వేరే ప్రాంతంలోకి ప్రవేశించడానికి సూచిస్తాయి." అని జూనో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ స్కాట్ బోల్టన్ చెప్పారు. ఈ ధ్వనితో పాటు బృహస్పతికి చెందిన మందమైన ధూళి ఫోటోను కూడా నాసా విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత వృద్దురాలు.. 135ఏళ్ల చైనా బామ్మ కన్నుమూత.. ఆమె ఊరికి ఓ ప్రత్యేకత
గురుడి అయాస్కాంత క్షేత్రం..
గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లోని ఖగోళ శాస్త్రవేత్తలు బృహస్పతి అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన అత్యంత వివరణాత్మక మ్యాప్‌ను రూపొందించారు. జూనో ప్రైమ్ మిషన్ నుంచి 32 కక్ష్యల దూరంలో మ్యాప్ రూపొందించారు. భూమధ్యరేఖ వద్ద ఉన్న అయాస్కాంత పరిధైన గ్రేట్ బ్లూ స్పాట్ గురించి ఇన్ సైట్స్‌ను అందించింది. అంతేకాకుండా జూనో వ్యోమనౌక నుంచి వచ్చిన సమాచారం ప్రకారం గత ఐదేళ్లలో అయస్కాంత క్షేత్రంలో గణనీయమైన మార్పులు సంభవించాయి.
గ్రేట్ బ్లూ స్పాట్ బృహస్పతి అంతర్భాగానికి సంబంధించి సెకనుకు దాదాపు రెండు అంగుళాల వేగంతో తూర్పు వైపునకు దూసుకుపోతోంది. ఈ నూతన మాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాపింగ్ భూమి అయస్కాంత క్షేత్రంతో పోల్చడానికి కూడా జూనో శాస్త్రవేత్తలను అనుమతిస్తుందని నాసా స్పష్టం చేసింది.
మన సముద్రాలపై అవగాహన..
బృహస్పతి ధ్రువాల వద్ద నెలకొంటున్న తుఫానులు మన భూమిపై ఉన్న సముద్రపు సుడిగుండాలతో సారూప్యత కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గ్రహించారు. అంతేకాకుండా ఇవి మన గ్రహంపై సంభవిస్తున్న సముద్ర భౌతిక విధానాలపై అంతర్ధృష్టిని అందించగలవని స్పష్టం చేశారు. బృహస్పతి ధ్రువాల వద్ద సంభవిస్తున్న తాజా నమూనాలు ఆకస్మికంగా ఉద్భవించాయని, ఎప్పటికీ మనుగడ సాగిస్తాయని తెలిపారు.
స్క్రిప్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫిలో ఫిజికల్ ఓషనోగ్రాఫర్గా పనిచేస్తున్న లియా సిగేల్మన్ ఈ విషయంపై స్పందించారు. జోవియన్ తుఫానుల చుట్టూ అల్లకల్లోల పరిస్థితులు, నీరు, తరంగాలు భూతలంపై ఉన్న సముద్రాలను గుర్తుచేశాయని అన్నారు. అధిక రిజుల్యూషన్‌తో తీసిన మహాసముద్రాల్లో ఉండే సుడిగుండాల చిత్రాలను గమనిస్తే ఆ విషయం అవగతమవుతుందని స్పష్టం చేశారు. ఈ శక్తి భూమి కంటే చాలా పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ మన గ్రహంలోని పరిణామాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.