Home /News /technology /

LENOVO TAB THE NEWEST TABLET IN THE INDIAN MARKET LAUNCHES LENOVO P12 PRO TAB TO COMPETE WITH THE IPAD GH VB

Android Tablet With Snapdragon : డిస్‌ప్లే 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో సరికొత్త ట్యాబ్లెట్.. ఐప్యాడ్‌కు పోటీగా.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవో.. ఇండియాలో మార్కెట్, బ్రాండ్ వ్యాల్యూను మరింత పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త ట్యాబ్‌ను భారత్‌లో విడుదల చేసింది.

చైనా టెక్నాలజీ(China Technology) దిగ్గజం లెనోవో(Lenovo).. ఇండియాలో మార్కెట్(India Market), బ్రాండ్ వ్యాల్యూను(Brand Value) మరింత పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త ట్యాబ్‌ను(Tab) భారత్‌లో విడుదల చేసింది. ప్రీమియం సెగ్మెంట్‌లో(Premium Segment) లెనోవో ట్యాబ్ పీ12 ప్రో (Tab P12 Pro) పేరుతో ఓ ట్యాబ్‌ను విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్(Snap Dragon) 800 సిరీస్ చిప్‌సెట్(Chipset) అమర్చిన ఈ ట్యాబ్(Tab).. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ(Build Quality), హై ఎండ్ ఫినిషింగ్‌తో(High End Finishing) వస్తుంది. జేబీఎల్(JBL) స్పీకర్లు స్టీరియో సౌండ్ ఎక్స్‌పీరియన్స్(Stereo Sound Experience) అందిస్తాయి. దీని AMOLED డిస్‌ప్లే(Display) ఎక్కువసేపు పని చేసుకోవడం సహా మూవీ వాచింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. లెనోవో ట్యాబ్ P12 ఆండ్రాయిడ్ టాబ్లెట్ ఇండియన్ మార్కెట్లో రూ.69,999కి అందుబాటులో ఉంది. Lenovo అఫీషియల్ వెబ్‌సైట్ సహా.. ఇతర ఆన్‌లైన్ సైట్‌ల(Online Site) నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు. మరిన్ని ఫీచర్లను చదివేయండి మరి..

స్పెసిఫికేషన్స్..
ట్యాబ్ P12 ప్రో మోడల్‌లో అదిరిపోయే స్పెసిఫికేషన్లను అందిస్తోంది లెనోవో. 12.6 అంగుళాల WQVGA AMOLED డిస్‌ప్లే 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ట్యాబ్ లభిస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇస్తుంది. అంతేగాక HDR 10+ డాల్బీ విజన్‌కు సపోర్ట్ సైతం లభిస్తుంది. ప్రీమియం టచ్‌ ఇచ్చే మెటల్ బిల్డ్ క్వాలిటీ గల ఈ ల్యాప్ టాప్ కేవలం 565 గ్రాముల లైట్ వెయిట్ మాత్రమే ఉంటుంది.



ఇన్ బిల్ట్ పరంగా చూస్తే.. స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌ను దీనిలో అమర్చారు. 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ 1TB వరకు ఎక్స్పాండబుల్ మెమరీకి వీలు కల్పిస్తున్నారు. ఇక ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలు సైతం దీనికి అదనపు ఆకర్షణ. రియర్ సైడ్ 13 అండ్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. జేబీఎల్ క్వాడ్ స్పీకర్లు.

Save Electricity Bill: మీ ఇంటి కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా..? ఈ 5 టిప్స్‌తో బిల్లు తగ్గించుకోండి..


సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 11/12పై ఆధారపడి పనిచేస్తుందని లెనోవో చెబుతోంది. అయితే తొలుత ఆండ్రాయిడ్ 11ని ఆఫర్ చేసే అవకాశం ఉందని, ఆ తర్వాత ఆండ్రాయిడ్ 12 వెర్షన్ రావొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక బ్యాటరీ పరంగా అత్యుత్తమమైన 10,000mAhను అమర్చింది. ఇది పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 3 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది.

Mahindra XUV300: మహీంద్రా XUV 300 నుంచి కొత్త వేరియంట్‌.. త్వరలో ఇండియాలో లాంచ్.. వివరాలిలా..


ఇతర ట్యాబ్‌లతో పోల్చుకుంటే Lenovo Tab P12 ఆండ్రాయిడ్ టాబ్లెట్ ధర ఖరీదైనదిగా అనిపిస్తుంది. అయితే Samsung Galaxy Tab S సిరీస్‌తో పాటు.. ఐప్యాడ్‌లతో పోటీపడేలా Lenovo Tab P12 Proను డిజైన్ చేసినట్లు లెనోవో పేర్కొంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Lenovo, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు