Home /News /technology /

LENOVO NEW TAB P11 PLUS HAS LAUNCHED IN INDIA UMG GH

Tab P11 Plus: లెనోవో న్యూ ట్యాబ్ లాంచ్.. సూపర్ ఫీచర్స్.. చూస్తే కొనేస్తారంతే..!

లెనోవో కొత్త ట్యాబ్ లాంచ్

లెనోవో కొత్త ట్యాబ్ లాంచ్

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ లెనోవో (Lenovo) తరచూ అద్భుతమైన బడ్జెట్, మిడ్ రేంజ్ ట్యాబ్‌లను రిలీజ్ చేస్తోంది. భారతదేశంలో కూడా ఉత్తమ ఫీచర్లతో ఆకర్షణీయమైన ట్యాబ్స్‌ను లాంచ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ ట్యాబ్‌ P11 ప్లస్ (Tab P11 Plus) పేరుతో ఓ సరికొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...
ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ లెనోవో (Lenovo) తరచూ అద్భుతమైన బడ్జెట్, మిడ్ రేంజ్ ట్యాబ్‌లను రిలీజ్ చేస్తోంది. భారతదేశంలో కూడా ఉత్తమ ఫీచర్లతో ఆకర్షణీయమైన ట్యాబ్స్‌ను లాంచ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ ట్యాబ్‌ P11 ప్లస్ (Tab P11 Plus) పేరుతో ఓ సరికొత్త ట్యాబ్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ట్యాబ్లెట్ (Tablet) 11 అంగుళాల 2K డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్‌ సపోర్ట్‌తో క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌, 7,700 mAh బ్యాటరీ వంటి బెస్ట్ ఫీచర్స్‌తో వచ్చింది. అయితే దీని ధర ఊహించిన దానికంటే కాస్త అధికంగా ఉండటం గమనార్హం. వినియోగదారులు ట్యాబ్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ సరికొత్త ట్యాబ్ మిగతా ఫీచర్లు, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* Lenovo Tab P11 Plus స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ట్యాబ్‌ P11 ప్లస్ డ్యూయల్-టోన్ బ్రష్డ్ మెటల్ ఫినిషింగ్‌, వేరు చేయగల కీబోర్డ్, పోగో-పిన్‌లు, 6GB RAM+128GB స్టోరేజ్, MediaTek Helio G90T ప్రాసెసర్‌, డాల్బీ అట్మోస్‌ సపోర్ట్‌తో క్వాడ్-స్పీకర్ సెటప్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్ వంటి మరెన్నో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్‌లో మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ (Micro SD Card) ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకోవచ్చు. కంపెనీ ట్యాబ్‌కు భవిష్యత్తులో ఎన్ని అప్‌డేట్‌లను అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇందులో అందించిన 7,700 mAh బ్యాటరీ 15 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. వెనుక 13MP ప్రైమరీ కెమెరా, ముందు 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఈ ఫ్రంట్ కెమెరాతో వీడియో కాల్స్‌ చేయవచ్చు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఎనేబుల్ చేయవచ్చు. ఈ ట్యాబ్ బ్లూటూత్ 5.1తో పాటు ముఖ్యమైన సెన్సార్లు, Wi-Fi వంటి కనెక్టువిటీ ఫీచర్లలతో వస్తుంది. కంపెనీ ఇందులో 20W ఛార్జింగ్ అడాప్టర్‌, టైప్-సి పోర్ట్‌ను ఆఫర్ చేసింది.

ఇదీ చదవండి: యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా రష్యా గెలవలేకపోతోంది ఎందుకు..?


* ధరే కాస్త ఎక్కువ!
లెనోవో ట్యాబ్‌ MediaTek Helio G90T ప్రాసెసర్‌తో వస్తుంది. అయితే రూ.25,999 ధరలో ఈ ప్రాసెసర్ కంటే మరింత మెరుగైన ప్రాసెసర్ గల ట్యాబ్‌ని సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ ప్రాసెసర్‌ ఉత్తమమైనది కాదు కాబట్టి దీని ధరను కొంచెం తగ్గించి కంపెనీ తీసుకు రావాల్సింది. అయితే డిస్‌ప్లే చిన్నదిగా ఉంది కాబట్టి MediaTek Helio G90T మెరుగైన పర్ఫామెన్స్, క్వాలిటీని అందిస్తుందని చెప్పొచ్చు. ఇక ఇందులో అందించిన 60Hz రిఫ్రెష్ రేట్ కూడా ధర పరంగా ఆశించదగినది కాదు. ఇంచుమించు ఇదే ధరల్లో యూజర్లు 120Hz రిఫ్రెష్ రేట్ గల డిస్‌ప్లే పొందొచ్చు. నిజానికి ఈ ట్యాబ్లెట్ గ్లోబల్ వేరియంట్ ధర కేవలం 209.99 డాలర్ల నుంచే ప్రారంభమవుతుంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 16,600. ఈ ధర ఆధారంగా ఈ లెనోవో టాబ్లెట్ రూ.20,000 లోపు ధరతో ఇండియాలో లాంచ్ అవ్వొచ్చని టెక్ నిపుణులు భావించారు. కానీ ఊహించిన ధరతో కంపెనీ షాక్ ఇచ్చింది.



* లెనోవో ట్యాబ్‌ P11 Plus ధర, లభ్యత
లెనోవో ట్యాబ్‌ P11 Plus ట్యాబ్లెట్ పీసీ ఒకే వేరియంట్... స్లేట్ గ్రే అనే ఒకే కలర్ ఆప్షన్‌లో లాంచ్ అయ్యింది. 6GB+ 128GB వేరియంట్ ట్యాబ్ ధర రూ. 25,999గా కంపెనీ నిర్ణయించింది. లెనోవో ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్‌లో దీనిని కొనుగోలు చేయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Lenovo, Smart phones, Tablet, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు