హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర.. ఈ మూడు ఫోన్లు డిస్కౌంట్లపై రూ.10 వేలలోపే.. ఎల్లుండి వరకే ఛాన్స్

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర.. ఈ మూడు ఫోన్లు డిస్కౌంట్లపై రూ.10 వేలలోపే.. ఎల్లుండి వరకే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఈ నెల 19న ప్రారంభమైన సేల్.. అక్టోబర్ 23 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గృహోపకరణాలతో సహా అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. ఈ నెల 19న ప్రారంభమైన సేల్.. అక్టోబర్ 23 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గృహోపకరణాలతో సహా అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందుకోవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్ లో అదిరే ఆఫర్లు (Diwali Offers) అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం మీరు వెతుకుతూ ఉంటే ఈ సేల్ సూపర్ ఛాన్స్ అని చెప్పవచ్చు. డిస్కౌంట్లలో రూ. 10 వేల రూపాయలలోపు ధరకే అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ల (Best Smartphones) వివరాలు ఇలా ఉన్నాయి.

Poco C31 Poco

ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 10,999. అయితే సేల్‌లో ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆఫర్ పై ఈ ఫోన్ ను రూ. 7,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంకా.. ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసి రూ.6,950 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 6.53 అంగుళాల HD + డిస్ప్లే ఉంటుంది. ఇంకా.. 5000mAh బ్యాటరీ సైతం ఈ ఫోన్ సొంతం. ఇంకా.. అదే సమయంలో ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Flipkart Diwali Offers: ఈ ప్రముఖ కంపెనీ వాషింగ్ మిషన్ పై రూ.20 వేల డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ ఇప్పట్లో రాదు.. ఓ లుక్కేయండి

Samsung Galaxy F13

Samsung Galaxy F13 ఫోన్ అసలు ధర రూ.14,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో మీరు దీన్ని అన్ని ఆఫర్‌లతో రూ.8,499కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, ఫోన్‌పై రూ.8 వేలకు పైగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఫోన్ 4 GB RAM మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేను కలిగి ఉంటుంది. 6000mAh భారీ బ్యాటరీ ఫోన్‌లో ఇవ్వబడింది. ఫోటోగ్రఫీ కోసం, ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది.

Redmi 10

Redmi 10 ఫోన్ అసలు ధర రూ. 14,999. దీపావళి సేల్ లో అందుబాటులో ఉన్న ఆఫర్‌లతో, మీరు ఈ ఫోన్‌ను రూ.7,999కే కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్‌పై రూ.8,400 వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. Redmi 10 6.7-అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంది. ఇది కాకుండా, మీరు ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 6000mAh భారీ బ్యాటరీని కూడా పొందుతారు.

ఇది మాత్రమే కాకుండా.. బిగ్ దీపావళి సేల్ కింద, SBI బ్యాంక్ కార్డ్‌తో షాపింగ్ చేసే కస్టమర్‌లకు 10 శాతం తక్షణ తగ్గింపు సైతం లభిస్తుంది.

First published:

Tags: Flipkart Big Diwali Sale

ఉత్తమ కథలు