LG Phones: స్మార్ట్​ఫోన్ మార్కెట్​ నుంచి తప్పుకున్న ఎల్​జీ.. సంస్థ నుంచి వచ్చిన​ బెస్ట్ స్మార్ట్​ఫోన్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ఎలక్ట్రానిక్స్​ దిగ్గజం ఎల్​జీ మొబైల్​ ఫోన్​ వ్యాపారాన్ని శాశ్వతంగా మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో భవిష్యత్తులో ఎల్​జీ నుంచి ఎలాంటి స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సంస్థ నుంచి విడులైన బెస్ట్ మోడల్స్ వివరాలు ఇవే..

  • Share this:
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్​ దిగ్గజం ఎల్​జీ సంచలన నిర్ణయం తీసుకుంది. మొబైల్​ ఫోన్​ వ్యాపారాన్ని శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇతర కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీ, భారీ నష్టాల కారణంగా స్మార్ట్​ఫోన్ల తయారీ వ్యాపారానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటని విడుదల చేసింది. దీంతో భవిష్యత్తులో ఎల్​జీ నుండి ఎటువంటి స్మార్ట్​ఫోన్లు విడుదల కావు. ఈ సందర్భంగా ఈ సంస్థ విడుదల చేసిన బెస్ట్ మోడల్స్ గురించి చూద్దాం..

Google Nexus 5: 
భారత​ మార్కెట్​లో నెక్సస్ 5కు ఉన్న క్రేజ్​ గురించి తెలిసిందే. గూగుల్ అవుట్​సోర్స్​ సపోర్ట్​..​ ఎల్‌జీని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో అగ్రస్థానంలో నిలిపింది. అయితే, దీనిలో కెమెరా క్వాలిటీ కాస్త తక్కువగా ఉండటం మాత్రం ఎల్​జీ ప్రియులను నిరాశపర్చింది. ఇది మినహా మిగతా అన్ని ఫీచర్లను ప్రీమియం రేంజ్​లో అందించింది.

LG G3:
ఆధునిక ఎల్​జీ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లకు దిక్సూచిగా నిలిచింది జి 3 మోడల్. దీనిలోని పేటెంట్ పవర్ యూజర్ ఆప్షన్లు, QHD డిస్​ప్లే, అద్భుతమైన కెమెరా సిస్టమ్ వంటివి జీ3ని ప్రీమియం స్మార్ట్​ఫోన్ల జాబితాలో చేర్చాయి. దీనిలో రిమూవెబుల్​ బ్యాటరీ, ఎక్స్​పాండెబుల్​ స్టోరేజ్​లను కూడా అందించింది. వైర్‌లెస్ ఛార్జింగ్‌ టెక్నాలజీని అందిస్తున్న అతి తక్కువ ఫోన్‌లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.

LG V30:
ఎల్​జీ నుంచి వచ్చిన G3 స్మార్ట్​ఫోన్​ ఫ్లాగ్‌షిప్‌ అనుభవాన్ని అందిస్తే, V30 స్మార్ట్​ఫోన్​ మాత్రం ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. మంచి ఆడియో, వీడియో సామర్థ్యాలను కోరుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్​. దీని డిజైన్​, లుక్స్​ కూడా ప్రీమియం స్మార్ట్​ఫోన్​ లాగే ఉంటాయి.

Pixel 2 XL:
ఎల్​జీ సంస్థకు గూగుల్ అవుట్​సోర్స్​ సపోర్ట్​ వరం లాంటిది. ఈ కారణంగా ఎల్​జీ నుంచి అద్భుతమైన పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ వంటి స్మార్ట్​ఫోన్​​ సాధ్యమైంది. దీనిలోని ప్రీమియం డిజైన్, క్వాలిటీ డిస్​ప్లే, బెస్ట్​ కెమెరా, టూ టోన్​ కలర్ స్కీమ్ వంటివి పిక్సెల్​ 2 ఎక్స్​ఎల్​ను బెస్ట్​ స్మార్ట్​ఫోన్​గా నిలబెట్టాయి​.

LG Wing:
ఎల్​జీ నుంచి డ్యూయల్ స్క్రీన్ వేరియంట్​లో విడుదలైన ఫోన్​ ఎల్​జీ వింగ్​. ఈ ఫోన్​ ప్రత్యేకమైన“టి” ఆకారపు డిజైన్ కలిగి ఉంటుంది. ఇది సూపర్ ప్రీమియం స్మార్ట్​ఫోన్​గా నిలిచింది. దీనిలో బెస్ట్​ సాఫ్ట్‌వేర్ UI, శక్తివంతమైన హార్డ్‌వేర్​ను అందించింది.

LG V60 ThinQ:
V60 థింక్యూ ప్రీమియం ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్​ఫోన్. ఇది ఇతర ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్​ఫోన్ల కంటే మెరుగైన ఫీచర్లను అందించారు. దీనిలో బెస్ట్​ బ్యాటరీ లైఫ్​, స్నాప్‌డ్రాగన్ 865 SoC ప్రాసెసర్​ని చేర్చింది. దీనిలో డ్యూయల్ స్క్రీన్ కోసం ఒక బండిల్ ప్రొటెక్టర్ కేసును కూడా అందించారు. అంతేకాక, ఇది గొప్ప క్వాడ్-డిఎసి హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్లన్నీ ఎల్​జీ V60 ThinQ మోడల్​ను ఆండ్రాయిడ్​ విభాగంలో బెస్ట్​ స్మార్ట్​ఫోన్​గా నిలిపాయి.
Published by:Nikhil Kumar S
First published: