Smart TV Offers | మీరు స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ (Offer) ఒకటి అందుబాటులో ఉంది. ఏంటి ఆ ఆఫర్ అని చూస్తున్నారా? రూ. 42 వేల స్మార్ట్ టీవీని కేవలం రూ. 13,394కే కొనుగోలు చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే.
ఫ్లిప్‌కార్ట్‌లో 43 ఇంచుల స్మార్ట్ టీవీపై కళ్లుచెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. బీతూఎస్ఓఎల్ 43 ఇంచుల స్మార్ట్ టీవీపై ఈ ఆఫర్ లభిస్తోంది. ఈ 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఎంఆర్‌పీ రూ. 41,990గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా రూ. 14,099కే కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు నేరుగానే 66 శాతం తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే ఉచితంగా 5 జీబీ డేటా.. ఆఫర్ కొన్ని రోజులే!
అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే రూ. 705 వరకు డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీకు ఈ స్మార్ట్ టీవీ రూ. 13,394కే లభించినట్లు అవుతుంది. అందుబాటు ధరలో అదిరిపోయే టీవీ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. ఇందులో 24 వాట్ స్పీకర్లు, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్లు ఉన్నాయి.
బడ్జెట్ 2023.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..!
అంతేకాకుండా మీరు ఈ టీవీని తక్కువ ఈఎంఐ ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 489 నుంచి ప్రారంభం అవుతోంది. 36 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 24 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 691 చెల్లించాలి. 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 880 పడుతుంది.
అంతేకాకుండా 12 నెలల ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు నెలకు రూ. 1273 చెల్లించాల్సి వస్తుంది. 9 నెలల ఈఎంఐ అయితే రూ. 1660 కట్టాలి. అదే ఆరు నెలల ఈఎంఐ అయితే రూ. 2500 వకు ఈఎంఐ పడుతుంది. మూడు నెలలు అయితే నెలకు రూ. 4800 చెల్లించాలి. ఇలా మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన నెలవారీ ఈఎంఐ మారుతుంది. క్రెడిట్ కార్డు ప్రాతిపదికన ఈఎంఐ టెన్యూర్, ఈఎంఐ మొత్తం మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి. కొన్ని కార్డులపై ఎక్కువ టెన్యూర్ అందుబాటులో ఉండకపోవచ్చు. లేదంటే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా కూడా కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart tv, Flipkart, Flipkart offers, Latest offers, Smart TV, Smart tvs