HOME »NEWS »TECHNOLOGY »lg has launched three new smartphones in india the w41 w41 plus and the w41 pro here full details ns gh

LG W41 Series: ఎల్జీ నుంచి భారత మార్కెట్లోకి మూడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్ల వివరాలివే..

LG W41 Series: ఎల్జీ నుంచి భారత మార్కెట్లోకి మూడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్ల వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్ జీ ఒకేసారి మూడు సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లను భారత్లో ఆవిష్కరించింది. W41, W41 +, W41 ప్రో పేర్లతో ఈ స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి.

  • Share this:
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్ జీ ఒకేసారి మూడు సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లను భారత్లో ఆవిష్కరించింది. W41, W41 +, W41 ప్రో పేర్లతో ఈ స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు మినహా మిగతా ఫీచర్లన్నీ ఈ మూడింట్లో ఒకే విధంగా ఉంటాయి. ఎల్ జీ నుంచి గత ఏడాది భారత్ లో విడుదలైన డబ్ల్యూ 31 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు కొన్ని మెరుగైన ఫీచర్లను చేర్చి ఈ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్త W41 స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్-ఎండ్ కస్టమర్లు, మిడ్ రేంజ్ ఫోన్లను అందిస్తున్న వివిధ బ్రాండ్లను లక్ష్యంగా చేసుకొని లాంఛ్ చేసింది ఎల్ జీ సంస్థ. ఈ సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్‌లు పాలికార్బోనేట్ మెటీరియల్‌తో తయారయ్యాయి. ఈ డిజైన్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ప్రీమియంగా కనిపించేలా చేస్తుంది. ఈ ఫోన్లు నోకియా ఫోన్ల మాదిరిగానే గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ తో వస్తాయి. ఈ మూడు స్మార్ట్ ఫోన్లు కూడా 48 ఎంపి క్వాడ్ కెమెరా, పెద్ద బ్యాటరీ, పంచ్ హోల్ డిస్ప్లే, మరిన్ని ప్రత్యేకతలతో పాటుగా ఆకట్టుకునే డిజైన్ తో లాంఛ్ చేయబడ్డాయి.

భారత మార్కెట్లో ఎల్ జీ డబ్ల్యూ 41 సిరీస్ ధర రూ .13,490 నుండి ప్రారంభమవుతుంది. ఇవి మ్యాజిక్ బ్లూ, లేజర్ బ్లూ కలర్స్ తో అందుబాటులో ఉంటాయి. అన్ని ప్రముఖ స్టోర్లలో ఈ మూడు ఫోన్లు లభిస్తాయి. అయితే, దీని అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై ఎల్ జీ స్పష్టతనివ్వలేదు. వీటిలో అందిస్తున్న స్పెసిఫికేషన్లను పరిశీలిద్దాం.



LG W41 సిరీస్ ధర, స్పెసిఫికేషన్స్..
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఎల్ జీ W41 సిరీస్ లోని మూడు ఫోన్లలో RAM, స్టోరేజ్ స్పేస్ భిన్నంగా ఉంటాయి. W41 వేరియంట్ 4GB RAM, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. W41+ వేరియంట్ 4GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. W41ప్రో 6GB RAM, 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డుతో 512GB వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. LG W41 సిరీస్ స్మార్ట్ ఫోన్లు 20:9 ఎస్పెక్ట్ రేషియోతో పొడవైన 6.55 అంగుళాల ఫుల్ విజన్ డిస్ప్లేని కలిగి ఉంటాయి. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది. ఈ పంచ్ హోల్లో కెమెరా ఉంటుంది. ఈ మూడు ఫోన్లు మీడియా టెక్ హీలియో జీ35 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తాయి. ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా ఇవ్వబడింది.

ఇందులో, 48 ఎంపి మైన్ కెమెరా, 8 ఎంపి అల్ట్రా వైడ్, 2 ఎంపి డెప్త్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో సెన్సార్ వంటివి ఉన్నాయి. దీని ముందుభాగంలో ఉన్న పంచ్ హోల్లో 8 ఎంపి సెల్ఫీ కెమెరాని అందించారు. వీటిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్ బీ టైప్ సీ పోర్టును అందించారు. అంతేకాక, లాక్ సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్ లాక్ వంటి ఫీచర్లను చేర్చారు. ఈ మూడు ఫోన్లు 9.3 మిమీ మందం, 201 గ్రా బరువు ఉంటాయి. కాగా, గత సంవత్సరం నుంచి ఆండ్రాయిడ్ 11 ఫోన్‌లు మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. అయితే, ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 10 ను మాత్రమే అందించడం ఎల్ జీ ఫోన్ ప్రియులను కాస్త నిరాశపరిచింది.
Published by:Nikhil Kumar S
First published:February 23, 2021, 13:36 IST