రేటు ఎక్కువ అయినప్పటికీ... కాల్చే కరెంటు తక్కువ అన్న ఉద్దేశంతో... ఈ రోజుల్లో చాలా మంది ఎల్ఈడీ బల్బులను ఎక్కువగా వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బల్బులకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఐతే... ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో షాకింగ్ విషయాలు తెలిశాయి. తెల్లటి కాంతిపుంజంలా మెరిసే ఈ బల్బులు... దీర్ఘకాలంలో కళ్లకు తీవ్ర హాని చేస్తాయని తేలింది. ఈ బల్బులు తెలుపు రంగు కాంతిని ఇస్తున్నాయని మనం అనుకుంటున్నాం కానీ... ఇదే కాంతిలో బ్లూ కలర్ లైటింగ్ కూడా కలిసి ఉంటుంది. అది కంటి రెటీనాలోని కణజాలం దెబ్బతీస్తుందనీ, కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి కాంతిలో ఎక్కువ సేపు ఉంటే... రెటీనాలోని అతి సున్నిత కణాలు దెబ్బతింటాయట. అందువల్ల కంటి చూపు బాగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. తలనొప్పి, కళ్లు అలసిపోవడం, ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు.
ఫ్రాన్స్‌కి చెందిన ఫుడ్, ఎన్విరాన్మెంటల్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఏజెన్సీ (ANSES) జరిపిన పరిశోధనలో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మరో నమ్మలేని విషయం కూడా చెప్పారు. మన శరీరంలో ఉండే జీవగడియారం (Bio-Clock) కూడా ఎల్ఈడీ బల్బుల వల్ల దెబ్బతింటుందని తెలిసింది. అంటే... ప్రస్తుతం మనం రాత్రివేళ నిద్రపోతాం. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ చేస్తాం. అదే ఎల్ఈడీ బల్బుల కాంతిలో ఎక్కువ సేపు ఉండేవారిలో ఈ సిస్టం మొత్తం మారిపోతుందట. టైముకి సరిగా నిద్రపట్టదనీ, ఆకలి కూడా మందగిస్తుందనీ చెబుతున్నారు.
మరి సెల్ఫోన్లూ, ల్యాప్‌టాప్‌ల సంగతేంటి : ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు కూడా LED స్క్రీన్లు ఉంటున్నాయి. కాకపోతే, వీటి నుంచీ వచ్చే కాంతి తక్కువగా ఉంటుందనీ, అందువల్ల ఇవి అంతగా ప్రమాదకరం కావనీ చెబుతున్నారు. ఐతే... వీటిని కాంతి ఉన్నచోటే వాడాలనీ, చీకట్లో వాడితే కంటికి ఇబ్బందేనని సూచిస్తున్నారు. వీలైనంతవరకూ వైట్ కలర్ లెడ్ లైట్లనే వాడమని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
బెంగాల్లో బీజేపీ వ్యూహం ఫలిస్తోందా... మమతాబెనర్జీకి షాక్ తప్పదా..?
100+18 ఇదీ వైసీపీ లెక్క... జగన్ చేయించిన 5 సర్వేల్లో తేలిందేంటి..?
జనసేన పోటీ వెనక చంద్రబాబు వ్యూహం..? పక్కా ప్లాన్‌తో అంతా జరుగుతోందా..?
కౌంటింగ్ రోజున ఏం జరుగుతుందంటే... పూర్తి వివరాలు ఇవిగో...