హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు

Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు

Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు

Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు

Flipkart big billion days 2020 | బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఊహించని ఆఫర్స్ ప్రకటిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఏకంగా రూ.70,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,000 ధరకే అమ్మనుంది.

  కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ భారీ ఆఫర్లను మోసుకొచ్చింది. ఏడాదిలోనే అతిపెద్ద సేల్‌గా బిగ్ బిలియన్ డేస్ సేల్ గురించి చెప్తూ ఉంటుంది ఫ్లిప్‌కార్ట్. ఆఫర్స్ కూడా అలానే ప్రకటించింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇలాంటి ఆఫర్ మళ్లీ రాకపోవచ్చు అన్నట్టుగా కొన్న అద్భుతమైన డీల్స్ ప్రకటించింది. సాధారణంగా సేల్‌లో ఓ ఫోన్ ధర ఎంత తగ్గొచ్చు. మహా అయితే 10 శాతం లేదా 20 శాతం. కానీ ఓ స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. రూ.70,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.19,990 ధరకే ప్రకటించింది. అంటే 71 శాతం డిస్కౌంట్ అన్నమాట. ఏకంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.50,000 డిస్కౌంట్ ప్రకటించడం విశేషం. ఎల్‌జీ గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ చేసిన డ్యూయెల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఎల్‌జీ జీ8ఎక్స్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమయ్యే అక్టోబర్ 16 నుంచి ఎల్‌జీ జీ8ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనొచ్చు. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు ఉంటుందో చెప్పలేం. భారీ డిస్కౌంట్ కాబట్టి యూనిట్స్ త్వరగా సేల్ అయ్యే అవకాశం కూడా ఉంది.

  Smartphones: మేడ్ ఇన్ చైనా ఫోన్లు వద్దా? నాన్ చైనీస్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... ధర రూ.10,000 లోపే

  September Smartphones: సెప్టెంబర్‌లో రిలీజైన బెస్ట్ 12 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  Flipkart big billion days 2020 offers, flipkart big billion days 2020 sbi offer, LG G8X Features, LG G8X Specs, LG G8X Specifications, LG G8X India price, LG G8X Sale, Smartphone under 20k, Smartphone under 20000, ఎల్‌జీ జీ8ఎక్స్ ధర, ఎల్‌జీ జీ8ఎక్స్ స్పెసిఫికేషన్స్, ఎల్‌జీ జీ8ఎక్స్ ఫీచర్స్
  image: Flipkart

  ఇక ఎల్‌జీ జీ8ఎక్స్ విశేషాలు చూస్తే డ్యూయెల్ స్క్రీన్స్‌తో రిలీజ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో రెండు స్క్రీన్స్ ఉంటాయి. రెండో స్క్రీన్‌ను తొలగించొచ్చు. స్క్రీన్ ఎటాచ్ చేస్తే మినీ ల్యాప్‌టాప్ లాగా ఉంటుంది. ఈ రెండు స్క్రీన్స్ ద్వారా ఓవైపు వీడియో చూస్తూ మరోవైపు ఛాటింగ్ చేయొచ్చు. గేమ్స్ ఆడొచ్చు. మొదట్లో ఈ ఫోన్ రిలీజ్ అయినప్పుడు ధర చాలా ఎక్కువ అనుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.54,990. అయినా ధర చాలా ఎక్కువ అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మాత్రం రూ.19,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఉన్న సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్, రియల్‌మీ 7 ప్రో లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ తప్పదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో షావోమీ, రియల్‌మీ, సాంసంగ్, ఒప్పో, వివో లాంటి కంపెనీలు కూడా వేర్వేరు మోడల్స్‌పై భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.

  Flipkart Big Billion Days Sale: అక్టోబర్ 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్... ఆఫర్స్ ఇవే

  Android Apps: అలర్ట్... ఈ 34 యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్... వెంటనే డిలిట్ చేయండి


  ఎల్‌జీ జీ8ఎక్స్ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ విజన్ స్క్రీన్

  ర్యామ్: 6జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ

  ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855

  రియర్ కెమెరా: 12+13 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 4000ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్:

  సిమ్ సపోర్ట్: హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్

  కలర్స్: న్యూ అరోరా బ్లాక్

  ధర: ప్రస్తుతం రూ.54,990 (ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.19,990)

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Flipkart, Flipkart Big Billion Days, LG, Smartphone

  ఉత్తమ కథలు