ఎల్జీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

ఎల్జీ నుంచి 'క్యాండీ' పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ధర రూ.6,699.

news18-telugu
Updated: September 4, 2018, 6:21 PM IST
ఎల్జీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
ఎల్జీ నుంచి 'క్యాండీ' పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ధర రూ.6,699.
  • Share this:
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ ఎక్కువ. అందుకే పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు కొనేవారినే టార్గెట్ చేస్తుంటాయి. ఈ విషయంలో సాంసంగ్‌తో పాటు షావోమీ మంచి మార్కెట్‌నే ఏర్పర్చుకున్నాయి. ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి సరికొత్త ఫోన్‌తో దూసుకొచ్చింది ఎల్‌జీ. 'క్యాండీ' పేరుతో ఈ ఫోన్ గురువారం రిలీజైంది. 'ఎల్‌జీ క్యాండీ' వినియోగదారుల అవసరాలకు సరిగ్గా సరిపోయే డివైజ్ అని ఎల్‌జీ మొబైల్స్ బిజినెస్ హెడ్ అద్వైత్ వైద్య ఓ ప్రకటనలో చెప్పారు. ఈ ఫోన్ సెప్టెంబర్ 1న మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

ఎల్‌జీ క్యాండీ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 5 అంగుళాల హెచ్‍‌డీ డిస్‌ప్లే
ర్యామ్: 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ
ప్రాసెసర్: క్వాడ్‌కోర్ ప్రాసెసర్
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 2,500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్
కలర్స్: బ్లూ, సిల్వర్, గోల్డ్
ధర: రూ.6,699

ఇవి కూడా చదవండి:

సెప్టెంబర్ 5న షావోమీ 6 సిరీస్ ఫోన్ల లాంఛింగ్

సెప్టెంబర్ 6న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఆండ్రాయిడ్‌ గోతో సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్!

5 నిమిషాలు... రూ.200 కోట్లు... పోకోఫోన్ సేల్స్ రికార్డ్

లోన్ కావాలా..? గూగుల్‌ని అడగండి!

#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.news18.com/technology/
Published by: Santhosh Kumar S
First published: August 30, 2018, 4:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading