ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది ఎల్జీ ఇండియా. ఎల్జీ కే42 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు Mil-Std 810G డ్యూరబిలిటీ టెస్ట్ పాస్ కావడంతో పాటు, హై టెంపరేచర్, లో టెంపరేచర్, టెంపరేచర్ షాక్, వైబ్రేషన్, షాక్ లాంటి 9 కేటగిరీల్లో యూఎస్ మిలిటరీ స్టాండర్డ్ టెస్ట్‌ల ద్వారా ధృవీకరించబడిందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ ధర రూ.10,990. రెండేళ్ల వారెంటీ, వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఉచితంగా లభిస్తుంది. వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ లభిస్తుంది. ఎల్జీ కే42 స్మార్ట్‌ఫోన్ సేల్ జనవరి 26న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అవుతుంది. ఇక ఎల్జీ కే42 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు చూస్తే 6.6 అంగుళాల డిస్ప్లే, క్వాడ్ కెమెరా సెటప్, 3డీ సౌండ్ ఇంజిన్, ఏఐ టెక్నాలజీ, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.
Jio New Plans: రిలయెన్స్ జియోలో పాపులర్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
Prepaid Plans: రూ.250 లోపు రీఛార్జ్ చేయాలా? Jio, Airtel, Vi, BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే...
ఎల్జీ కే42 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.6 అంగుళాల హెచ్డీ+
ర్యామ్: 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్రీన్, గ్రే
ధర: రూ.10,990
WhatsApp: ఈ రెండు సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ సేఫ్... ఇలా మార్చేయండి
Flipkart: స్మార్ట్‌ఫోన్ ఏడాది వాడిన తర్వాత 100 శాతం మనీబ్యాక్... ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన ఆఫర్
మార్కెట్లో రూ.12,000 లోపు బడ్జెట్లో అనేక స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. షావోమీ, రియల్మీ, సాంసంగ్, ఒప్పో లాంటి బ్రాండ్స్ నుంచి స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. రెడ్మీ నోట్ 9, రెడ్మీ నోట్ 9 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎం21, పోకో ఎం2 ప్రో, మోటో జీ9, మోటో జీ9 పవర్, ఒప్పో ఏ33, ఒప్పో ఏ15 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది ఎల్జీ కే42.