హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Solar EV Car: త్వరలోనే లాంచ్‌ కానున్న ఫస్ట్‌ సోలార్ కార్‌.. ఏడాదికి 11 వేల కిలోమీటర్లు నడిచే ఈ కారు ఫీచర్‌లు ఇవే!

Solar EV Car: త్వరలోనే లాంచ్‌ కానున్న ఫస్ట్‌ సోలార్ కార్‌.. ఏడాదికి 11 వేల కిలోమీటర్లు నడిచే ఈ కారు ఫీచర్‌లు ఇవే!

ప్రపంచలోని తొలిసారిగా సోలార్ కార్ ఈ ఏడాది లాంచ్ కానుంది.

ప్రపంచలోని తొలిసారిగా సోలార్ కార్ ఈ ఏడాది లాంచ్ కానుంది.

ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ ఈవీ కారు (Solar EV Car) కమర్షియల్‌గా ఎప్పుడూ అందుబాటులోకి వస్తుందా అని ఎంతో కాలంగా వాహనదారులు (Cars) ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నెదర్లాండ్స్ ఆధారిత సోలార్ ఈవీ స్టార్టప్ లైట్‌ఇయర్ (Lightyear) తీపి కబురు అందించింది.

ఇంకా చదవండి ...

ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ ఈవీ కారు (Solar EV Car) కమర్షియల్‌గా ఎప్పుడూ అందుబాటులోకి వస్తుందా అని ఎంతో కాలంగా వాహనదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నెదర్లాండ్స్ ఆధారిత సోలార్ ఈవీ స్టార్టప్ లైట్‌ఇయర్ (Lightyear) తీపి కబురు అందించింది. ఈ ఏడాదిలోగా ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ కారు (World's First Solar EV Car)ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. తాజాగా ఈ కంపెనీ తన సోలార్ కారు ఫైనల్ డిజైన్‌ను ఆవిష్కరించింది. అలాగే దీని అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసింది. కంపెనీ ఈ సోలార్ ఈవీ కారుకు లైట్ఇయర్ 0 (Lightyear 0) అని పేరు పెట్టింది. ఈ కారు పవర్‌ట్రెయిన్‌ సోలార్, ఎలక్ట్రిక్ పవర్‌ని వినియోగిస్తూ నడుస్తుంది. దీనివల్ల కారు రేంజ్ 1000 కి.మీ పెరిగింది. అయితే సోలార్‌ పవర్‌తో నడిచే ఈ కారును ఏడు నెలల్లో ఒక్కసారి ఛార్జ్ చేసినా చాలు.. వేల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదే ఇందులోనే అసలు ప్రత్యేకత. మరి ఏడు నెలలు ఛార్జింగ్‌ పెట్టకపోయినా ఈ కారు ఎలా పనిచేస్తుంది? దీని మరిన్ని ప్రత్యేకతలేంటి వంటి వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం కంపెనీకి ఈ సోలార్ కార్లను ఉత్పత్తి చేసి విక్రయించడమే తరువాయి అన్నట్లుగా మారింది. అంటే దాదాపు అన్ని ప్రక్రియలు, టెస్టులు పూర్తయి మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి కంపెనీ రెడీ అయిపోయింది. లైట్‌ఇయర్ 0 సోలార్ ఈవీ ధరను 263,243 డాలర్లు లేదా రూ.2.05 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. 2022 చివరి నెలల్లో ఐరోపా అంతటా సోలార్ కార్లు రోడ్లపై సందడి చేయనున్నాయి. కంపెనీ ప్రకారం, 2022 నవంబర్‌లో తొలి సోలార్ కార్లు వాహనదారులకు చేరుకుంటాయి. కాగా ఈ డచ్ కంపెనీ ఒక ఏడాదిలో కేవలం 946 సోలార్ కార్లను మాత్రమే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించింది.

ఇదీ చదవండి:  అబ్బో ఈమెది మామూలు బుర్ర కాదయ్యో..! చిన్న ట్రాకర్‌తో బాయ్‌ఫ్రెండ్‌నే మర్డర్ చేసింది.. యాపిల్ యూజర్స్ జర జాగ్రత..!


ఫైనల్ ప్రొడక్ట్ కోసం ఆరేళ్ల శ్రమ

కంపెనీకి ఆరేళ్ల క్రితమే అంటే 2016లోనే solar carను తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనలు నిజం చేసేందుకు కంపెనీ మూడేళ్లపాటు చెమటోడ్చి ఒక సోలార్ కారు ప్రోటోటైప్‌ లేదా ఫస్ట్ మోడల్ తయారు చేసింది. ఆ తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డిజైన్, ఇంజనీరింగ్, వెహికల్ టెస్టింగ్ కోసం కంపెనీకి మరో మూడేళ్ల సమయం పట్టింది. ఈ విధంగా solar కారును అందరూ నడపగల వాహనంగా మార్చేందుకు కంపెనీకి ఆరేళ్ల సమయం పట్టిందని లైట్‌ఇయర్ సీఈఓ లెక్స్ హోఫ్స్‌లూట్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రష్యాలానే చైనా కూడా యుద్ధానికి సిద్ధమైందా..? చైనా ప్రత్యర్థి ఎవరంటే..?


ఛార్జింగ్ పెట్టకపోయినా నడిచే కారు

ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఈ కారుపై డబుల్ కర్వ్డ్ సోలార్ ప్యానల్స్ అందించారు. సూర్యుడి నుంచి solar ఎనర్జీని సేకరించడంలో సహాయపడే ఈ ప్యానల్స్ కారు రూఫ్‌పై ఐదు మీటర్ల చదరపు విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఎండకి కొదవే లేని ప్రాంతాల్లో ఇవి దాదాపు 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఒకవేళ ఆకాశంలో మబ్బులు ఉంటే కనీసం 35 కిలోమీటర్ల అయినా ప్రయాణం చేయొచ్చు. సమ్మర్‌లో ఛార్జర్‌ను ప్లగ్ చేయాల్సిన అవసరం లేకుండా కారును 7 నెలల వరకు డ్రైవ్ చేయవచ్చని లైట్‌ఇయర్ చెబుతోంది. అయితే ఎండాకాలం ఎంత ఎక్కువగా ఉంటే అన్ని నెలల పాటు ఛార్జింగ్ అవసరం లేకుండా సోలార్ ఎనర్జీ తో దీనిని నడపవచ్చు. ఎక్కువ సూర్యకాంతి ఉన్న స్పెయిన్ లేదా పోర్చుగల్ వంటి ప్రాంతాల్లో ఈ కారును ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండానే ఏడు నెలల వరకు వాడుకోవచ్చు. ఇక నెదర్లాండ్స్ వంటి తక్కువ సూర్యరశ్మి ఉన్న ప్రాంతాల్లో రెండు నెలల పాటు వాడుకోవచ్చు. సూర్యకాంతి అందుబాటులో లేనప్పుడు వీటిని ఛార్జ్ చేయాల్సి వస్తుంది. సోలార్ ప్యానెల్స్ సేకరించే సోలార్ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఇందులో రీఛార్జబుల్ బ్యాటరీని అందించారు. ఛార్జింగ్ లేకుండా కేవలం సోలార్ ఎనర్జీతో కారుని ఏడాదికి 11 వేల కిలోమీటర్లు డ్రైవింగ్ చేయవచ్చని కూడా కంపెనీ తెలిపింది.

సోలార్ ప్యానెల్స్‌తో పాటు, కారు నాలుగు ఇన్-వీల్ మోటార్‌ల నుంచి ఎనర్జీ ఉపయోగించుకొని నడుస్తుంది. 60kWh బ్యాటరీ ప్యాక్‌తో ఇన్-వీల్ మోటార్లు ఒకే ఛార్జ్‌పై 625 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి. పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే గంటకు దాదాపు 110 కిలోమీటర్ల హైవే వేగంతో డ్రైవ్ చేసినా కారు 560 కిలోమీటర్లు మైలేజ్ అందించగలదు. ఇందులో ఆఫర్ చేసిన డ్రాగ్ కోఎఫీషియంట్ 0.19 సీడీ లైట్‌ఇయర్ 0ని బెస్ట్ ఏరోడైనమిక్ ఫ్యామిలీ కార్లలో ఒకటిగా నిలుపుతోంది. ఈ కారు ఇంటీరియర్ విషయానికి వస్తే.. మొక్కల ఆధారిత తోలును సీట్లలో మెత్తగా అందించారు. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే, ఫోన్-యాజ్-కీ వంటి అడ్వాన్స్ ఫీచర్లు కూడా ఆఫర్ చేస్తున్నారు.

Published by:Mahesh
First published:

Tags: Auto News, Electric Car

ఉత్తమ కథలు