Lenovo Tab K10: భారత మార్కెట్​లోకి లెనోవో ట్యాబ్​ K10 విడుదల.. బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా విడుదలైన లెనోవో ట్యాబ్​ K10 ప్రారంభ వేరియంట్​ రూ. 25,000 ధర వద్ద లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఫెస్టివల్​ సీజన్​​ నడుస్తున్నందున సంస్థ వీటిపై ఆఫర్లను ప్రకటించింది.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ లెనోవో(Lenovo) భారత మర్కెట్​లోకి సరికొత్త ట్యాబ్​(Tablet)ను లాంఛ్​ చేసింది. లెనోవో ట్యాబ్​​ K10 (Lenovo Tab K10) మోడల్​ను సంస్థ సోమవారం ఆవిష్కరించింది. ఈ సరికొత్త మోడల్​లో 10.3 అంగుళాల ఫుల్​ హెచ్​డీ టీడీడీఐ డిస్‌ప్లేను అందించింది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్​ హీలియో P22T SOC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. ఇది 10W ఛార్జింగ్ సపోర్ట్‌ గల 7,500mAh బ్యాటరీతో వస్తుంది. దీని డ్యుయల్ స్పీకర్లు డాల్బీ ఆడియోకి మద్దతునిస్తాయి.

లెనోవో ట్యాబ్​ K10 ధర, లభ్యత:
తాజాగా విడుదలైన లెనోవో ట్యాబ్​ K10 ((Lenovo Tab K10)) ప్రారంభ వేరియంట్​ రూ. 25,000 ధర వద్ద లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఫెస్టివల్​ సీజన్​​ నడుస్తున్నందున సంస్థ వీటిపై ఆఫర్లను ప్రకటించింది. 3 జీబీ ర్యామ్​ + 32 జీబీ స్టోరేజ్​ గల Wi-Fi + 4G LTE వెర్షన్‌ రూ. 13,999 వద్ద లభిస్తుంది. 4 జీబీ ర్యామ్​ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ వైఫై ఓన్లీ మోడల్​ రూ. 15,999, వైఫై + 4 జీ ఎల్​టీఈ మోడల్​ రూ. 16,999 వద్ద అందుబాటులో ఉంటాయి. లెనోవో టాబ్లెట్ ఏకైక అబిస్ బ్లూ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. లెనోవో అధికారిక వెబ్‌సైట్​లో కేవలం రూ. 2,333 చెల్లించి 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐపై దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Lenovo Yoga Tab 11: లెనోవో యోగా ట్యాబ్ 11 రిలీజ్... సేల్‌లో రూ.10,000 తగ్గింపు

లెనోవో ట్యాబ్ K10 ఫీచర్లు
లెనోవో ట్యాబ్​ K10 ఆండ్రాయిడ్​ 11 ఆధారిత ఓఎస్​పై పనిచేస్తుంది. త్వరలోనే ఆండ్రాయిడ్​ 12కి అప్‌గ్రేడ్ అవ్వనుంది. ఇది 10.3 అంగుళాల ఫుల్​హెచ్​డీ TDDI డిస్‌ప్లేతో పనిచేస్తుంది. లెనోవో ట్యాబ్​ యాక్టివ్​ పెన్​కు మద్దతిస్తుంది. ఇది పవర్‌విఆర్ జీఈ8320 జీపీయూ చిప్​సెట్​తో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్​ హీలియో P22T SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 128 జీబీ ఆన్​బోర్డ్​ స్టోరేజ్​ను అందించింది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను 1TB వరకు విస్తరించుకోవచ్చు.
Nokia T20 Tablet: నోకియా టీ20 ట్యాబ్లెట్ లాంచ్.. 8,200 ఎంఏహెచ్​ అతిపెద్ద బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు

కెమెరా విషయానికి వస్తే.. లెనోవో ట్యాబ్​ K10 ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్‌ గల 8-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో 5- మెగాపిక్సెల్ ప్రైమరీ సెల్ఫీ సెన్సార్ కెమెరా ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. డ్యూయల్-బ్యాండ్ వైఫై, 4 జీ ఎల్​టీఈ, బ్లూటూత్ v5, యూఎస్​బీ టైప్- సీ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి అందించింది. మరోవైపు, డాల్బీ అట్మోస్‌తో డ్యుయల్ స్పీకర్లను కూడా చేర్చింది.
Published by:Nikhil Kumar S
First published: