LG Smart TV: సరికొత్త టెక్నాలజీతో 2021 స్మార్ట్ టీవీలను ప్రకటించిన ఎల్‌జీ

LG Smart TV: సరికొత్త టెక్నాలజీతో 2021 స్మార్ట్ టీవీలను ప్రకటించిన ఎల్‌జీ (image: LG India)

LG Smart TV | ఎల్‌జీ నుంచి కొత్త స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. 43 అంగుళాల నుంచి 88 అంగుళాల వరకు ఈ టీవీలు ఉన్నాయి. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

  • Share this:
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్‌జీ సంస్థ... 2021లో విడుదల కానున్న స్మార్ట్ టీవీల గ్లోబల్ రోల్అవుట్‌ని ప్రకటించింది. ఈ సరికొత్త లైనప్‌లో OLED, QNED, మినీ LED, నానోసెల్ మోడళ్లతో సహా అద్భుతమైన ఉత్పత్తులు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలన్నీ 43 అంగుళాల నుండి 88 అంగుళాల మధ్య లభించనున్నాయి. 2021లో ఎల్‌జీ నుంచి విడుదల కానున్న Z1, G1, C1, B1, A1 సిరీస్‌లో OLED TV టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు పేర్కొంది. G1 సిరీస్‌లోని అన్ని మోడళ్లు కొత్త OLED ఈవో టెక్నాలజీతో రూపొందించబడతాయి. ఇవి అధిక ప్రకాశవంతమైన స్క్రీన్ రిజల్యూషన్ తో అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

ఇక C1 సిరీస్ మోడళ్లు 48 -అంగుళాల నుండి 83 -అంగుళాల స్క్రీన్ సైజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. OLED టెక్నాలజీతో ఇప్పటికే B1, A1 సిరీస్‌లను ప్రారంభించింది ఎల్ జీ సంస్థ. ఇక, LCD టీవి టెక్నాలజీని ఉపయోగించే కొత్త QNED Mini LED TVలను కూడా ఇదివరకే ప్రవేశపెట్టింది. ఇవన్నీ 8K (QNED99, QNED95), 4K (QNED90, QNED85), 4K మోడళ్లలో లభిస్తాయి.

WhatsApp New Features: యూజర్లకు అలర్ట్... వాట్సప్‌లో రాబోయే కొత్త ఫీచర్స్ ఇవే

Redmi Note 10: రిలీజ్‌కు ముందే తెలిసిపోయిన రెడ్‌మీ నోట్ 10 ఫీచర్స్

ఈ LED స్మార్ట్ టీవీల రూపకల్పనలో క్వాంటం డాట్ నానోసెల్ టెక్నాలజీ, మినీ LED బ్యాక్‌ లైటింగ్‌ టెక్నాలజీలను ఉపయోగించినట్టు ఎల్ జీ స్పష్టం చేసింది. అదేవిధంగా, ఎల్‌జీ 2021 టీవి లైనప్‌లో వచ్చే కొత్త నానోసెల్ టీవీలు 8 కె, 4 కె రెండు మోడళ్లలోనూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ టీవీలు 8 కె (నానో 99, నానో 95), 4 కె (నానో 90, నానో 85, నానో 80, నానో 77, నానో 75) మోడళ్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పై అన్ని మోడళ్లలో నానోసెల్ డిస్ ప్లే టెక్నాలజీని అందించింది. కలర్ ఇంప్యూరిటీలను ఫిల్టర్ చేయడానికి నానోపార్టికల్స్‌ను కూడా దీనిలో ఉపయోగించింది. 2021 లైనప్ లో వచ్చే ఎల్‌జీ టీవీలు డాల్బీ విజన్ ఐక్యూ, డాల్బీ అట్మోస్, హెచ్‌డిఆర్ 10 ప్రో, ఫిల్మ్‌మేకర్ మోడ్‌కు మద్దతు ఇస్తాయని ఎల్ జీ సంస్థ పేర్కొంది.

WhatsApp Groups: వాట్సప్ గ్రూప్స్‌లో మిమ్మల్ని ఎవరూ యాడ్ చేయకుండా ఈ సెట్టింగ్స్ మార్చండి

Prepaid Plans: రూ.300 లోపు Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్


గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా వీటిలో నూతన గేమ్ ఆప్టిమైజర్‌ను అందించింది. ఈ గేమ్ ఆప్టిమైజర్... వినియోగదారుడు ఆడుతున్న గేమ్ టైప్ ని బట్టి ఆటోమేటిక్ సెట్టింగ్స్ అనగా ఫస్ట్-పర్సన్ షూటర్, రోల్ ప్లేయింగ్ లేదా రియల్ టైమ్ స్ట్రాటజీ వంటి సెట్టింగులను నిర్వహిస్తుంది. తద్వారా వినియోగదారుడు బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. 2021 LG TV లైనప్‌లోని ప్రతి మోడల్ HDMI 2.1 ఫీచర్, మెరుగైన ఆడియో రిటర్న్ ఛానల్ (eARC) కు సపోర్ట్ తో వస్తుంది. అంతేకాక, ఈ టీవీలు ఆటోమేటిక్ లో లేటెన్సీ మోడ్ (ALLM) సపోర్ట్ తో అందుబాటులో ఉంటాయి. 2021 లైనప్ లో వచ్చే ఎల్ జీ సిరీస్ మోడల్స్ అన్నీ ఏడాది పొడవునా రోలవుట్ అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఇవి మొదటి త్రైమాసికంలో పాల్గొనే రిటైలర్లకు ప్రాథమికంగా అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Published by:Santhosh Kumar S
First published: