Home /News /technology /

LG HAS LAUNCHED A SMART TV WITH EYE CATCHING FEATURES DO YOU KNOW THE PRICE UMG GH

LG Signature OLED R: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో ఎల్‌జీ స్మార్ట్ టీవీ లాంచ్.. ధర ఎంతో తెలుసా..?

 కళ్ళు చెదిరే ఫీచర్స్ తో స్మార్ట్ టీవీ లాంఛ్ చేసిన ఎల్ జీ .. ధర ఎంతో తెలుసా !

కళ్ళు చెదిరే ఫీచర్స్ తో స్మార్ట్ టీవీ లాంఛ్ చేసిన ఎల్ జీ .. ధర ఎంతో తెలుసా !

ఎల్‌జీ(LG) ఇటీవల ఇండియన్‌ మార్కెట్‌లోకి ‘LG Signature OLED R’ పేరుతో రోలబుల్ టీవీ లాంచ్‌ చేసింది. ఇప్పుడు ఇది న్యూఢిల్లీలోని రిలయన్స్ డిజిటల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో లభ్యమవుతుందని ప్రకటించింది.

ఎల్‌జీ(LG) కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్‌(Features)లతో టీవీలను లాంచ్‌ చేస్తోంది. స్మార్ట్‌ టీవీ(Smart Tv)ల విభాగంలో టెక్నాలజీని వినియోగిస్తూ కొత్త ప్రొడక్ట్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా అత్యధిక ధరలో రోలబుల్ OLED టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్‌జీ(LG) ఇటీవల ఇండియన్‌ మార్కెట్‌లోకి ‘LG Signature OLED R’ పేరుతో రోలబుల్ టీవీ లాంచ్‌ చేసింది. ఇప్పుడు ఇది న్యూఢిల్లీలోని రిలయన్స్ డిజిటల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో లభ్యమవుతుందని ప్రకటించింది. ఎల్‌జీ సిగ్నేచర్ OLED R ప్రత్యేకంగా ఢిల్లీలోని సౌత్ ఎక్స్-IIలోని ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

హై-ఎండ్ ఎల్‌జీ రోలబుల్ OLED TV ధర భారతదేశంలో అత్యధికంగా రూ.75 లక్షలుగా ఉంది. ఈ టీవీ ఫీచర్ల పరంగా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఎల్‌జీ రోలబుల్ OLED TV LGలో OLED లైనప్‌లో ఉన్న టీవీల తరహా బెస్ట్‌ పిక్చర్‌ క్వాలిటీ కూడా రాదు. దీని పనితీరు 2020 నుంచి ఎల్‌జీ నుంచి వస్తున్న హై-ఎండ్ OLEDల లైనప్ మాదిరిగానే ఉంటుంది. అయినా, దీని ధర ఎక్కువగా ఉండటానికి కారణం అందులో ఉపయోగించిన రోలబుల్‌ టెక్నాలజీ.

ఇదీ చదవండి: Grand Vitara: త్వరలో మారుతి సుజుకి మైండ్ బ్లోయింగ్ కారు లాంచ్.. లీక్ అయిన ధరల వివరాలివే..!



50 వేల రోల్స్‌
రోలబుల్ టీవీ HDMI 2.1, 4K రిజల్యూషన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ వంటి HDR ఫీచర్‌లను సపోర్ట్‌ చేస్తుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్, Amazon Alexa/Google Assistant సపోర్ట్ ఉంది. డాల్బీ అట్మోస్‌ ఆడియో వంటి హై-ఎండ్ ఫీచర్‌లతో వస్తుంది. ఈ డివైజ్ లైఫ్‌టైమ్‌లో కనీసం 50,000 రోల్స్‌ను సర్వైవ్‌ అవుతుందని ఎల్‌జీ కంపెనీ తెలిపింది.



గేమ్స్‌ కోసం స్పెషల్‌ ఫీచర్లు
ఈ హై ఎండ్ టీవీ ఆల్ఫా 9 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్‌ అవుతుంది. టీవీ స్క్రీన్‌పై గేమ్స్‌(Games) ఆడటానికి ఇష్టపడేవారి కోసం కొత్త గేమ్ ఆప్టిమైజర్ మెనూ అందిస్తోంది. గేమింగ్ ఫీచర్‌లు, ప్రీసెట్‌లను త్వరగా ఎంచుకోవచ్చు లేదా వాటి మధ్య స్విచ్‌ అవ్వచ్చు. వివిధ గేమ్ జోనర్స్ కోసం ఎల్‌జీ డిస్‌ప్లే ప్రీసెట్‌లు స్పోర్ట్స్ మోడ్‌ను అందిస్తాయి. ఫస్ట్-పర్సన్ షూటర్, రోల్-ప్లేయింగ్, రియల్ టైమ్ స్ట్రాటజీ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎల్‌జీ టీవీలలో డార్క్ రూమ్ మోడ్‌ కూడా ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేసినప్పుడు, ఇది గేమ్‌ల హైలైట్‌లు, పిక్చర్‌ క్వాలిటీ అందిస్తూ బ్రైట్నెస్‌ అడ్జస్ట్ చేస్తుంది. ఎల్‌జీ కంపెనీ టీవీ సిరీస్‌లో సొంత WebOS ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం కొనసాగిస్తోంది. ఇది పెద్ద స్క్రీన్‌పై విభిన్న యాప్‌ల కోసం యాప్ స్టోర్‌ను అందిస్తోంది.
Published by:Mahesh
First published:

Tags: Dolby, LG, Smart TV, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు