Best 5G Phones Under Rs 20000: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, రూ. 20 వేల లోపు లభించే ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ప్రస్తుతం రూ. 20 వేల కన్నా తక్కువ ధరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి.

  • Share this:
    ప్రస్తుతం మార్కెట్లో 5G ఫోన్ల హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ తయారీదారులు సైతం తక్కువ ధరకు వినియోగదారులకు 5G ఫోన్లను అందించడంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేద్దాం..
    Best Recharge Plans Under Rs 100: రూ. 100లోపే డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్.. Jio, Airtel, Vi అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే
    Unlimited Data Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ ఇవే

    iQoo Z3 5G: ఈ ఫోన్ 6.58 అంగుళాల Full-HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. రెండు 5జీ సిమ్ కార్డులను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ట్రిపుల్ రేర్ కెమెరాలను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ సొంతం. . ఈ ఫోన్ ను రూ. 19,900కు అందుబాటులో ఉంది.

    Realme 8 5G (approx Rs 14,499): రూ, 15 వేల లోపు ధరతో 5జీ ఫోన్ ను కొనాలనుకుంటున్న వారికి ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఎంపికగా చెప్పొచ్చు. ఈ ఫోన్ 6.5 అంగుళాల full-HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 48 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీని సపోర్ట్ చేస్తుంది. 18W క్విక్ చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ ను ప్రస్తుతం రూ. 14,499కే సొంతం చేసుకోవచ్చు.

    Redmi Note 10T 5G: ఈ 5జీ ఫోన్ ను ఇటీవలే రెడ్ మీ విడుదల చేసింది. ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 18W ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మొదటి సేల్ జులై 26న నిర్వహించారు. ఈ ఫోన్ ప్రస్తుత ధర రూ. 13,999.

    Poco M3 Pro 5G: ఈ ఫోన్ ను కూడా రూ. 15 వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో పాటు 90Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో పాటు 5000mAh బ్యాటరీని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ను రూ. 13,999కే సొంతం చేసుకోవచ్చు.

    Moto G60 : ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 21,999 కాగా 18 శాతం డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ లో రూ. 17,999కి లభిస్తోంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల Full-HD+ IPS డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ను కలిగి ఉంటుంది. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 6000mAh బ్యాటరీతో పాటు టర్బో పవర్ 20 ఫాస్ట్ ఛార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
    Published by:Nikhil Kumar S
    First published: