కరోనా తర్వాత ఆడియో ఉత్పత్తులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఇయర్‌ఫోన్లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ మార్కెట్ గణనీయంగా విస్తరించింది. దీంతో ప్రస్తుతం ఇయర్‌ఫోన్ల వినియోగం అత్యంత సాధారణంగా మారిపోయింది. అయితే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ల మార్కెట్ గణనీయంగా విస్తరించినప్పటికీ.. చాలా మంది ఇప్పటికీ వైర్డ్ ఇయర్‌ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లతో పోలిస్తే ఈ వైర్డ్ ఇయర్‌ఫోన్లు చాలా మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ప్రస్తుతం, భారత మార్కెట్లో కేవలం రూ. 1,000లోపు లభిస్తున్న బెస్ట్ వైర్డ్ ఇయర్‌ఫోన్లను పరిశీలిద్దాం.
సోనీ MDR–EX155AP హెడ్‌సెట్
రూ. 1000లోపు లభిస్తున్న బెస్ట్ వైర్డ్ ఇయర్‌ఫోన్లలో సోనీ MDR–EX155AP హెడ్‌సెట్ ముందుంటుంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో కేవలం రూ. 999 ధర వద్ద లభిస్తుంది. దీనిలో 9mm డ్రైవర్లను సోనీ సంస్థ అమర్చింది. ఈ ఇయర్‌బడ్స్ 5Hz నుంచి 24,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెన్సాన్స్ రేటును కలిగి ఉంటాయి.
రియల్మీ బడ్స్ 2
రియల్మీ బడ్స్ 2 కేవలం రూ. 599 వద్ద లభిస్తుంది. రియల్మీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్మీ బడ్స్ 2 ఇయర్‌ఫోన్లలో 11.2 మిమీ బాస్ బూస్ట్ డ్రైవర్ ను అమర్చింది. ఇది టాంగిల్ ఫ్రీ కేబుల్ గల కేబుల్ ఆర్గనైజర్‌తో వస్తుంది.
బోట్ బాస్‌హెడ్స్ 225
బోట్ బాస్‌హెడ్స్ 225 ఇన్- ఇయర్ ఇయర్‌ఫోన్ రూ. 549 వద్ద లభిస్తుంది. దీన్ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌ఫోన్లలో 10mm డ్రైవర్లను అమర్చింది. ఇది 20Hz నుంచి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌ఫోన్ పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది.
సోనీ స్పోర్ట్స్ ఇన్-ఇయర్ వైర్డ్ ఇయర్‌ఫోన్
సోనీ స్పోర్ట్స్ ఇన్-ఇయర్ వైర్డ్ ఇయర్‌ఫోన్ కేవలం రూ. 699 ధర వద్ద లభిస్తుంది. దీన్ని క్రోమా స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌ఫోన్ 17Hz - 22,000Hz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేటుతో వస్తుంది. 13.5mm డైనమిక్ డ్రైవర్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌ఫోన్ రబ్బరైజ్డ్ ఫినిషింగ్ కేబుల్, ఎరౌండ్ ది ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
స్కల్‌కాండీ S2DUL హెడ్‌సెట్
స్కల్‌కాండీ S2DUL హెడ్‌సెట్ రూ. 630 ధర వద్ద లభిస్తుంది. స్కల్‌కాండీ జిబ్ వైర్ ఇన్-ఇయర్ ఇయర్‌ఫోన్లను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌ఫోన్లలో 10mm డ్రైవర్‌ను అమర్చింది. ఇది 20Hz నుంచి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేటును కలిగి ఉంటుంది. ఈ హెడ్‌సెట్ విభిన్న రంగుల్లో లభిస్తుంది.
జేబీఎల్ C200SI
జేబీఎల్ C200SI ఇన్-ఇయర్ ఇయర్‌ఫోన్ రూ. 799 ధర వద్ద లభిస్తుంది. ఇది అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌ఫోన్ 20Hz నుంచి 20,000Hz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధితో వస్తుంది. ఇయర్‌ఫోన్ సెట్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. 3.5mm గోల్డ్ ప్లేటెడ్ హెడ్‌ఫోన్ జాక్ కలిగి ఉంటుంది.
ఆడియో టెక్నికా ATH-COR150RD
ఆడియో టెక్నికా ATH-COR150RD ఇయర్‌ఫోన్లు రూ. 749 ధర వద్ద లభిస్తాయి. ఇవి 20mW గరిష్ట ఇన్‌పుట్ పవర్ కలిగి ఉంటాయి. ఈ ఇయర్‌ఫోన్లు 20Hz నుంచి 25,000Hz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేటుతో వస్తాయి. 1.2 మీటర్ల కేబుల్ కలిగి ఉంటాయి. ఈ ఆడియో టెక్నికా ATH-COR150RD వైర్డ్ ఇయర్‌ఫోన్లు ఎనిమిది విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gadget, Mobile, Smartphones, Technology