హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Best Mileage Bikes: రూ. 2కే ఒక కిలో మీటర్ మైలేజ్.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ లు ఇవే.. ఓ లుక్కేయండి

Best Mileage Bikes: రూ. 2కే ఒక కిలో మీటర్ మైలేజ్.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ లు ఇవే.. ఓ లుక్కేయండి

రూ. 2కే ఒక కిలో మీటర్ మైలేజ్.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ లు ఇవే.. ఓ లుక్కేయండి

రూ. 2కే ఒక కిలో మీటర్ మైలేజ్.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ లు ఇవే.. ఓ లుక్కేయండి

మంచి మైలేజ్ ఇచ్చే బైక్ ల కోసం వెతుకున్నారా? అయితే.. కేవలం రూ. 2 కే ఒక కిలోమీటర్ కన్నా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ ల లిస్ట్ మీ కోసం..

కరోనా (Corona) వచ్చినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ సొంతంగా వాహనం ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో దేశంలో ద్విచక్ర వాహనాల(Bike) ఉత్పత్తి, వినియోగం గణనీయంగా పెరుగుతోంది. చాలా కంపెనీలు కొత్త బైక్‌లను (New Bikes) మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే.. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో వినియోగదారులు అధిక మైలేజ్ ఇచ్చే బైక్ ల కోసం వెతుకున్నారు. అయితే రూ.2 కంటే తక్కువ ధరకే కిలోమీటరు వరకు ప్రయాణించే బైక్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అంటే 70 కి.మీ వరకు మైలేజీ ఇస్తాయన్నమాట. ఈ లిస్ట్ లో హీరో, టీవీఎస్, బజాజ్ బైక్‌లు ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

హీరో స్ప్లెండర్ ప్లస్(hero splendor plus):

హీరో కంపెనీకి చెందిన ఈ బైక్ 97.2సీసీ ఇంజన్ కలిగి ఉంటుంది. పెట్రోల్‌తో నడిచే హీరో స్ప్లెండర్ ప్లస్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 7.91 బీహెచ్‌పి పవర్ మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బైక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో నియంత్రించబడుతుంది. మరియు 62 kmpl మైలేజీని అందిస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ ధర రూ.64,850.

Electric Scooter: ఇండియా మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే..

TVS రైడర్ 125(TVS Raider 125):

టీవీఎస్ బైక్ 124.8 సీసీ ఇంజన్‌తో వస్తుంది. TVS రైడర్ 125 బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. అంతే కాదు, ఈ బైక్ 7500 rpm వద్ద 11.2 bhp శక్తిని అందిస్తుంది. ఇది BS 6 ఇంజిన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Bikes: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? రూ.1 లక్షలోపు లభిస్తున్న టాప్ బైక్స్ ఇవే

హోండా CD 110 డ్రీమ్(Honda CD 110 Dream):

ఈ హోండా బైక్ 64.5 kmpl మైలేజీని అందిస్తుంది. 109.51cc ఇంజిన్ ద్వారా నియంత్రించబడుతుంది. ఈ ఇంజన్ 7500 rpm వద్ద 8.67 bhp శక్తిని అందిస్తుంది మరియు 5500 rpm వద్ద 9.30 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా CD 110 Dream BS6 ఇంజిన్‌తో నియంత్రించబడుతుంది మరియు దీని ఆన్-రోడ్ ధర రూ.76,629.

Honda Activa: బంపరాఫర్.. కేవలం రూ. 23 వేలకే హోండా యాక్టీవా.. ఇలా కొనుగోలు చేయండి

బజాజ్ ప్లాటినా 100(Bajaj Platina 100):

బజాజ్ ప్లాటినా 100 ఆన్-రోడ్ ధర రూ. 62,000 ఈ బైక్ 102cc ఇంజన్‌తో 7500rpm వద్ద 7.9bhp శక్తిని మరియు 5500rpm వద్ద 8.34Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్లాటినా బైక్ 72 kmpl మైలేజీని అందిస్తుంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Hero, Motor Cycle

ఉత్తమ కథలు