Smart phones: స్మార్ట్‌ఫోన్ లవర్లకు శుభవార్త.. ఈ నెలలో భారత మార్కెట్లోకి లాంఛ్ కానున్న ఫోన్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆగస్టులో విడుదల కానున్న ఈ కొత్త ఫోన్ల గురించి తెలుసుకోండి.

  • Share this:
కొత్త టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి తయారీ సంస్థలు. ఈ క్రమంలో బడ్జెట్ ఫోన్లతో పాటు ప్రీమియం రేంజ్‌లో సైతం ప్రభావం చూపేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వివిధ ధరల శ్రేణిలో ఎప్పటికప్పుడూ కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టులో మార్కెట్లోకి విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం.
Price Hike: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... రెండు మోడళ్ల ధరలు పెంచిన షావోమీ
Amazon Great Freedom Festival Sale: అమెజాన్ లో రేపటి నుంచి ఆఫర్ల పండగ.. ఈ ఐదు ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు.. వివరాలివే

Realme 8s
రియల్‌మి 8s స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెలలోనే భారత్‌లో విడుదల చేయాలని సంస్థ భావిస్తోంది. అయితే లాంచింగ్ తేదీని ఇంకా వెల్లడించలేదు.ఈ డివైజ్ ట్రిపుల్ కెమెరా మాడ్యూల్, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 6.5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC, 5G సపోర్ట్, 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి టాప్ ఫీచర్లతో రియల్‌మి 8ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు. దీని ధర రూ.15,000 లోపు ఉండే అవకాశం ఉంది.

Realme GT 5G
రియల్‌మి GT 5G డివైజ్‌ను ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఈ ఫోన్ ఆగస్టులోనే భారత మార్కెట్లోకి రానుంది. కానీ కచ్చితమైన తేదీని సంస్థ ప్రకటించలేదు. 6.43 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 888 5G SoC వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

IQOO 8 5G
ఐక్యూ నుంచి రానున్న ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టులోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల భారత్‌లో లాంచ్ అయిన iQOO 7 మోడల్ మంచి సేల్స్ నమోదు చేసింది. దీంతో iQOO 8 సైతం విజయవంతం అవుతుందని సంస్థ భావిస్తోంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500mAh బ్యాటరీ, 120W ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేశారు.

రియల్‌మి ఫ్లాష్
రియల్‌మి ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టులోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇటీవల వైర్‌లెస్ ఛార్జర్‌ను రియల్‌మి ఆవిష్కరించింది. ఇది ఫ్లాష్‌ డివైజ్‌తో మాత్రమే పనిచేస్తుంది. అందువల్ల రియల్‌మి ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ A52s
శామ్‌సంగ్ గెలాక్సీ A52s కూడా ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ తేదీని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఫోన్ ఇటీవల గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ సైట్లో కనిపించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC, 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 OS, ఇతర ఫీచర్లతో ఏ52 ఎస్ మోడల్‌ను శామ్‌సంగ్ రూపొందించింది.

రెడ్‌మి 10
రెడ్‌మి గత సంవత్సరం విడుదల చేసిన రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్ విజయవంతమైంది. దీంతో ఈ నెలలో Redmi 10 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. భారత్‌లో దీని ధర రూ.10,000 లోపు ఉండవచ్చు. ఇండోనేషియాలో దీన్ని త్వరలో విడుదల చేయనున్నారు. అయితే భారత్‌లో లాంచింగ్ తేదీని సంస్థ ఇంకా వెల్లడించలేదు.

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్
మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ను సైతం ఈ నెలలోనే భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC, 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ వంటి ఫీచర్లతో రానున్న ఈ డివైజ్‌ లాంచింగ్ తేదీ, ధర, ఇతర వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Published by:Nikhil Kumar S
First published: