హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Explained: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన లైట్ కంబాట్ హెలికాప్టర్.. దీని ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే..

Explained: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన లైట్ కంబాట్ హెలికాప్టర్.. దీని ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Helicopter: పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH)ను తాజాగా భారత అమ్ములపొదిలోకి చేరింది. అక్టోబర్ 3న లైట్ కంబాట్ హెలికాప్టర్ల ఫస్ట్ బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)లోకి ప్రవేశించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Delhi, India

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH)ను తాజాగా భారత అమ్ములపొదిలోకి చేరింది. అక్టోబర్ 3న లైట్ కంబాట్ హెలికాప్టర్ల ఫస్ట్ బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)లోకి ప్రవేశించింది. శత్రు వైమానిక రక్షణను ధ్వంసం చేయగల ఈ కంబాట్ హెలికాప్టర్‌ను జోధ్‌పూర్ ఎయిర్ బేస్‌లో భారత వైమానిక దళం (IAF) చేర్చుకుంది. దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) డెవలప్ చేసింది. LCH అనేది ప్రపంచంలోని ఏకైక కంబాట్ హెలికాప్టర్ అని HAL పేర్కొంది. ఇది ఆయుధాలు, ఫ్యూయల్‌తో 5,000 మీటర్ల ఎత్తులో సింపుల్‌గా ల్యాండ్, టేకాఫ్ అవ్వగలదు. మరి ఈ హెలికాప్టర్ మరిన్ని ప్రత్యేకతలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

* లైట్ కంబాట్ హెలికాప్టర్ విశేషాలు

లైట్ కంబాట్ హెలికాప్టర్ గరిష్ఠ టేకాఫ్ బరువు 5.8 టన్నులు. గరిష్ఠ వేగం 268Kmph. దీని రేంజ్ 550 కిలోమీటర్లు. ఇది ఎగరగలిగే గరిష్ఠ సాంద్రత ఎత్తు 6.5 కిలోమీటర్లు. మూడు గంటల కంటే ఎక్కువ ఎండ్యూరెన్స్, సర్వీస్ సీలింగ్ ఉండటం దీని ప్రత్యేకత. ఈ హెలికాప్టర్ రాడార్ సిగ్నేచర్ తగ్గించడానికి రాడార్-అబ్సార్బింగ్ మెటీరియల్ ఉపయోగిస్తుంది. క్రాష్ ప్రూఫ్ స్ట్రక్చర్, ల్యాండింగ్ గేర్‌ను సైతం ఇందులో ఆఫర్ చేశారు. ఇందులోని ఒత్తిడితో కూడిన క్యాబిన్ అనేది అణు, జీవ, రసాయన (NBC) దాడుల నుంచి రక్షణను అందిస్తుంది. హెలికాప్టర్‌లో శత్రు రాడార్లు లేదా శత్రు క్షిపణుల ఇన్‌ఫ్రారెడ్ సీకర్ల నుంచి రక్షణ పొందేలా ఇందులో కౌంటర్‌మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్‌ను అమర్చారు.

20 మి.మీ టరెట్ గన్, 70 ఎంఎం రాకెట్లు, ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ ఇందులో వెపన్ సిస్టమ్స్‌గా ఇచ్చారు. LCH అనేది రెండు ఫ్రెంచ్-ఆరిజిన్‌ శక్తి(Shakti) ఇంజన్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. పైన పేర్కొన్న ఫీచర్లతో LCH శత్రు వైమానిక రక్షణను నాశనం చేయడం, దాడిని ఎదుర్కోవడం, రెస్క్యూ, యాంటీ-ట్యాంక్, ఉపరితల దళ కార్యకలాపాలకు కౌంటర్ ఇవ్వడం వంటి యుద్ధ నైపుణ్యం సామర్థ్యాలను ప్రదర్శించగలదు.

* పనితీరు ఎలా ఉంటుంది?

లైట్ కంబాట్ హెలికాప్టర్ ట్విన్-ఇంజన్‌తో పని చేస్తుంది. ఇందులో పైలట్, కో-పైలట్ కాన్ఫిగరేషన్ కోసం నారో ఫ్యూజ్‌లేజ్, టాండమ్‌ను ఒకదాని వెనుక ఒకటి అమర్చారు. కోపైలట్ వెపన్ సిస్టమ్స్ ఆపరేటర్ (WSO) కూడా అందించారు. ఐఏఎఫ్, ఆర్మీ క్లియరెన్స్ నుంచి దీన్ని ప్రవేశపెట్టే వరకు టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్స్ అని పిలిచే నాలుగు ప్రోటోటైప్స్‌పై టెస్టులు జరిగాయి. మొదటి టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ ఫిబ్రవరి 2010లో పూర్తయింది. అదే సంవత్సరం మార్చి 29న దాని మొదటి ఫ్లైట్ ప్రారంభించింది. TD-2 ప్రోటోటైప్ 2012లో పూర్తయింది. TD-3, TD-4 ప్రోటోటైప్‌లు, 2014.. 2015లో పూర్తయ్యాయి. తర్వాత అన్ని వాతావరణాల్లో పరీక్షలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు.

ఈ పరీక్షల సమయంలో ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్, హెల్మెట్-మౌంటెడ్ డిస్‌ప్లే సిస్టమ్, సాలిడ్ స్టేట్ డేటా, వీడియో రికార్డర్ వంటి మిషన్ సెన్సార్లు, టరెట్ గన్, రాకెట్లు, ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌ల వంటి ఆయుధ వ్యవస్థలు వాడారు. వెపన్ ఫైరింగ్ ట్రయల్స్ కూడా పూర్తి చేశారు. ఐఏఎఫ్ వేరియంట్‌కు 2017లో, ఆర్మీ వేరియంట్‌కు 2019లో ఇనిషియల్ యాక్టివిటీ క్లియరెన్స్ లభించింది. నవంబర్ 2021లో మోదీ భారత వైమానిక దళానికి లాంఛనప్రాయంగా ఈ హెలికాప్టర్స్‌ అందజేసి, దాని తుది ప్రవేశానికి మార్గం సుగమం చేసారు.

* హెలికాప్టర్ జెనెసిస్

1999 కార్గిల్ యుద్ధం సమయంలోనే భారత యుద్ధభూమి పరిస్థితులన్నింటిలోనూ దాడులు చేయగల స్వదేశీ లైట్ అసాల్ట్ హెలికాప్టర్ అవసరం ఏర్పడింది. అలా ప్రభుత్వం అక్టోబర్ 2006లో LCH ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. దానిని అభివృద్ధి చేసే బాధ్యతను HALకి అప్పగించింది. HAL రోటరీ వింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Airlines, Flight, VIRAL NEWS

ఉత్తమ కథలు