• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • LG NEW BUDGET SMARTPHONE K42 BOASTS OF A UNIQUE NEW DESIGN AND HERE ITS SPECIFICATIONS SSR

LG: ఎల్‌జీ నుంచి వచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను చూశారా... ధర ఎంత టెంప్టింగ్‌గా ఉందంటే...

LG: ఎల్‌జీ నుంచి వచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను చూశారా... ధర ఎంత టెంప్టింగ్‌గా ఉందంటే...

ఎల్‌జీ కే42

  • Share this:
    దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్‌జీ సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కే42 పేరుతో ఎల్‌జీ విడుదల చేసిన ఈ బడ్జెట్ ఫోన్ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. సరికొత్త డిజైన్‌తో చూపుతిప్పుకోలేని లుక్‌తో ఎల్‌జీ తీసుకొచ్చిన కే42 గురించి ఒక్కమాటలో చెప్పాలంటే బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలని చూస్తున్న వారికి మంచి ఎంపికనే చెప్పొచ్చు. ఈ ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే.. ఎల్‌జీ కె42 6.6 అంగుళాల స్క్రీన్‌తో హెచ్‌డీ+ డిస్‌ప్లేతో రూపొందింది.

    ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో డిస్‌ప్లేను ఎల్‌జీ ఈ ఫోన్‌లో అందుబాటులోకి తెచ్చింది. బ్రైట్‌నెస్‌పరంగా కూడా ఫోన్ బాగుంది. సన్‌లైట్‌లో ఇతర ఫోన్లతో పోల్చుకుంటే ఎల్‌జీ కె42 కచ్చితంగా మెరుగ్గానే ఉంది. ఇక.. ఫోన్ పర్ఫామెన్స్‌ను గమనిస్తే.. రోజువారీ వినియోగానికి ఈ ఎల్‌జీ కే42 బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. కానీ.. హెవీ గేమ్స్ ఆడాలనుకునేవారికి మాత్రం ఈ ఫోన్ అంత మెరుగైన పనితీరును కనబర్చకపోవచ్చు. అయితే.. టెంపుల్ రన్, సబ్‌వే సర్ఫర్స్ లాంటి గేమ్స్ ఆడుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేయొచ్చు.

    మీడియాటెక్ హీలియో పి22 చిప్‌తో ఈ ఫోన్ రూపొందింది. అయితే.. ఈ ఫోన్ ధరలో ఇతర కంపెనీల ఫోన్లు ఇంతకంటే మెరుగైన చిప్‌సెట్‌తో వస్తున్నాయి. ఈ చిప్‌సెట్ కొంత నిరాశాజనకంగా ఉందని చెప్పక తప్పదు. ఇక.. ర్యామ్ విషయానికొస్తే.. పదివేల కంటే ఎక్కువ ధరలో 4జీబీ ర్యామ్‌తో ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎల్‌జీ కే42 ధర 10,990 రూపాయలు అయినప్పటికీ 3జీబీ ర్యామ్‌తో మాత్రమే ఈ మోడల్ రావడం గమనార్హం. ఆండ్రాయిడ్ 10తో ఎల్‌జీ కే42 అందుబాటులో ఉంది. మామూలుగా ఫోన్ వాడుకునే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. హెవీ యూసేజ్ అయితే మాత్రం కొంత హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

    ఇక.. ఫోన్ కాల్ క్వాలిటీ, సౌండ్ అవుట్‌పుట్ మాత్రం అద్భుతంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఫేస్ అన్‌లాక్ లేదు. అయినప్పటికీ పవర్ బటన్‌లో అమర్చిన ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఎంతో వేగంగా పనిచేస్తుండటం విశేషం. కెమెరా విషయానికొస్తే.. 10990 రూపాయల్లో మరీ ఎక్కువ క్వాలిటీ‌తో కూడిన ఫొటోలను ఆశించడం అత్యాశే అవుతుంది. ఎల్‌జీ కె42 కెమెరాపరంగా పర్లేదనింపించింది. ఫ్రంట్ కెమెరా అంత గొప్పగా లేదనే చెప్పాలి. ఇక.. బ్యాటరీ విషయానికొస్తే... ఈ విషయంలో ఎల్‌జీ కే42 విషయంలో వంక పెట్టాల్సిన అవసరమే లేదు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ మెరుగైన పనితీరునే కనబరుస్తోంది. లో-ఎండ్ ప్రాసెసర్ కావడంతో బ్యాటరీ లైఫ్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదు.
    Published by:Sambasiva Reddy
    First published: