హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Lava Smartphones: ఇండిపెండెన్స్ డే స్పెషల్... రూ.1,333 ధర నుంచి మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు

Lava Smartphones: ఇండిపెండెన్స్ డే స్పెషల్... రూ.1,333 ధర నుంచి మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు

Lava Smartphones: ఇండిపెండెన్స్ డే స్పెషల్... రూ.1,333 ధర నుంచి మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు
(ప్రతీకాత్మక చిత్రం)

Lava Smartphones: ఇండిపెండెన్స్ డే స్పెషల్... రూ.1,333 ధర నుంచి మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు (ప్రతీకాత్మక చిత్రం)

Lava Smartphones | కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ కంపెనీ అయిన లావా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఫోన్లను రిలీజ్ చేసింది.

  మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన లావా సరికొత్త మోడల్స్‌ని మార్కెట్లోకి లాంఛ్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఫీచర్ ఫోన్లను పరిచయం చేస్తోంది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'ప్రౌడ్లీఇండియన్' స్పెషల్ ఎడిషన్ లావా జెడ్61ప్రో, లావా ఏ5, లావా ఏ9 ఫోన్లను రిలీజ్ చేసింది. ఇవి లిమిటెడ్ ఎడిషన్ ఫోన్లు మాత్రమే. ఫోన్ వెనుక త్రివర్ణ పతాకం లోగో ఉంటుంది. లావా జెడ్61ప్రో గత నెలలో రిలీజైంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా #ProudlyIndian లోగోతో షాంపైన్ గోల్డ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.5,777. ఇక ఈ ఫోన్‌తో పాటు లావా ఏ5, లావా ఏ9 ఫీచర్ ఫోన్లను కూడా #ProudlyIndian లోగోతో అమ్ముతోంది.

  Smartphone: ఆగస్టులో రూ.10,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  Xiaomi: ట్రిమ్మర్ లాంఛ్ చేసిన షావోమీ... ధర ఎంతో తెలుసా?

  లావా జెడ్61 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 5.45 అంగుళాల హెచ్‌డీ+ ఫుల్ వ్యూ డిస్‌ప్లే ఉంది. 2జీబీ+16జీబీ వేరియంట్‌లో లభిస్తుంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాటరీ 3100 ఎంఏహెచ్. అంబర్ రెడ్, మిడ్‌నైట్ బ్లూ, షాంపైన్ గోల్డ్ కలర్స్‌లో కొనొచ్చు. ధర రూ.5,777. ఇక లావా ఏ5 ఫీచర్స్ చూస్తే డ్యూయెల్ సిమ్ ఫీచర్ ఫోన్ ఇది. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే 240x320 పిక్సెల్స్‌తో ఉంటుంది. వెనుకవైపు 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మెమొరీ 32జీబీ వరకు పెంచుకోవచ్చు. 1,000ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మరో కొత్త ఫీచర్

  Paytm: పేటీఎం పేమెంట్స్ కోసం కొత్త డివైజ్... నెలకు రూ.499 మాత్రమే

  ఇక లావా ఏ9 ఫీచర్స్ చూస్తే 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే 240x320 పిక్సెల్స్‌తో ఉంటుంది. వెనుకవైపు 1.3 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4ఎంబీ ర్యామ్‌తో పనిచేస్తుంది. మెమొరీ 32జీబీ వరకు పెంచుకోవచ్చు. 1,700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. లావా ఏ5 ధర రూ.1,333 కాగా, లావా ఏ9 ధర రూ.1,574. ఈ మూడు మోడల్స్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు రీటైల్ ఔట్‌లెట్స్‌లో కొనొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Mobile, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు