• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • LIST OF 15 SMARTWATCHES AND FITNESS BANDS FROM SAMSUNG ONE PLUS APPLE AND OTHERS HAVING SPO2 MONITORING FEATURE NS GH

SpO2 Monitoring: మీ బ్లడ్ ఆక్సిజన్ లెవల్ ట్రాక్ చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ గాడ్జెట్లను ఉపయోగించండి

SpO2 Monitoring: మీ బ్లడ్ ఆక్సిజన్ లెవల్ ట్రాక్ చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ గాడ్జెట్లను ఉపయోగించండి

ప్రతీకాత్మక చిత్రం

ఈ కరోనా నేపథ్యంలో అందరికీ ఆరోగ్యంపై జాగ్రత్త ఏర్పడింది. వైరస్ సోకిందన్న భయంతో బ్లడ్ ఆక్సీజన్ లెవల్స్ ను చెక్ చేసుకోవడానికి ఆస్పత్రులకు పరిగెత్తుతున్నారు. అయితే బ్లడ్ ఆక్సిజన్ లెవల్‌ను ఈ గాడ్జెట్ల ద్వారా ఆస్పత్రికి వెళ్లకుండానే తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం.

  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. తమ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే, దీని కోసం ఎక్కడికో హాస్పిటల్‌కు పరుగెత్తాల్సిన పనిలేదు. అర చేతికి పెట్టుకునే స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్ల సహాయంతో మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కీలకమైన బ్లడ్ ఆక్సిజన్ లెవల్‌ను గుర్తించే ఈ గాడ్జెట్లతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుబాటు ధరలోనే ఇవి మార్కెట్లో లభిస్తుండటం విశేషం. మీ SpO2 లెవల్‌ను మానిటర్ చేసుకోగలిగే ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లను పరిశీలించండి.

Apple Watch Series 6:
యాపిల్ వాచ్ సిరీస్ 6 మీరు సులభంగా ఆక్సిజన్ లెవల్‌ను ట్రాక్ చేయవచ్చు. ఇది 41 ఎంఎం, 44 ఎంఎం రెండు సైజుల్లోనూ లభిస్తుంది. యాపిల్ వాచ్ సిరీస్ 6లో ఒక SpO2 మానిటర్‌తో పాటు యాక్టివిటీ ట్రాకింగ్, ఈసిజి, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్, మరిన్ని సెన్సార్‌లను అందించింది. ప్రస్తుతం దీని ప్రారంభ వేరియంట్ రూ. 43,900 ధర వద్ద లభిస్తుంది.

​Samsung Galaxy Watch 3:
శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 3 అసలు ధర రూ .28,650 వద్ద ఉండగా.. డిస్కౌంట్ కింద దీన్ని రూ .17,340లకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ 41 ఎంఎం, 45 ఎంఎం రెండు సైజుల్లో లభిస్తుంది. దీనిలో స్లీప్ ట్రాకింగ్, ఐపిఎక్స్ 7 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 మానిటరింగ్ సిస్టమ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించింది.

OnePlus Watch:
ఈ స్మార్ట్‌వాచ్ మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో SpO2 మానిటరింగ్ ఫీచర్ను అందించింది. దీనితో పాటు 110 వర్కౌట్ మోడ్స్, ఐపి 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లను చేర్చింది. వన్‌ప్లస్ వాచ్‌ను ఫ్లాష్ సేల్ ద్వారా రూ .12,999లకే కొనుగోలు చేయవచ్చు.

Amazfit GTR 2e SmartWatch:
అమేజ్‌ఫిట్ జిటిఆర్ 2లో హార్ట్ రేట్ మానిటరింగ్, యాక్టివిటీ ట్రాకింగ్, స్లీప్ అండ్ స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను చేర్చింది. దీనిలో 14 రోజుల బ్యాటరీ లైఫ్ గల ఈ స్మార్ట్వాచ్లో SpO2 ఆక్సిజన్ మానిటరింగ్‌ను కూడా అందించింది. ఈ వాచ్‌ను అమెజాన్‌లో 9,499 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

Amazfit GTS2 mini Smart Watch:
చాలా తేలికైన ఈ స్మార్ట్‌వాచ్‌లో SpO2తో సహా మల్టిపుల్ సెన్సార్లను అందించారు. దీన్ని రూ .3,000 డిస్కౌంట్‌తో రూ. 6,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. 1.55 -అంగుళాల డిస్‌ప్లే గల ఈ స్మార్ట్‌వాచ్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Realme Watch S:
రియల్‌మి వాచ్ ఎస్‌లో హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్, యాక్టివిటీ ట్రాకింగ్‌తో పాటు SpO2 ట్రాకింగ్‌ను అందించింది. 1.3 అంగుళాల డిస్‌ప్లే గల ఈ స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ .4,999కే కొనుగోలు చేయవచ్చు. దీనిలో 15 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందించింది.

Amazfit Bip U:
SpO2 మానిటర్‌ ఫీచర్‌ను అందిస్తున్న చౌకైన స్మార్ట్‌వాచ్‌లలో అమేజ్‌ఫిట్ బిప్ యూ ఒకటి. ఇది 1.43-అంగుళాల HD డిస్‌ప్లే గల ఈ స్మార్ట్‌వాచ్‌లో 60కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, బ్రీతింగ్ ట్రాకింగ్‌ను అందిచింది. దీన్ని రూ.3,599లకే కొనుగోలు చేయవచ్చు.

​Noise ColorFit Pro 3 smartwatch:
నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3 స్మార్ట్‌వాచ్ 1.55 అంగుళాల హెచ్‌డి టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. SpO2 మానిటర్, స్లీప్ అండ్ స్ట్రెస్ ట్రాకింగ్ వంటి వాటిని చేర్చింది. ప్రస్తుతం ఇది రూ.3,999లకు లభిస్తుంది.

Oppo Band Style:
ఒప్పో బ్యాండ్ స్టైల్ స్మార్ట్‌వాచ్ చాలా తేలిగ్గా ఉంటుంది. దీనిలో SpO2 మానిటరింగ్ ఫీచర్‌ను అందించింది. దీనితో పాటు యోగా, క్రికెట్, స్విమ్మింగ్ మొదలైన 12 వర్కవుట్ మోడ్‌లు, 40 వాచ్ ఫేస్‌లను కూడా దీనిలో చేర్చింది. ఫిట్‌నెస్ బ్యాండ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఇది రూ.2,399లకు లభిస్తుంది.

OnePlus Band:
వన్‌ప్లస్ బ్యాండ్ 1.1-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డ్యూయల్ కలర్ బ్యాండ్ డిజైన్‌ గల ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌లో హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ మానిటరింగ్‌తో పాటు SpO2 మానిటర్ వంటి ఫీచర్లను చేర్చింది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మాత్రమే పని చేస్తుంది. ప్రస్తుతం ఇది రూ.2,499లకు లభిస్తుంది.

Fitbit Charge 4:
ఫిట్‌బిట్ ఛార్జ్ 4లో SpO2 ట్రాకింగ్‌ ఫీచర్‌ను అందించారు. దాని ముందు వెర్షన్ ఫిట్‌బిట్ ఛార్జ్ 3లో కూడా ఈ ఫీచర్‌ ఉంది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌లో యాక్టివిటీ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటర్, జిపిఎస్ వంటి మరిన్ని ఫీచర్లను కూడా జోడించింది. ప్రస్తుతం ఇది రూ. 10,848లకు లభిస్తుంది.

Garmin vivosmart 4:
గార్మిన్ వివోస్మార్ట్ 4 ఫిట్‌నెస్ ట్రాకర్‌లో SpO2 మానిటర్‌ ఫీచర్‌ను అందించారు. దీని సహాయంతో బ్యాండ్ స్ట్రెంత్ ట్రైనింగ్, ఎలిప్టికల్ ట్రైనింగ్, స్టెయిర్ స్టెప్పింగ్, యోగాతో సహా పలు యాక్టివిటీలను ట్రాక్ చేయవచ్చు. దీనిలో హార్ట్ రేట్ మానిటరింగ్, బారోమెట్రిక్ ఆల్టిమీటర్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ వంటి ఫీచర్లను జోడించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింట్లోనూ పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది రూ.12,169 ధర వద్ద లభిస్తుంది.

​Honor Band 5i:
హానర్ బ్యాండ్ 5i అమెజాన్‌లో రూ .1,199 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 0.95 -అంగుళాల AMOLED డిస్ప్లే గల ఈ స్మార్ట్‌వాచ్‌లో ట్రూస్లీప్ మానిటర్, హార్ట్ రేట్ మానిటర్ వంటి ఫీచర్లను జోడించింది. దీనిలో ఇండోర్, అవుట్డోర్ యాక్లివిటీలతో పాటు మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్‌లను కూడా అందించింది.

Honor Band 5:
హానర్ బ్యాండ్ 5 SpO2 లెవల్ మానిటరింగ్‌ను అందిస్తుంది. ప్రస్తుతం, దీన్ని రూ .2,199 ధర వద్ద ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. 0.95 -అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే గల ఈ ఫిట్ నెస్ ట్రాకర్‌లో స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటర్ వంటి ఫీచర్లను చేర్చింది.

Amazfit Band 5:
అమేజ్‌ఫిట్ బ్యాండ్ 5 అనేది ఒక ఫీచర్-రిచ్ ఫిట్‌నెస్ బ్యాండ్. ఇందులో SpO2 మానిటరింగ్ ఫీచర్ను అందించింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.9,306 వద్ద లభిస్తున్న ఈ ఫిట్నెస్ బ్యాండ్‌లో 15 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందించారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ప్లాట్‌ఫారమ్‌లకు మద్దతు ఇస్తుంది.
Published by:Nikhil Kumar S
First published: