Home /News /technology /

Lenovo Yoga Tab 11: లెనోవో యోగా ట్యాబ్ 11 రిలీజ్... సేల్‌లో రూ.10,000 తగ్గింపు

Lenovo Yoga Tab 11: లెనోవో యోగా ట్యాబ్ 11 రిలీజ్... సేల్‌లో రూ.10,000 తగ్గింపు

Lenovo Yoga Tab 11: లెనోవో యోగా ట్యాబ్ 11 రిలీజ్... సేల్‌లో రూ.10,000 తగ్గింపు
(image: Lenovo India)

Lenovo Yoga Tab 11: లెనోవో యోగా ట్యాబ్ 11 రిలీజ్... సేల్‌లో రూ.10,000 తగ్గింపు (image: Lenovo India)

Lenovo Yoga Tab 11 | వీకెండ్‌లో సినిమాలు చూసేందుకు ట్యాబ్లెట్ (Tablet) కొనాలనుకుంటున్నారా? లెనోవో నుంచి యోగా ట్యాబ్ 11 రిలీజ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

ప్రముఖ స్మార్ట్​ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో యోగా ట్యాబ్ 11 ట్యాబ్లెట్​ను (Lenovo Yoga Tab 11) భారత మార్కెట్లోకి లాంచ్​ చేసింది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్​పై పనిచేస్తుంది. ఇది 7,500mAh బ్యాటరీతో వస్తుంది. టాబ్లెట్‌ని వివిధ కోణాల్లో సెట్​ చేయడానికి వెనుక భాగంలో ప్రత్యేకమైన మెటల్ స్టాండ్​ను అమర్చింది. లెనోవో యోగా ట్యాబ్ 11 మీడియాటెక్ హీలియో G90T SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 2K రిజల్యూషన్‌ గల 11-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ట్యాబ్లెట్​ ప్రెసిషన్ పెన్ 2 స్టైలస్‌, గూగుల్ కిడ్స్ స్పేస్‌కు మద్ధతిస్తుంది. జూన్‌ నెలలోనే యూరప్‌లో లాంచ్​ అవ్వగా..​ ఆలస్యంగా భారత మార్కెట్​లోకి ఇప్పుడు విడుదలైంది.

లెనోవో యోగా ట్యాబ్ 11 ధర


కొత్త లెనోవో యోగా ట్యాబ్ 11 సింగిల్ వేరియంట్​లో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్​ గల బేస్​ వేరియంట్​ రూ. 40,000 ధర వద్ద విడుదలైంది. అయితే అమెజాన్​లో ప్రారంభపు ఆఫర్ కింద దీన్ని కేవలం రూ. 29,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది స్టార్మ్ గ్రే కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ టాబ్లెట్ అమెజాన్ ఇండియా, లెనోవా ఇండియా ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చి చూడండి

లెనోవో యోగా ట్యాబ్ 11 స్పెసిఫికేషన్లు


లెనోవో యోగా ట్యాబ్ 11.. ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. ఇది 11 అంగుళాల 2K IPS TDDI టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది డాల్బీ విజన్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ARM మాలి- G76 MC4 GPU చిప్​సెట్​ గల మీడియాటెక్​ హీలియో జీ90టీ ఎస్​ఓసీ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​తో వస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ సహాయంతో స్టోరేజ్​ స్పేస్​ను 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.

Poco F3 GT: తొలిసారి ఆఫర్‌లో పోకో ఎఫ్3 జీటీ... రూ.28,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.12,000 లోపే కొనండి ఇలా

కెమెరా విషయానికి వస్తే.. దీనిలో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్ కెమెరాలను అందించింది. దీనిలోని​ 7,500mAh బ్యాటరీ 20W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 15 గంటల ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. యూఎస్​బీ టైప్-సి పోర్ట్, బ్లూటూత్ v5, వైఫై 802.11, యూఎస్​బీ ఓటీజీ వంటివి అందించింది. మీ పిల్లలు సెర్చింగ్​ను ట్రాక్​ చేసేందుకు గూగుల్ కిడ్స్ స్పేస్‌ ఫీచర్​ను కూడా చేర్చింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon, AMAZON INDIA, Lenovo, Tablet

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు