Face Mask: మాస్కులోనే మైక్​, స్పీకర్లు.. అదిరిపోయే ఫీచర్లు.. పూర్తి వివరాలు ఇలా..

ఎల్ జీ ఫేస్ మాస్క్ తో యువతి (Image : LG)

కరోనా కాలంలో మాస్కులు అందరికీ తప్పనిసరి కావడంతో ఎలక్ట్రానిక్ సంస్థలు సరికొత్తగా ఆలోచిస్తున్నాయి. మాస్కులకు అధునాతన ఫీచర్లు తెస్తూ గాడ్జెట్లలా మార్చేస్తున్నాయి. ఫీచర్లను జోడించుకుంటూ పోతున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్​జీ.. బిల్ట్ ​ఇన్ మైక్​, స్పీకర్లతో ఉన్న మాస్కును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.

  • Share this:
కరోనా కాలంలో మాస్కులు అందరికీ తప్పనిసరి కావడంతో ఎలక్ట్రానిక్ సంస్థలు సరికొత్తగా ఆలోచిస్తున్నాయి. మాస్కులకు అధునాతన ఫీచర్లు తెస్తూ గాడ్జెట్లలా మార్చేస్తున్నాయి. ఫీచర్లను జోడించుకుంటూ పోతున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్​జీ.. బిల్ట్ ​ఇన్ మైక్​, స్పీకర్లతో ఉన్న మాస్కును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ముఖానికి మాస్క్ ధరించినా ఎదుటివారితో మాట్లాడేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా డిజైన్ చేసింది. దీంతో పాటు మరిన్ని ఫీచర్లను జోడించింది. వాయిస్ ఆన్ టెక్నాలజీతో తీసుకొచ్చిన ఈ మాస్కు ధరిస్తే మాట్లాడేటప్పుడు తీయాల్సిన అవసరం ఉండదని ఎల్​జీ ప్రకటించింది. మాస్కు ధరించిన వ్యక్తి మాట్లాడినా అవతలి వారికి స్పష్టంగా వినిపిస్తుందని వెల్లడించింది. దీంతో చర్చల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మాస్కులు తీయాల్సి రాదని చెప్పింది. అలాగే మాస్కు బరువు కూడా తక్కువగా ఉండడంతో ఎక్కువ గంటలు ధరించినా విసుగుగా అనిపిందని వెల్లడించింది. “ఎ​ల్​జీ యునీక్ ఎయిల్ సొల్యూషన్ టెక్నాలజీని ఇందులో వాడాం. ఈ ప్యూరికేర్​ మాస్కు ఆల్​రౌండ్ పర్మార్మెన్స్ చేస్తుంది.

చిన్నగా, తేలిగ్గా ఉండే ఈ మాస్కు శక్తివంతమైన మోటార్​తో ఇది పని చేస్తుంది. మాస్కు వినియోగించే వ్యక్తి శ్వాసను బట్టి ఎల్​డీ డ్యుయల్ ఫ్యాన్లు ఎయిర్​ ఫ్లోను ఆటోమేటిక్​గా కంట్రోల్ చేస్తాయి. దీనిద్వారా మాస్కు ధరించినా నేచురల్​ గాలిని ఎంతో సౌకర్యవంతంగా తీసుకోవచ్చు. ప్యూరికేర్ మాస్కులు ఎయిర్ లీకేజీని చాలా వరకు తగ్గిస్తాయి. నోరు, చెంపలను పూర్తిగా కవర్ చేస్తూ టైట్​గా ఉన్నా ఎక్కువ గంటలు వాడినా ఇబ్బంది అనిపించదు” అని ఎల్​జీ ప్రకటించింది. ఎల్​జీ తీసుకొచ్చిన ఈ ప్యూరీకేర్​ మాస్కు 94 గ్రాముల బరువు ఉంది. 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ఈ మాస్కు 8 గంటల బ్యాటరీ లైఫ్​ ఇస్తుంది. అయితే మాస్కులో ఎలాంటి ఫిల్టర్లను ఉపయోగించింది ఎల్​జీ స్పష్టంగా వెల్లడించలేదు. అలాగే ఎప్పుడు లాంచ్​ చేస్తామనేది కచ్చితంగా చెప్పకపోయినా.. ఆగస్టులో థాయ్​లాండ్​లో విడుదల చేయడం ఖాయంగా ఉంది.

ఆ తర్వాత ఆయా దేశాల ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి ఈ మాస్కులను ప్రవేశపెట్టనుంది. అలాగే టోక్యో ఒలింపిక్స్​ పాల్గొంటున్న 120 మంది థాయ్​లాండ్ అథ్లెట్లు, కోచ్​లు, సహాయక సిబ్బంది ఈ ప్యూరికేర్ మాస్కులను ధరించనున్నారని ఎల్​జీ ప్రకటించింది. గతేడాది జూలైలోనే ఎయిర్ ప్యూరిఫయర్​తో మాస్కును లాంచ్ చేసింది ఎల్​జీ. మూడు స్పీడ్​ మోడ్లతో రెండు ఫ్యాన్లతో దాన్ని తీసుకొచ్చింది. గాలి పీల్చుకునే సమయంలో ఆ ఫ్యాన్లు స్పీడ్​గా.. గాలి వదిలే సమయంలో స్లోగా తిరిగి శ్వాసకు అనుకూలంగా ఉండేలా తయారు చేసింది. ఇప్పుడు ఏకంగా బిల్ట్​ ఇన్ మైక్​, స్పీకర్లతో కొత్త తరహా మాస్కును ప్రవేశపెట్టింది.
Published by:Veera Babu
First published: