Best Budget Smartphones: రూ. 10 వేలలోపే ఈ ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లు.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

తక్కువ ధరతో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. రూ. 10 వేల లోపు ధరకే లభించే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి.

  • Share this:
భారత మార్కెట్​లో బడ్జెట్​ ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్లకు మంచి డిమాండ్​ ఉంటుంది. అందుకే మొత్తం మార్కెట్​ వాల్యూలో రూ. 10 వేలలోపు లభించే స్మార్ట్​ఫోన్ల వాటానే ఎక్కువ. మీరు కూడా రూ. 10 వేలలోపు లభించే బెస్ట్​ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా?.. అయితే, ఈ ఫోన్లను పరిశీలించండి.

Realme Narzo 30A
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ రియల్‌మీ నుంచి విడుదలైన నార్జో 30 ఎ స్మార్ట్​ఫోన్​ రూ .10 వేల ధర వద్ద లభిస్తుంది. రియల్‌మీ నార్జో 30ఎ 6.5 -అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. దీనిలో మీడియాటెక్ హెలియో జి 85 చిప్‌సెట్ అందించింది. ఇది 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్​ స్టోరేజ్​తో వస్తుంది. దీనిలోని 6WmAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్​ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్​ను కూడా అందించింది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ AI కెమెరాను చేర్చింది.

Xiaomi Redmi 9 Prime
రెడ్‌మి 9 ప్రైమ్ భారత మార్కెట్​లో రూ .9,999 ధర వద్ద అందుబాటులో ఉంది. అందుకే రెడ్‌మి 9 ప్రైమ్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఇది 6.53 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ హెలియో జి 80 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనిలో 4 జిబి ర్యామ్‌, 128 జిబి ఇంటర్నల్​ స్టోరేజ్​ను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరాతో 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలను చేర్చింది.

Poco C3
పోకో సి 3 భారత మార్కెట్​లో రూ .7,499 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.35 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ హెలియో జి 35 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 4 జిబి ర్యామ్, 64 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీనిలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

 Realme Narzo 20A
రియల్‌మీ నార్జో 20 ఎ భారత మార్కెట్​లో రూ .8,499 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 -అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్​తో పనిచేస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్​ స్టోరేజ్​ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించారు. దీనిలో 12 మెగాపిక్సెల్ AI షూటర్‌ కెమెరాను చేర్చింది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Infinix Hot 10S
ఇన్ఫినిక్స్ హాట్ 10 ఎస్ భారత మార్కెట్​లో రూ. 9,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 6.82-అంగుళాల HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీడియాటెక్ యొక్క హెలియో జి 35 చిప్‌సెట్​తో పనిచేస్తుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్​ స్టోరేజ్​తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

Realme C25
రియల్‌మీ సి 25 భారత మార్కెట్​లో రూ .9,999 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5- అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ హెలియో జి 70 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4 జిబి ర్యామ్‌, 128 జిబి ఇంటర్నల్​ స్టోరేజ్​తో వస్తుంది. దీనిలో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​తో కూడిన 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇది 13 మెగాపిక్సెల్ ప్రైమరీ AI షూటర్‌తో వస్తుంది.

Moto G10 Power
మోటో జి 10 పవర్​ భారత మార్కెట్​లో రూ .9,999 ధర వద్ద లభిస్తుంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5- అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. మోటో జి 10 పవర్​లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చింది. ఇది క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్​ కెమెరాని చేర్చింది.

Micromax In 1b
మైక్రోమాక్స్ 1 బి స్మార్ట్​ఫోన్​ భారత మార్కెట్​లో రూ. 6,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 6.52 -అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ హెలియో జి 35 చిప్‌సెట్​తో పనిచేస్తుంది. దీనిలో 2 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించింది. ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్ ఉంటుంది.

Samsung Galaxy M11
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11 భారత మార్కెట్​లో రూ .9,999 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.4- అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్​ స్టోరేజ్​ అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చింది. దీనిలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్ కెమెరా ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published: