హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

65 Inch Smart TV: రూ.28 వేలకే 65 ఇంచుల 4కే స్మార్ట్‌టీవీ!

65 Inch Smart TV: రూ.28 వేలకే 65 ఇంచుల 4కే స్మార్ట్‌టీవీ!

65 Inch Smart TV: రూ.28 వేలకే 65 ఇంచుల 4కే స్మార్ట్‌టీవీ!

65 Inch Smart TV: రూ.28 వేలకే 65 ఇంచుల 4కే స్మార్ట్‌టీవీ!

Smart TV | మీరు కొత్త టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కొంత కాలం ఆగండి. ఎందుకంటే తక్కువ ధరలోనే 65 అంగుళాల స్మార్ట్ టీవీ ఒకటి అందుబాటులోకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

65 Inch TV | మీరు కొత్తగా టీవీ (TV) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే ప్రస్తుతం తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు (Smart TV) అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ టీవీలపై అదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్‌లోకి ఇంకా కొత్త కొత్త టీవీలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన టెక్ కంపెనీ లీటీవీ కూడా అదిరే స్మార్ట్ టీవీని చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది.

గత నెలలో 55 అంగుళాల స్మార్ట్ టీవీని ఆవిష్కరించిన కంపెనీ ఇప్పుడు 65 అంగుళాల స్మార్ట్ టీవీని మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది 4కే టీవీ. దీని ధర 2499 యువాన్లు. అంటే 348 డాలర్లు అని చెప్పుకోవచ్చు. మన కరెన్సీలో చెప్పుకుంటే ఈ 65 అంగుళాల స్మార్ట్ టీవీ ధర దాదాపు రూ. 28,500గా ఉండొచ్చు. ఇది తక్కువ రేటు అని చెప్పుకోవచ్చు.

వావ్.. కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లు.. ఏకంగా రూ.57 వేల తగ్గింపు!

ఈ స్మార్ట్ టీవీలో మెటల్ బాడీ ఫీచర్ ఉంది. స్క్రీన్ రేషియో 97.3 శాతం. 4కే రెజల్యూషన్. లీటీవీ సూపర్ టీవీ జీ65ఈఎస్‌లో క్వార్ కోడ్ ప్రాసెసర్ ఉంటుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంటే టీవీ స్మూత్‌గా పని చేస్తుంది. నచ్చిన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

వారెవ్వా.. ఇలా చేస్తే రూ.15 వేల ఫోన్‌ను రూ.599కే కొనొచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌ దిమ్మతిరిగే ఆఫర్లు!

అంతేకాకుండా ఈ పెద్ద స్మార్ట్ టీవీలో బిల్ట్ ఇన్ ఇండిపెండెంట్ వాయిస్ చిప్ కూడా ఉంటుంది. 5 మీటర్ల దూరం నుంచి కూడా ఈ టీవీని వాయిస్‌తో ఆపరేట్ చేయొచ్చు. ప్రత్యేకమైన వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ఈ టీవీలో 10 వాట్ స్పీకర్లు ఉటాయి. వైఫై సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ యాంటీ బ్లూ లైట్ టెక్నాలజీతో ఈ టీవీ మార్కెట్‌లోకి వస్తోంది. ఇంకా ఈ టీవీలో యూఎస్‌బీ 2.0, యూఎస్‌బీ 3,0, రెండు హెచ్‌డీఎంఐ పోర్ట్స్, ఏవీ ఇన్‌పుట్ ఇంటర్‌ఫేస్, ఆడియో ఔట్‌పుట్ ఇంటర్‌ఫేస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీలు చైనాలో అందుబాటులో ఉన్నాయి. మన మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తాయో తెలీదు. అంటే ప్రస్తుతం తక్కువ ధరకే 65 టీవీలు కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయి. అందువల్ల కొత్త టీవీ కొనుగోలు చేయాలని భావించే వారు కొంత కాలం ఆగడం ఉత్తమం. అందుబాటు ధరలోనే కొత్త స్మార్ట్ టీవీలు అందుబాటులోకి రావొచ్చు.

First published:

Tags: Android TV, Budget smart tv, Smart TV

ఉత్తమ కథలు