Best Smartphones Under Rs 30,000: బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

రూ. 30 వేల ధరతో బెస్ట్ స్మార్ట్ ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రూ. 30 వేల లోపు ధరతో ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి.

  • Share this:
    గత మూడు నెలలుగా స్మార్ట్ ఫోన్ (Smartphone) తయారీదారులు ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన మోడళ్లను మార్కెట్లోకి వరుసగా విడుదల చేస్తున్నారు. Xiaomi, Samsung, Realme తదితర బ్రాండ్ల నుంచి ఇటీవల పలు మోడళ్లు విడుదలయ్యాయి. ఈ మోడళ్లు 5G కనెక్టివిటీ (5G connectivity) ఫీచర్ మాత్రమే కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్, 120 Hz డిస్ప్లే, మంచి కెమెరా కలిగిన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ సమయంలో మీరు రూ. 30 వేల బడ్జెట్ తో మీరు స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే. ఈ కింది ఫోన్లపై ఓ లుక్కేయండి.

    Xiaomi Mi 11X 5G (From Rs 29,999): ఈ ఫోన్ 6.67 అంగుళాల Full-HD+ E4 AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరాతో పాటు 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇంకా 4520mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ 33W ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. రూ. 29, 999 ప్రారంభ ధరతో ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
    Flipkart Bumper Offer: ఫ్లిప్ కార్ట్ లో బంపరాఫర్.. రూ. 6 వేలకే రూ. 19,900 విలువైన సాంసంగ్ స్మార్ట్ టీవీ.. వివరాలివే

    OnePlus Nord 2 5G:
    ఈ ఫోన్ 1200 AI చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఇంకా 6.43 ఇంచుల ఫుల్ హెచ్డీ + ఆల్మోడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా 90Hz రీఫ్రెష్ రేటు ఉంటుంది. ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.29,999.
    Vivo T1 Series: వివో T1 సిరీస్​లో కొత్తగా రెండు 5జీ స్మార్ట్​ఫోన్లు లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!


    Samsung Galaxy M52 5G (from Rs 24,999): ఈ ఫోన్ 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ+ఆల్మోడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇంకా 25W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపొర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 24, 999.
    Whatsapp: ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్‌లో మీ ఫోన్ ఉందమో చెక్ చేసుకోండి

    Poco F3 GT 5G (from 28,999): ఈ ఫోన్ 6.67 అంగుళాల ఆల్మోడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా 120 Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. ఇంకా 64 అంగుళాల మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీంతో పాటు 5065mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇంకా ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 28, 999.
    Nokia C30: భారత మార్కెట్​లోకి నోకియా సి 30 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్​.. జియో ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​తో రూ.10 వేలలోపే లభ్యం

    Realme X7 Max 5G: ఈ ఫోన్ 6.43 అంగుళాల Full HD+ sAMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. ఇంకా 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4, 500 mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 26,999.
    Published by:Nikhil Kumar S
    First published: